వ్యాపారులు
వారి వారి స్థానాలలో కూర్చోవడానికి ఉదయం సూర్యోదయంలో శుభకరమైన సమయం ఉంది.
అలాగే మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం గం. 4.30లకు లాభం మరియు అమృత
ఘడియలున్నాయి.
సాయంకాలం గం.5.40లనుంచి గం. 8.40ల వరకు ఉంటుంది. దీపావళి పూజ ఎల్లప్పుడూ స్థిరమైన లగ్నంలోనే చేస్తారు.
దీపావళి రోజు రాత్రికి స్థిర లగ్నం ఇలా ఉంది:
మధ్యాహ్నం కుంభ లగ్నంలో గం. 3.10ల నుంచి గం. 4.35ల వరకుంటుంది.
సాయంకాలం
వృషభ లగ్నం గం. 7.44ల నుంచి గం. 9.40ల వరకు అలాగే అర్థరాత్రి సింహ లగ్నం
గం. 2.12ల నుంచి గం. 4.29ల వరకుంది. ఇది దీపావళి రోజున చేయాల్సిన పూజా
సమయం.
శ్రీ
మహాలక్ష్మీ పూజ మరియు దీపావళి మహాపర్వం ఆశ్వయుజ మాసం అమావాస్య నాడు
సాయంత్రం మరియు అర్థరాత్రి సమయంలోనైతే ప్రత్యేకంగా శుభకరంగా ఉంటుంది.
దీపావళి
రోజు సాయంత్రం స్నానపానాదులు పూర్తయిన తర్వాత స్వచ్ఛమైన వస్త్రాభరణాలు
ధరించి దేవాలయంలో మంత్రోచ్ఛారణల నడుమ దీపదానం చేసి మీ ఇంట్లో శ్రీ
గణేషునితోపాటు మహాలక్ష్మీ, మహాకాళిలకు పూజలు చేసి అల్పాహారం తీసుకోండి.
తర్వాత
సాయంకాలం, నిశీతి తదితర శుభ ముహూర్తాలలో మంత్ర జపం, యంత్ర సిద్ధి తదితరాలు
నిర్వహించాలి. దీపావళి పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో నలువైపులా దీపాలను
వెలిగించాలి. ఇవి రాత్రి పూర్తిగా వెలగేలా ఏర్పాటు చేసుకోవాలంటున్నాయి
పురాణాలు. దీంతో ఇంట్లో సౌభాగ్యం వెల్లివిరుస్తుంది.
2009
అక్టోబర్ 17న శనివారం అమావాస్య మరియు హస్త నక్షత్రం వస్తుంది. కాని
సాయంత్రం తర్వాత చిత్ర నక్షత్రం ఉండటంతో దీపావళి పండుగను
జరుపుకోవాలంటున్నారు పంచాంగకర్తలు. శనివారం నాడు వచ్చే దీపావళి పండుగలో
నిర్వహించే మంత్రజపం, సిద్ధి మరియు సాధనల కొరకు ప్రత్యేకమైన రోజుగా
భావిస్తున్నారు పంచాంగకర్తలు.
శనివారం నాడు అమావాస్య వస్తే నదిస్నానం, పితృ తర్పణం చేయడంతో వెయ్యి గోవులను దానం చేసిన ఫలితం లభిస్తుందంటున్నారు వేద పండితులు.
లక్ష్మీ
పూజకు సరైన ముహూర్తం తెలియకపోతే మీరు ఎన్ని సార్లు పూజలు చేసినా ఫలితం
ఉండదు. లక్ష్మీ పూజకు శుభముహూర్తం ఉంది. దీని గురించి పూర్తి వివరాలు
మీకోసం…
సాయంత్రం గం. 7.21లకు మేష లగ్నం, ఆ తర్వాత గం. 7.22ల నుంచి రాత్రి గం.9.15ల వరకు వృషభ లగ్నంలో ప్రత్యేకంగా ఉంటుంది.
సాయంత్రం వృషభ లగ్నంలో హస్త నక్షత్రం, తుల రాశిలో రవి లాభకారిగా ఉన్నాడు.
కాబట్టి
సాయంత్రం గం. 7.22ల నుంచి గం. 10.19ల మధ్య దీప ప్రజ్వలన చేయాలి. రాత్రి
గం. 9.02ల నుంచి గం.9.16ల మధ్య లక్ష్మీ పూజను ప్రారంభించడం చాలా
శ్రేయస్కరం. దీంతో పలు శుభాలు కలుగుతాయంటున్నారు పంచాంగకర్తలు.