Thursday, 1 December 2016

పుదీనాతో గొంతునొప్పితో పాటు మిగతా జబ్బులు ఎలా దూరమవుతాయంటే….

పుదీనాను ఆహార పదార్థాలకు మంచి సువాసన ఇచ్చేందుకు మాత్రమే కాదు..
చిన్నచిన్న అనారోగ్య సమస్యలకు ఔషధంగా కూడా ఉపయోగిస్తారు.




ఇటీవల పుదీనా టీ ఎంతో పాపులర్‌ అయ్యింది. పుదీనాను ఐస్‌ క్రీమ్‌, టూత్‌ పేస్టులలోనూ ఉపయోగిస్తారు. దీనికి కారణం ఇందులో ఉన్న ఔషధ గుణమే. పుదీనా జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది.

ఆకు కూరల్లో పుదీనా ఆకుకు ప్రత్యేకమైన ఔషధ గుణాలున్నాయి.
పలు రకాలైన రుగ్మతలకు పుదీనా మంచి మందు. అజీర్ణం, కుడుపు ఉబ్బరం, వికారం, వాంతులు తగ్గడానికి పుదీనా రసం, నిమ్మరసం, తేనె ఒక్కొక్క చెంచా చొప్పున కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

gonthu-noppi

పిత్తాశయం నుంచి వచ్చే జీర్ణరసాల ప్రభావం ఆహార పదార్థాలలోని కొవ్వుల మీద పనిచేసేలా ప్రేరేపిస్తుంది.



కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. గొంతు నొప్పికి ఇది దివ్వౌషధంగా పనిచేస్తుంది.

కళ్లెను కరిగించి, దగ్గు నుంచి ఉపశమనమిస్తుంది.

కీటకాలు కుట్టిన బాధ నుంచి పుదీనా రసం ఉపశమనాన్ని ఇస్తుంది.

చర్మంపై ఉన్న మచ్చలను తొలగించే శక్తి పుదీనాకు ఉంది.

అపస్మారక స్థితిలో వెళ్లినవారికి రెండు చుక్కల పుదీనా రసం ముక్కులో వేస్తే కోలుకుంటారు.

గర్భిణిలలో తలెత్తే పలు అనారోగ్య సమస్యలకు పుదీనా పచ్చడి ఔషధంగా పనిచేస్తుంది. అదేవిధంగా

తలనొప్పితో బాధపడేవారు పుదీనా ఆకులను ముద్దగా చేసి
నుదుటిపై ఉంచితే ఉపశమనం లభిస్తుంది.

గొంతు నొప్పితో బాధపడేవారు పుదీనా కషాయంలో ఉప్పు కలిపి పుక్కిలి పడితే సమస్య తీరుతుంది.

దంత వ్యాధులతో బాధపడేవారు సైతం ప్రతిరోజూ పుదీనా ఆకులను నమిలితే ఫలితం ఉంటుంది.

ఎన్నో ఔషధగుణాలున్న పుదీనా ప్రతిఇంట్లో తప్పక ఉండాల్సిన మొక్క. ఇది చాలా తేలికగా పెరుగుతుంది.

జాగ్రత్త ………… ఈ మొక్క నిమిషాల్లోనే ప్రాణాలు తీస్తుంది,

ప్రతి ఒక్కరూ తమ ఇల్లు అందంగా ఉండాలని ఆశిస్తారు.
అందుకోసం రకరకాల పూల మొక్కలతో పాటు వెడల్పాటి ఆకులతో చూడగానే పచ్చదనం ఉట్టిపడే
అలంకరణ మొక్కలను ఇంటి లోపల కూడా పెట్టుకుంటున్నారు. అలా పెట్టుకునే మొక్కలలో
కొన్ని అతి ప్రమాదకర మొక్కలు ఉన్నాయని మనలో చాలా మందికి తెలియదు.


అలాంటి ఒక మొక్క ఏమిటంటే…………
వెడల్పాటి ఆకులతో , ఆకుల మధ్యలో తెల్లటి మచ్చలతో ఉండే ఈ మొక్క ఇండోర్ మరియు ఔట్ డోర్ ప్లాంట్ గా చాలా ఇళ్ళల్లోనూ , ఆఫీసుల్లోనూ మరియు పార్కుల్లోనూ మనకు కనిపిస్తూ ఉంటుంది.

Dumb Cane or Dieffenbachia అనే శాస్త్రీయ నామంతో పిలవబడే ఈ మొక్క
మనుషుల ప్రాణాలకు చాలా ప్రమాదకరమైనదని నిరూపితమైంది.
సెంట్రల్ ఆఫ్రికాలో పుట్టి అక్కడి నుండి అన్ని ప్రాంతాలకు విస్తరించిన
ఈ మొక్కను సెంట్రల్ ఆఫ్రికా వాళ్ళు డెడ్ లీ ప్లాంట్ అని పిలుస్తారు.


ముఖ్యంగా చిన్నపిల్లలకు ఈ మొక్క యొక్క ఆకులు చాలా ప్రమాదకరమైనవి.
ఇంట్లోని చిన్నారులు పొరపాటున ఈ ఆకులను తుంచుకొని నమిలితే ……
ఒకే ఒక్క నిమిషం చాలు ప్రాణాలు పోవడానికి ….
అంటే ప్రాణాలకు ఎంత డేంజరో మనకు అర్థమవుతుంది.
అదే విధంగా పెద్ద వయసు వారు ఎవరైనా మాటల మధ్యలో అనుకోకుండా ఈ మొక్క ఆకులను తుంచి
నోట్లో పెట్టుకుంటే …… 15 నిమిషాల్లో ప్రాణాలు గాల్లో కలుస్తాయి.
మరో ముఖ్య విషయమేమిటంటే………….. ఈ మొక్క ఆకులను చేతులతో పట్టుకొని ….. పొరపాటున కళ్ళకు చేతులను తాకిస్తే ……. పూర్తిగా చూపు పోవడం గానీ లేదా
పాక్షికంగా కంటి చూపు తగ్గడం గానీ జరుగుతుంది.
ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నట్లయితే వాటి ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.
ఈ మొక్క మాదిరిగానే ఆకులు ఒకే విధంగా ఉండే చాలా రకాల మొక్కలు చాలా చోట్ల మనకు కనిపిస్తాయి. కానీ Dumb Cane or Dieffenbachia మొక్క మాత్రమే డేంజర్ అని గుర్తించండి.

దేవుడికి కర్పూరంతోనే హారతి ఎందుకు ఇస్తారంటే…

సాధారణంగా దేవునికి కర్పూరంతో హారతి ఇస్తారు. ఇలా కర్పూరంతో హారతి ఇవ్వడమే మంచిది, శ్రేష్టం.

karpoora-harati
ఎందుకంటే…….
కర్పూరం సూక్ష్మ క్రిములను నిర్మూలిస్తుంది. కాలుష్యాన్ని పోగొట్టి, వాతావరణాన్ని స్వచ్చంగా మారుస్తుంది. అంటువ్యాధులు ప్రబలకుండా చేస్తుంది. కళ్ళకు మంచిది. జలుబును, కఫాన్ని తగ్గిస్తుంది.



కర్పూరం అతి దాహం, ముఖ శోష లాంటి అనారోగ్యాలను నివారిస్తుంది.
మంటలు, దురదలు లాంటి చర్మ వ్యాధులకు బాగా పనిచేస్తుంది.




వాత, పిత్తాలను హరిస్తుంది. మానసిక జబ్బులను సైతం పోగొడుతుంది.
రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్త ప్రసరణ సవ్యంగా ఉండేలా చేస్తుంది.



గొంతు పూడుకుపోవడం, స్వరపేటికలో ఉండే దోషాలను నివారిస్తుంది.

ఇలా చెప్పుకుంటూ పొతే, కర్పూరం వల్ల అసంఖ్యాకమైన ఉపయోగాలు ఉన్నాయి.

ఆయుర్వేద చికిత్సలో కర్పూరాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు.
అసలు కర్పూర సువాసన పీలిస్తే చాలు శారీరక రుగ్మతలన్నీ పోయినట్లు, సేద తీరినట్లు ఉంటుంది.
మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
అలజడులు, ఆందోళనలు తగ్గించి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తుంది కర్పూరం.

కర్పూరంలో అనేక రకాలు ఉన్నాయి. హిమ కర్పూరం, వర్ణ కర్పూరం, శంకరావాస కర్పూరం,
చీనా కర్పూరం, పచ్చ కర్పూరం మొదలైనవి ముఖ్యమైనవి.
ఇన్ని ఔషధ గుణాలు కలది, అద్భుతమైంది కనుకనే కర్పూరంతో మంగళ హారతి ఇస్తారు.

అద్భుత రహస్య మంత్రాలు మీ కోసం.. తప్పక చదవండి.

ప్రతి నిత్యము పటించవలసిన ప్రార్దనలు 


 ? ఉదయం కరదర్శనం
“కరాగ్రే వసతే లక్ష్మీ: కరమద్యే సరస్వతి
కరమూలేతు గోవింద: ప్రభాతే కరదర్శనం” 
 ? ఉదయం భూప్రార్ధన
“సముద్రమేఖలే దేవి పర్వతస్తన మండలే
విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే” 
 ? మానసిక శుద్ది
“అపవిత్ర: పవిత్రోవా సర్వావస్థాంగతోపినా
య:స్మరేత్పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శ్శుచి:” 
 ? స్నాన సమయంలో
“గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు” 
 ? భోజనానికి ముందు
“అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే
జ్ణాన వైరాగ్య సిద్ద్యర్దం భిక్షాందేగి కృపాకరి
అన్నం బ్రహ్మారసోవిష్ణుః భోక్తాదేవో మహేశ్వరః
ఇతి స్మ్రరన్ ప్రభుంజాన: దృష్టిదోషై: నలిప్యతే” 
 ? భోజనము తరువాత
శ్లో|| అగస్త్యం కుంభ కర్ణం చ శమ్యం చ బడబానలం
ఆహార పరిణామార్ధం స్మరామి చ వృకోదరం ||
 ? ప్రయాణ సమయంలో 21 పర్యాయములు పఠించాలి !
“గచ్చ గౌతమ శీఘ్రంమే ప్రయాణమ్ సపలం కురు
ఆసన శయనం యానం భోజనం తత్ర కల్పయ” 
 ? అన్ని ఆరోగ్య సమస్యలకు ప్రతి నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాలి.
“ఓం నమో పరమాత్మనే పరబ్రహ్మ మమ శరీరే పాహీ కురుకురు స్వహా”
మరియు / లేక “క్రీం అచ్యుతానంత గోవింద” 
 ? విద్యాప్రాప్తి కోరకు ప్రతి నిత్యం 1 గంట లేక 28 పర్యాయాలు పఠించాలి
“ప్రాచీసంధ్యా కాచిదంతర్నిశాయా: ప్రజ్ణా దృష్టే రంజన్అ శ్రీరపూర్వా
వక్రీవేదాన్ పాతుమే వాజివక్ర్తా వాగిశాఖ్యా వాసుదేవస్య మూర్తిః
ప్రణతాజ్ణానసందోహ ధ్వాంత ధ్వంసనకర్మఠం
నమామి తురగ్రీవ హరీం సారస్వత ప్రదం
శ్లోకద్వయం మిదం ప్రాతః అష్టావింశతి వారకం
ప్రయతః పఠతే నిత్యం కృత్న్సా విద్యా ప్రసిద్ద్యతి” 
 ? విద్యార్జన లేక ఉద్యోగ నిమిత్తం నివాసానికి దూరంగ ఉన్నప్పుడు మానసిక / ఆరోగ్య సమస్యలు లేకుండ ఉండటానికి పఠించాల్సిన మంత్రం
“గచ్చ గౌతమ శీఘ్రంత్వం గ్రామేషు నగరేషు చ
ఆశనం వసనం చైవ తాంబూలం తత్ర కల్పయ” 
 ? ప్రారంబించిన పనిని విజయ వంతంగ పూర్తి చేయడానికి మంత్రాన్ని ప్రతి దినం 2 గంటలు లేక 1008 పర్యాయాలు పఠించాలి
“ఓం నమో మహామాయే మహా భోగదాయిని హూం స్వాహా” 
? చేపట్టిన కార్యం లొ, పోటి పరిక్షలొ ను విజయం సాదించడానికి మంత్రాన్ని ప్రతి దినం 2 గంటలు లేక 1008 పర్యాయాలు పఠించాలి
“శ్రీ రామ జయరామ జయజయ రామరామ” 
 ? అన్ని సమస్యలకు ప్రతి నిత్యం సూర్యోదయానికి సూర్య నమస్కారం ఉత్తమం
“ఓం హ్రీం హ్రీం సూర్యాయ నమ:” 
 ? ఉద్యోగం లొ ఉన్నతి కొరకు, పై అదికారుల అబిమానం మరియు తన వద్ద పనిచేయువారి సహకారం లబించాలంటె క్రింది మంత్రాన్ని ప్రతి దినం గంట సమయం పఠించాలి
“ఓం హ్రీం శ్రీం శ్రీం శ్రీం శ్రీం శ్రీం శ్రీం శ్రీం లక్ష్మీ మమ గృహే పూరయ పూరయ దూరయ దూరయ స్వాహా” మరియు / లేక “శ్రీ రాజ మాతంగ్యై నమ :” 
 ? ఉత్తమ భర్తను పొందుటకు
మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు 21 రోజులు పఠించాలి 
“హే గౌరి శంకరార్దాంగి యధాత్వం శంకరప్రియా
తధామాం కురు కళ్యాణి కాంత కాంతం సుదుర్లభమ్”
 ? ఉత్తమ భార్యను పొందుటకు.
మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు 40 రోజులు పఠించాలి
“పత్నీం మనోరమాందేహి మనోవృత్తాను సారిణీమ్ 
తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవామ్”
 ? వివాహాం తోందరగా జరగడానికి.
మంత్రాన్ని 108 పర్యాయాలు 21 రోజులు పఠించాలి.
“ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని
వివాహాం భాగ్యమారోగ్యం శీఘ్రలాభంచ దేహిమే” 
 అమ్మాయిలకు వివాహాం తోందరగా జరగడానికి.
మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు 21 రోజులు పఠించాలి
“కాత్యాయని మహామాయే మహాయోగినదీశ్వరీ
నందగోపసుతం దేవిపతిం మేకురుతేనమ:
పతింమనోహరం దేహి మనోవృత్తానిసారిణం
తారక దుర్గ సంసార సాగరస్య కులోద్బవాం
పత్నీమనోరమాం దేహి మనోవృత్తానిసారిణం
తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్బవాం” 
 ? అబ్బాయిలకు వివాహాం తోందరగా జరగడానికి
మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు 21 రోజులు పఠించాలి.
“విశ్వాసో గందర్వరాజ కన్యాం సాలంకృతాం
మమాబీప్సితాం ప్రయచ్చ ప్రయచ్చ నమః”
 స్త్రీల కు వైవాహీక జీవన సౌఖ్యం కొరకు
మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు 21 రోజులు పఠించాలి.
“హరిస్త్వా మారాధ్య ప్రణిత జనసౌభాగ్య జననీం
పురానారి భూత్వా పురరిపుమపి క్షోభమనయత్
స్మరోపిత్వాం వత్యా రతినయన లేహ్యేన వవుషా
మునీనాప్యంత: ప్రభవతి మోహాయ మహతామ్” 
 ? వైవాహీక జీవన సౌఖ్యం కొరకు దంపతులు ఇరువురు
మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాలి
“శ్రీరామచంద్రః శ్రితపారిజాతః సమస్తకళ్యాణ గుణాభిరామః
సీతాముఖాంభోరుహ చంచరీకః నిరంతరం మంగళమాతనోతు
హే గౌరి శంకరార్దాంగి యధాత్వం శంకరప్రియే
తధామాం కురు కళ్యాణి కాంత కాంతాం సుదుర్లభాం” 
? కుటుంభాన్ని నిర్లక్ష్యం చేయు భర్తను మార్చుకోవడానికి మంత్రాన్ని ప్రతి దినం 2 గంటలు లేక 108 పర్యాయాలు 40 రోజులు పఠించాలి
“ఓం క్లీం త్రయంబకం యజామాహే సుగంధీం పతిర్వర్దనమ్
పతిం ఉర్వారుకవ బంధతృతి మోక్ష మామృతాత్ క్లీం” 
 ? కుటుంబంలొ వచ్ఛు సమస్యలను తొలగి సౌఖ్యంగ ఉండడానికి మంత్రాన్ని ప్రతి దినం 2 గంటలు లేక 1008 పర్యాయాలు పఠించాలి
“ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ” లేక
“సదాశాంతా సదాశుద్దా గృహచ్ఛిద్ర నివారిణి
సత్సంతానప్రదారామా గ్రహోపద్రవనాశిని” 
 ? కుటుంబ సమస్యలతో దూరమైన భర్త ను పొందడానికి మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు 40 రోజులు పఠించాలి
:ఓం నమో మహాయక్షిణ్యై మమపతిం
మే వశ్యం కురు కురు స్వహా” 
 ? ఆరోగ్య సమస్యలు లేని గర్భధారణకొరకు ప్రతి నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాల్సిన మంత్రం
“ఓం దేవకిసుత గోవింద జగత్పతె
దేహిమే తనయం కృష్ణ త్వామహాం శరణాగత:” 
 ? సుఖ ప్రసవం కొరకు ప్రతి నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాల్సిన మంత్రం
ఆస్తి గోదావరీ జలతీరే జంభలానామ దేవతా
తస్యాః స్మరణ మత్రేణ విశల్యాగర్బిణీ భవేత్ జంభలాయై నమః” 
 ? ఆపదలు తగ్గడానికి ప్రతి నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాల్సిన మంత్రం
“గౌరి వల్లభకామారే కాలకూట విషాదన
మాముద్దరాపదాంభోధేః త్రిపుర ఘ్నాంతకాంతక”
 ? ఆపదలు పూర్తిగా తొలగడానికి ప్రతి నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాల్సిన మంత్రం
“అపదామపర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం మోక్షదం తం నమామ్యహం 
“దుర్గాపత్తరిణీం సర్వదుష్టగ్రహ నివారిణీ
అభయాపన్నిహంత్రీచ సర్వానంద ప్రదాయిని” 
సర్వకార్యసిద్దికి ప్రతి నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాల్సిన మంత్రం
“నమః సర్వనివాసాయ సర్వశక్తియుతాయచ
మమాభీష్టంకురుష్వశు శరణాగతవత్సల”

కార్తీకమాసంలో ఏ దానం చేస్తే ఏ ఫలితం వస్తుందో చూడండి

  ప‌విత్ర‌మైన ఈ కార్తీక మాసంలో దీపం వెలిగించ‌డం ఎంత పుణ్య‌మో… దానాలు చేయ‌డం వ‌ల్ల కూడా అంతే పాప ప‌రిహారం. అందుకే ఈ మాసంలో శ‌క్తి కొల‌దీ దానధ‌ర్మాలు చేయాల‌ని శాస్త్రాలు చెపుతున్నాయి. సాధ్యపడేది ఒక్కటైనా చెయ్యమని సూచిస్తున్నాయి. చేసే సహాయం చిన్నదైనా సరే మనస్ఫూర్తిగా, శ్రద్ధగా చేస్తే ఫలితం అధికంగా ఉంటుంది.



1. బియ్యాన్ని దానం చేస్తే – పాపాలు తొలుగుతాయి.
2. వె౦డిని దానం చేస్తే – మనశ్మా౦తి కలుగుతుంది.
3. బ౦గారం దానం చేస్తే – దోషాలు తొలుగుతాయి.
4. ప౦డ్లను దానం చేస్తే – బుద్ధి. సిద్ధి కలుగుతాయి


5. పెరుగు దానం చేస్తే – ఇ౦ద్రియ నిగ్రహ౦ కలుగుతుంది.
6. నెయ్యి దానం చేస్తే – రోగాలు పోతాయి. ఆరోగ్య౦గా ఉ౦టారు.
7. పాలు దానం చేస్తే – నిద్రలేమి ఉండదు.
8. తేనె దానం చేస్తే – స౦తానం కలుగుతుంది.
9. ఉసిరికాయలు దానం చేస్తే – మతిమరుపు పోయి, జ్ఞాపకశక్తీ పెరుగుతు౦ది.
10. కొబ్బరికాయ దానం చేస్తే – అనుకున్న కార్య౦ సిద్ధిస్తు౦ది.



11. దీపాలు దానం చేస్తే – క౦టి చూపు మెరుగుపడుతుంది.
12. గోదానం చేస్తే – ఋణ విముక్తులౌతారు ఋషుల ఆశీస్సులు లభిస్తాయి.
13. భూమిని దానం చేస్తే – బ్రహ్మలోక దర్శనం లభిస్తుంది.
14. వస్త్రదానం చేస్తే – ఆయుష్షు పెరుగుతు౦ది.
15. అన్న దానం చేస్తే – పేద‌రికం పోయి, ధనవృద్ధి కలుగుతుంది.


జంధ్యమేసినంత మాత్రాన బ్రాహ్మణత్వం సిద్ధిస్తుందా?
టోపీ ధరించినంత మాత్రాన ఇస్లాం సారం వంటపడినట్టేనా?
ఎద పై శిలువ వ్రేలాడదీసుకున్నంత మాత్రాన క్రీస్తు మార్గంలో నడుస్తున్నట్టేనా?
జంధ్యమేసుకొమ్మని, టోపీ లు, శిలువలు ధరించమని నేను చెప్పానా?
నేను మిమ్మల్ని, మీకోసం ప్రకృతిని సృష్టిస్తే మీరు మీ ఇష్టానుసారం కుల, మతాలను సృష్టించుకుని చంపుకుంటూ చివరకు నాకోసమే అని సమర్ధించుకుంటారా?


మీ అవసరాలకు, విలాసాలకు ప్రకృతి ని నాశనం చేసి విలయాలకు బాధ్యున్ని నేనంటూ నన్ను ఆడిపోసుకుంటారా?
దీక్షలు తీసుకోమని నేను చెప్పానా?
కడుపు కాల్చుకోమని నేను చెప్పానా?
మోకాళ్ళ మీద నడిచి రమ్మని నేను చెప్పానా?
మీలోనే ఉన్న నన్ను కనుగొనలేక గుళ్ళలో, మసీదు లలో, చర్చి లలో వెతుకుతున్నారు..
రక్తాలు కారేలా నేను కొట్టుకోమన్నానా.?
మా మతం శాంతి అని చెప్తూ, ఇతర మతాల వారు దైవంగా బావించే గోమాతను భక్షించమని నేను చెప్పానా.?
మతం పేరుతో జిహదీ యుద్దాలు చెయ్యమని నేను చెప్పానా.?
బాంబు దాడులు చెయ్యమని నేను చెప్పానా.?

అర్ధరాత్రిలు ప్రార్ధనల పేరుతో మోసాలు చెయ్యమని నేను చెప్పాన.?
మతం మార్చమని నేను చెప్పానా. ?
మీ తల్లిదండ్రులలొ నన్ను చూసుకోమని చెప్పాను,
చెప్పింది మాత్రం చెయ్యరు,
ఆకలన్నవానికి పిడికెడు ముద్ద పెట్టలేరు కానీ హుండీ లో కోట్ల రూపాయలు గుమ్మరిస్తారు, మీరిచ్చే కాగితపు నోట్లు నాకు అవసరమా?
మీరు సృష్టించుకున్న కాగితాలకిస్తున్నంత విలువ, మానవ సంబంధాలకు ఇవ్వడం మర్చిపోయారు
ఎప్పటికైనా మీరు నాదగ్గరకు రావలసిన వారే అన్న స్పృహ లేకుండా బ్రతుకుతున్నారు.
చనిపోయిన తరువాత మిమ్మల్ని చుట్టే వస్త్రానికి జేబులు ఉండవు,
సంపాదించిన సొమ్మును
దాచుకోడానికి నీ సమాధిలో బీరువాలు ఉండవు,
చనిపోయిన తరువాత మిమ్మల్ని తీసుకు వచ్చే నా దూతలు మీ ప్రలోభాలకు లొంగి లంచం కూడా తీసుకోరని గుర్తించుకోండి..

దేవుళ్ళలో ఒక్క పరమశివుడికి మాత్రమే లింగరూపం ఉండటంలోని విశేషమేమిటంటే…

ఈలోకంలో ఉన్న దేవుళ్ళలో ఎవరికీ లింగరూపం లేదు…………..
ఒక్క పరమ శివుడికి మాత్రమే లింగరూపం ఉండటంలోని విశిష్టత ఏమిటి……….?
పరమేశ్వరుణ్ణి ఎప్పటి నుండి లింగరూపంలో కొలుస్తున్నారో మీకు తెలుసా…………?
శివ లింగము అనేది శివుడిని సూచించే ఒక పవిత్ర చిహ్నం.
సాంప్రదాయంలో లింగము శక్తి సూచికగా, దైవ సంభావ్యతగా పరిగణింపబడుతోంది.
పూర్వం శివుడ్ని విగ్రహ రూపం లోనే పూజించే వారు
(హరప్పా శిధిలాలలో దొరికిన పశుపతి విగ్రహాన్ని పరిశీలించవచ్చు).
వరాహపురాణం లోని వేంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన గాధ లో భృగు మహర్షి శాప ఘట్టం లో భృగుమహర్షి శివుడ్ని “నేటి నుండి నీ లింగానికే కానీ నీ విగ్రహానికి పూజలుండవు,
నీ ప్రసాదం నింద్యం అవుతుంది” అని శపిస్తాడు.అంటే అంతకుముందు విగ్రహానికి పూజలుండేవన్నమాట.
శివ లింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించి పూజించే ఆచారం మాత్రం ప్రాచీనమైనదే.
ఇది ఎప్పుడు ప్రారంభమైందో ఇప్పటి దాకా ఎవరూ ఖచ్చితంగా తేల్చలేదు.
శివం అనే పదానికి అర్థం శుభప్రథమైనది అని.
లింగం అంటే సంకేతం అని అర్థం. అంటే శివలింగం సర్వ శుభప్రథమైన దైవాన్ని సూచిస్తుంది.
శివలింగము(మానుష లింగము) లో మూడు భాగాలు ఉంటాయి.
బ్రహ్మ భాగము భూమిలో , విష్ణు భాగం పీఠం లొ , శివ భాగం మనకు కనిపించే పూజా భాగము గా ఉంటుంది.
శివ లింగములు – రకములు
• స్వయం భూ లింగములు:స్వయముగా వాటి అంతట అవే వెలసినవి.
• దైవిక లింగములు:దేవతా ప్రతిష్టితాలు.
• రుష్య లింగములు:ఋషి ప్రతిష్టితాలు.
• మానుష లింగములు:ఇవి మానవ నిర్మిత లింగములు.
• బాణ లింగములు:ఇవి నర్మదా నదీతీరాన దొరికే(తులా పరిక్షకు నెగ్గిన)బొమ్మరాళ్ళు(pebbles).
పంచభూతలింగాలు
పంచభూతాలు అనగా పృథివి, జలం అగ్ని, వాయువు, ఆకాశం. శివుడు
ఈ పంచభూతాల స్వరూపాలైన లింగరూపాలతో ఐదు క్షేత్రాలలో ప్రతిష్టితుడై ఉన్నాడు.
• 1. తేజో లింగం: అన్నామలైశ్వరుడు – అన్నామలై
• 2. జల లింగం: జంబుకేశ్వరుడు- తిరువనైకావల్ లేదా జంబుకేశ్వరం
• 3. ఆకాశ లింగం: చిదంబరేశ్వరుడు(నటరాజ)- చిదంబరం
• 4. పృథ్వీ లింగం: ఏకాంబరేశ్వరుడు – కంచి
• 5. వాయు లింగం: శ్రీకాళహస్తీశ్వరుడు – శ్రీకాళహస్తి
పంచారామాలు
• 1. అమారారామము:
అమరావతి (గుంటూరు జిల్లా) శ్రీ అమరేశ్వర స్వామి, బాలచాముండికా దేవి
• 2. ద్రాక్షారామము:
ద్రాక్షారామ (తూర్పు గోదావరి జిల్లా) శ్రీ భీమేశ్వర స్వామి, మాణిక్యాంబ
• 3. కుమారారామము:
సామర్లకోట (తూర్పు గోదావరి జిల్లా) శ్రీ కుమార భీమేశ్వర స్వామి, బాలాత్రిపురసుందరి
• 4 భీమారామము:
భీమవరము (పశ్చిమ గోదావరి జిల్లా) శ్రీ సోమేశ్వర స్వామి, అన్నపూర్ణ
• 5. క్షీరారామము:
పాలకొల్లు (పశ్చిమ గోదావరి జిల్లా) శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి.
కొన్ని విశేషాలు:
• శ్రీకాళహస్తి లోని శివలింగాన్ని అభిషేకించేటపుడు ఎవరూ లింగాన్ని తాకరు.
కేవలం లింగం యొక్క కింద భాగమైన పానువట్టాన్ని మాత్రమే తాకుతారు.
• కంచి లోని శివలింగం మట్టి తో చేసినది(పృధ్వీ లింగం)
కాబట్టి లింగానికి అభిషేకము జరగదు.నూనెను మాత్రం పూస్తారు.