Showing posts with label planets. Show all posts
Showing posts with label planets. Show all posts

Sunday, 18 March 2018

ఉగాది పంచాగ శ్రవణం-- రాశి తెలుసుకోండి..

ఉగాది రాగానే పంచాగ శ్రవణం సందడి మొదలవుతుంది. ఈ ఏడాది ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది అనేది సవివరంగా చెబుతుంటారు పండితులు. పుట్టిన తేదీ, సమయం తదితర వివరాలన్నీ ఉండి వాళ్లది ఏ నక్షత్రమో ఏ రాశో తెలిసిన వాళ్లు ఆసక్తిగా వీటిని వింటుంటారు. పుట్టిన సమయాన్ని బట్టి చెప్పే నక్షత్రాన్ని జన్మనక్షత్రంగా పరిగణిస్తారు. ఆ వివరాలు తెలియని వాళ్లు తమ పేరును బట్టి వాళ్లది ఏ నక్షత్రమో, ఏ రాశో తెలుసుకునే వెసులుబాటు ఉంది. ఇలా కనుక్కునే నక్షత్రాన్ని నామ నక్షత్రంగా చెబుతారు. అలా ఏ పేరు వాళ్లకి ఏ నక్షత్రం వస్తుందో, అది ఏ రాశికి చెందుతుందో చెప్పేందుకు మన పెద్దవాళ్లు ఓ పట్టికను రూపొందించారు. పేరులోని తొలి అక్షరాన్ని బట్టి దీన్ని చూస్తారు. దాని సాయంతో మీరూ మీది ఏ రాశో సులభంగా తెలుసుకోవచ్చు.