Thursday, 1 December 2016

గోమాత విగ్రహానికి ఒక ప్రత్యేకత, విశిష్టత ఉంది. అదేమిటంటే…

ఓం నమఃశివాయ
ఇక్కడ ఫోటోలో మీరు చూస్తున్న గోమాత విగ్రహం కడపజిల్లా ప్రొద్దుటూరు పట్టణానికి సమీపంలోని
ఉప్పరపల్లె లో ఉన్న నవ దేవాలయ ప్రాంగణం నారాయణాశ్రమంలో ఉంది.
మిగిలిన తొమ్మిది దేవతా మూర్తుల విగ్రహాలతో పాటు ఈ గోమాత విగ్రహానికి కూడా ప్రత్యేక ఆలయం ఉంది.
ఇక్కడున్న గోమాత విగ్రహానికి ఒక ప్రత్యేకత, విశిష్టత ఉంది. అదేమిటంటే……….
ఈ దేవాలయాల ప్రాంగణంలోనే ఒక గోశాల ఉంది. అక్కడ దాదాపుగా 200 గోవులకు పైగానే ఉన్నాయి.
అక్కడున్న మిగతా ఆలయాల మాదిరిగానే గోమాతకు కూడా ఒక ఆలయం నిర్మించాలని సంకల్పించిన
ఆశ్రమ నిర్వాహకులు , గోశాలలో ఉన్న ఒక గోవును పోలినట్లుగానే విగ్రహం ఉండాలని శిల్పాచార్యున్ని దేవాలయ ప్రాంగణంలోకే పిలిపించారు.



ఆయన గోశాలలో ఉన్న గోవులలో ఒక గోవును ఎంపిక చేసుకొని ,
దాని మాదిరిగానే విగ్రహం ఉండాలని , దేవాలయ ప్రాంగణంలోనే దీక్ష తీసుకొని,
గోవు యొక్క విగ్రహాన్ని అద్భుతంగా రూపొందించాడు.
ఈ విగ్రహం ఆలయ ప్రాంగణంలో ప్రతిష్టించే సమయంలో ఒక ఆశ్చర్యకర అద్భుతం జరిగింది.
ఖచ్చితంగా విగ్రహాన్ని ప్రతిష్టించే సమయంలో…….
ఏ గోవును ఆధారంగా చేసుకొని శిల్పాచార్యుడు ఈ విగ్రహాన్ని రూపొందించాడో………..
ఆ గోవు ఉన్నట్లుండి ఆకస్మికంగా శివైక్యం పొందింది.
నాటి నుండి నేటి వరకు గోమాతకు విశేష పూజలు నిర్వహిస్తున్నారు.
ఈ గోమాత ఆలయం ప్రక్కలోనే కాశీ నుండి తెచ్చి ప్రతిష్టించిన శివలింగం ఉంది.
ఇక్కడ భక్తులే స్వయంగా శివలింగాన్ని స్పర్శిస్తూ అన్ని రకాల పూజలూ చేసుకునే సదుపాయం కల్పించారు.
బిల్వవృక్షాల మధ్యలో ఎంతో శోభాయమానంగా ఉన్న ఈ శివ లింగాన్ని
ప్రతి నిత్యం అనేక మంది భక్తులు దర్శిస్తూ ఉంటారు.
ప్రతిరోజూ ఈ ఆలయ ప్రాంగణంలో భజన కార్యక్రమాలతో , ఆధ్యాత్మిక శోభతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది.

share this

దానిమ్మకాయ రసం తో ఇలా చెయ్యండి.. నిగనిగలాడే చర్మం పొందండి.

మీ చర్మం నల్లగా ఉందని బాధపడుతున్నారా.. మీ అందంతో అందరిని అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారా… బ్యూటిఫుల్ స్కిన్ కోసం ప్రయత్నిస్తున్నారా… అయితే దానిమ్మకాయతో సాధ్యమవుతుంది. పెరుగుతున్న పొల్యూషన్ మధ్య జీవిస్తున్న వారి సంఖ్య ఎక్కువైతున్న ఈ రోజుల్లో స్కిన్ డిసీస్ లు చాలా మందిని వేధిస్తున్నాయి. పొల్యూషన్ నుండి తమ అందమైన స్కిన్ ను కాపాడుకోవడానికి ముఖాలను కవర్ చేసుకొని బయట తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సమస్య నుండి దూరం కావడానికి దానిమ్మకాయ మంచి మందుగా పనిచేస్తుందని చెప్తున్నారు డాక్టర్లు.



దానిమ్మ ఫేస్ ప్యాక్ : 
ఎరన్ని ముదురు రంగు పండ్లలో దానిమ్మ ఒకటి. దీన్ని హోం మేడ్ ఫేస్ ప్యాక్ గా ఉపయోగించుకోవచ్చు. ఒక కప్పు దానిమ్మ గింజలను పేస్ట్ చేసి 3/4కప్పు క్రీమ్ మిక్స్ చేసి ముఖం, మెడ కు అప్లై చేయాలి. ఈ ప్యాక్ అప్లై చేసిన తర్వాత 20నిముషాలు అలాగే ఉండి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల ఆయిల్ స్కిన్ తొలగిపోతుంది. చర్మం ప్రకాశవంతంగా క్లియర్ గా ఉంటుంది.

రుద్రనమక దివ్యమంత్రాలు

శివానుగ్రహ సిద్ధికోసం రుద్రనమక మంత్రాలను వినియోగించడం సంప్రదాయం. అభిషేకానికీ, జపానికీ, అర్చనకీ ఈ
ఆగమాలు, పురాణేతిహాసాలు, ప్రత్యేకించి దీని ప్రశస్తిని పేర్కొన్నాయి. అయితే వేదభాగమై అపౌరుషేయమైన ఈ రుద్ర పఠనానికి, పారాయణకీ, నియమాలు, నిబంధనలు ఉన్నాయి. స్వరం రానివారు, నియమపాలన కుదరని వారు తదితరులు దీనిని పారాయణ చేయడం కూడదని శాస్త్రనియమం.

కానీ ఈ రుద్రమంత్రాల వల్ల లభించే సిద్ధి, కైవల్యం వంటి అద్భుత ఫలాలను అందరికీ అందజేయాలని సంకల్పించుకున్న ఋషులు ఆ రుద్రనమకాన్ని శ్లోక రూపంగా మలచి పురాేతిహాసాల ద్వారా, తంత్రశాస్త్ర గ్రంథాలద్వారా అందజేశారు.
మంత్రాలను శ్లోకంగా మలచాలంటే ఋష్యత్వం కలిగిన వారికే సాధ్యం. అందుకే వేదాలను వ్యాసం చేసి ప్రసాదించిన భగవాన్ వేదవ్యాసులవారు మ


హాభారతం, సూతసంహిత, శివరహస్యం - వంటి గ్రంథాలద్వారా వివిధ వివిధాలుగా ’శతరుద్రీయ’ శ్లోకాలను అందజేశారు.
విష్ణుసహస్ర, శివసహస్ర, లలితా సహస్ర నామ స్తోత్రాలవలె ఈ నమక స్తోత్రాన్ని - స్నానాది శుచి నియమాలు పాటిస్తూ పారాయణ చేస్తే చాలు పరిపూర్ణ ఫలం లభిస్తుమ్ది. అందులో సందేహం లేదు. దీనిని పారాయణ స్తోత్రంగా పఠించవచ్చు. అభిషేకానికి వినియోగించుకోవచ్చు, స్వరనియమం లేదు. ఉచ్ఛారణలో జాగ్రత్త వహించాలి. శ్రద్ధావిశ్వాసాలున్న ఆస్తికులందూ దీని పఠనానికి అర్హులే.
పైగా - ఇది సాక్షాత్తు డుంఠి వినాయకుడు కాశీ విశ్వనాథుని దర్శించి చేసిన స్తోత్రంగా శివరహస్యం పేర్కొన్నది.
ఇంతటి మహిమాన్వితమైన స్తోత్రాన్ని సర్వజన సౌలభ్యంకోసం ప్రచురిస్తున్నాం.
దివ్యమంత్రాలు ఉపయోగించి ఇష్టిసిద్ధి, అనిష్ట పరిహారం పొందుతారని శాస్త్రోక్తి. ఎందరికో అనుభవం కూడా. అంతేకాక - ఆత్మవిద్యకి సంబంధించిన ఉపనిషత్ భాగంగా ’రుద్రోపనిషత్’ పేరున దీనిని వ్యవహరిస్తారు. ఇది కైవల్య ప్రాప్తి హేతువని యజ్ఞవల్క్యాది మహర్షులు వేదభాగాలలో వివరించారు.
ధ్యానమ్
ఆపాతాళ నభస్స్థలాంత భువన బ్రహ్మాండ మావిసఫుర
జ్జ్యోతిఃస్ఫాటికలింగ మౌళివిలసత్ పూర్ణేందు వాంతామృతైః
అస్తోకాప్లుత మేక మీశ మనిశం రుద్రానువాకాన్ జపన్
ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువ పదం విప్రోభిషించేచ్ఛివమ్!!



బ్రహ్మాండ వ్యాప్తదేహా భసిత హిమరుచా భాసమానా భుజంగైః
కంఠే కాలాః కపర్దా కలితశశికలాశ్చండ కోదండ హస్తాః
త్ర్యక్షా రుద్రాక్షమాలా స్సులలితవపుష శ్శాంభవామూర్తిభేదా
రుద్రాశ్శ్రీరుద్రసూక ప్రకటిత విభవా నః ప్రయచ్ఛంతు సౌఖ్యమ్!!
ఇత్యుక్త్వా సత్వరం సాంబం స్మృత్వా శంకరపాదుకే
ధ్యాత్వా యయౌ గణాధీశః శివసన్నిధి మాదరాత్
తతః ప్రణమ్య బహుధా కృతాంజలిపుటః ప్రభుః
శంభుం స్తోతుం మతిం చక్రే సర్వాభీష్ట ప్రదాయకమ్!!


గణేశ ఉవాచ:
౧. నమస్తే దేవదేవాయ నమస్తే రుద్ర మన్యవే
నమస్తే చంద్రచూడాయా ప్యుతోత ఇషవే నమః
౨. నమస్తే పార్వతీ కాంతా యైక రూపాయ ధన్వనే
నమస్తే భగవన్ శమ్భో బాహుభ్యాముత తే నమః
౩. ఇషుః శివతమా యా తే తయా మృడయ రుద్రమామ్
శివం ధనుర్యద్బభూవ తేనాపి మ్ఋడయాధునా
౪. శరవ్యా యా శివతమా తయాపి మృడయ ప్రభో
యా తే రుద్ర శివా నిత్యం సర్వజ్ఞ్గల సాధనమ్

౫. తయాభిచాకశీహి త్వం తనువా మా ముమాప తే
ఘోరయా తనువాచాపి రుద్రాద్యాపాపకాశినీ
౬. యా తయా మృడయ స్వామిన్ సదా శన్తమా ప్రభో
గిరిశన్త మహారుద్ర హస్తే యా మిషు మస్ే
౭. బిభర్షి తాం గిరిత్రాద్య శివాం కురు శివాపతే
శివేన వచసా రుద్ర నిత్యం వాచా వదామస
౮. త్వద్భక్తి పరిపూతాంగం మహింసీః పురుషం జగత్


యచ్చ శర్వ జగత్సర్వ మయక్ష్మం సుమనా అసత్
౯. యథా తథావమా రుద్ర తదన్యధాపి మే ప్రభో
రుద్ర త్వం ప్రథమో దైవ్యోభిషక్ పాపవినాశకః
౧౦. అధివక్తా ధ్యవోచ న్మాం భావలింగార్చకం ముదా
అహీన్ సర్వాన్ యాతుధాన్యః సర్వా అప్యద్య జమ్భయమ్
౧౧. అసౌ తామ్రోరుణో బభ్రుః నీలగ్రీవ స్సుమంగళః



విలోహితో స్త్వయం శమ్భో త్వదధిష్ఠాన ఏవహి
౧౨. నమో నమస్తే భగవన్ నీలగ్రీవాయ మీఢుషే
సహస్రాక్షాయ శుద్ధాయ సచ్చిదానందమూర్తయే
౧౩. ఉభయోరార్త్ని యోర్జ్యా యా ధన్వన స్తాం ప్రముంచతామ్
సంప్రాప్య ధను రన్యేషాం భయాయ ప్రభవిష్యతి
౧౪. అస్మద్భయవినాశార్థ మధునాభయద ప్రభో
యాశ్చతేహస్త ఇషవః పరాతా భగవో వప
౧౫. అవతత్య ధను శ్చ త్వం సహస్రాక్ష శతేషుఢే
ముఖా నిశీర్య శల్యానాం శివోనః సుమనా భవ
౧౬. విజ్యం ధనురిదం భూయాత్ విశల్యో బాణవానపి
అనేశన్నిషవశ్చాపి హ్యాభురస్తు నిషంగధిః
౧౭. కపర్దినో మహేశస్య యది నాభుర్నిషంగధిః
ఇషవో పి సమర్థాశ్చేత్ సామర్థ్యేతు భయం భవేత్
౧౮. యాతే హేతిర్ధను ర్హస్తే మీఢుష్టమ బభూవ యా
తయాస్మాన్ విశ్వత స్తేన పాలయ త్వ మయక్ష్మయా
౧౯. అనాతతాయాయుధాయ నమస్తే ధష్ణవే నమః
బాహుభ్యాం ధన్వనే శమ్భో నమో భూయో నమో నమః
౨౦. పరితే ధన్వనో హేతిః విశ్వతోస్మాన్ వృణక్తు నః
ఇషుధిస్తవ యా తవదస్మారే నిధేహి తమ్
౨౧. హిరణ్యబాహవే తుభ్యం సేనాన్యే తే నమో నమః
దిశాంత పతయే తుభ్యం పశూనాం పతయే నమః
౨౨. త్విషీమతే నమస్తుభ్యం నమస్సస్పింజరాయతే
నమః పథీనాం పతయే బభ్లుశాయ నమోనమః
౨౩. నమో వివ్యాధినేన్నానాం పతయే ప్రభవే నమః
నమస్తే హరికేశాయ రుద్రాయా స్తూపవీతినే
౨౪. పుష్టానాం పతయే తుభ్యం జగతాం పతయే నమః
సంసారహేతి రూపాయ రుద్రాయాప్యాతతాయినే
౨౫. క్షేత్రాణాం పతయే తుభ్యం సూతాయ సుకృతాత్మనే


అహన్త్యాయ నమస్తుభ్యం వనానాం పతయే నమః
౨౬. రోహితాయ స్థపతయే మన్త్రిణే వాణిజాయ చ
కక్షాణాం పతయే తుభ్యం నమస్తుభ్యం భువన్తయే
౨౭. తద్వారి వస్కృతాయాస్తు మహాదేవాయ తే నమః
ఓషధీనాం చ పతయే నమస్తుభ్యం మహాత్మనే
౨౮. ఉచ్చైర్ఘోషాయ ధీరాయ ధీరాన్ క్రన్దయతే నమః
౨౯. పత్తీనాం పతయే తుభ్యం కృత్స్నవీతాయ తే నమః



ధావతే ధవాలాయపి సత్త్వనాం పతయే నమః
౩౦. ఆవ్యాధినీనాం పతయే కకుభాయ నిషంగిణే
స్తేనానాం పతయే తుభ్యం నమస్తేస్తు నిచేరవే
౩౨. తస్కరాణాం చ పతయే వంచతే పరివంచే
స్తాయూనాం పతయే తుభ్యం నమస్తేస్తు నిచేరవే
౩౨. నమః పరిచరాయాపి మహారుద్రాయతే నమః
అరణ్యానాం చ పతయే ముష్ణతాం పతయే నమః
౩౩. ఉష్ణీషిణే నమస్తుభ్యం నమో గిరచరాయతే
కులుంచానాం చ పతయే నమస్తుభ్యం భవాయ చ
౩౪. నమో రుద్రాయ శర్వాయ తుభ్యం పశుపతే నమః
నమ ఉగ్రాయ భీమాయ నమ శ్చాగ్రేవధాయచ
౩౫. నమో దూరేవధాయాపి నమో హంత్రే నమోనమః



హనీయసే నమస్తుభ్యం నీలగ్రీవాయ తే నమః
౩౬. నమస్తే శితికంఠాయ నమస్తేస్తు కపర్దినే
నమస్తే వ్యుప్తకేశాయ సహస్రాక్షాయ మీఢుషే
౩౭. గిరిశాయ నమస్తేస్తు శిపివిష్టాయ తే నమః
నమస్తే శంభవే తుభ్యం మయోభవ నమోస్తుతే
౩౮. మయస్కర నమస్తుభ్యం శంకరాయ నమోనమః
నమశ్శివాయ శర్వాయ నమ శ్శివతరాయ చ
౩౯. నమస్తీర్థ్యాయ కూల్యాయ నమః పార్యాయ తే నమః



ఆవార్యాయ నమస్తేస్తు నమః ప్రతరణాయచ
౪౦. నమ ఉత్తరణాయాపి హరాతార్యాయ తే నమః
ఆలాద్యాయ నమస్తేస్తు భక్తానాం వరదాయ చ
౪౧. నమ శ్శష్ప్యాయ ఫేన్యాయ సికత్యాయ నమోనమః
ప్రవాహ్యాయ నమస్తేస్తు హ్రస్వాయాస్తు నమోనమః
౪౨. వామనాయ నమస్తేస్తు బృహతేచ నమోనమః
వర్షీయసే నమస్ేస్తు నమో వృద్ధాయతే నమః
౪౩. సంవృధ్వనే నమస్తుభ్య మగ్రియాయ నమోనమః
ప్రథమాయ నమస్తుభ్య మాశవే చాజిరాయ చ
౪౪. శీఘ్రిమాయ నమస్తేస్తు శీభ్యాయ చ నమోనమః
నమ ఊర్మ్యాయ శర్వాయాప్యవస్వన్యాయ తే నమః
౪౫. స్రోతస్యాయ నమస్తుభ్యం ద్వీప్యాయచ నమోనమః



జ్యేష్ఠాయ చ నమస్తుభ్యం కనిష్ఠాయ నమోనమః
౪౬. పూర్వజాయ నమస్తుభ్యం నమోస్త్వవరజాయచ
మధ్యమాయ నమస్తుభ్య మపగల్భాయ తే నమః
౪౭. జఘన్యాయ నమస్తుభ్యం బుధ్నియాయ నమోనమః
సోభ్యాయ ప్రతిసర్యాయ యామ్యాయ చ నమోనమః
౪౮. క్షేమ్యాయ చ నమస్తుభ్యం యామ్యాయ చ నమోనమః
ఉర్వర్యాయ నమస్తుభ్యం ఖల్యాయచ నమోనమః
౪౯. శ్లోక్యాయ చావసాన్యాయావస్వన్యాయ చ తే నమః
నమో వన్యాయ కక్ష్యాయ మౌంజ్యాయ చ నమోనమః
౫౦.శ్రవాయ చ నమస్తభ్యం ప్రతిశ్రవ నమోనమః
ఆశుషేణాయ శూరాయ నమోస్త్వాశు రథాయ చ
౫౧. వరూథినే పర్మిణే చ బిల్మినే చ నమోనమః
శ్రుతాయ శ్రుత సేనాయ నమః కవచినే నమః
౫౨. దుందుభ్యాయ నమస్తుభ్యమాహనన్యాయ తే నమః
ప్రహితాయ నమస్తుభ్యం ధృష్ణవే ప్రమృశాయచ
౫౩. పారాయ పారవిందాయ నమస్తీక్ణేషవే నమః
సుధన్వనే నమస్తుభ్యం స్వాయుధాయ నమోనమః
౫౪. నమః స్రుత్యాయ పథ్యాయ నమః కాట్యాయ తే నమః



నమో నీప్యాయ సూద్యాయ సరస్యాయ చ తే నమః
౫౫. నమో నాద్యాయ భవ్యాయ వైశన్తాయ నమోనమః
అవట్యాయ నమస్తుభ్యం నమః కూప్యాయ తే నమః
౫౬. అవర్ష్యాయ చ వర్ష్యాయ మేఘ్యాయ చ నమోనమః
విద్యుతాయ నమస్తుభ్య మీథ్రియాయ నమోనమః
౫౭. ఆతప్యాయ నమస్తుభ్యం వాత్యాయచ నమోనమః
రేష్మియాయ నమస్తుభ్యం వాస్తవ్యాయ చ తే నమః
౫౮. వాస్తుపాయ నమస్తుభ్యం నమస్సోమాయతే నమః
నమోరుద్రాయ తామ్రాయా ప్యరుణాయ చ తే నమః
౫౯. నమ ఉగ్రాయ భీమాయ నమ శ్శంగాయ తే నమః



నమస్తీర్థ్యాయ కూల్యాయ సికత్యాయ నమోనమః
౬౦. ప్రవాహ్యాయ నమస్తుభ్య మిరిణ్యాయ నమోనమః
నమస్తే చన్ద్ర చూడాయ ప్రపధ్యాయ నమోనమః
౬౧. కింశిలాయ నమస్తేస్తు క్షయణాయ చ తే నమః
కపర్దినే నమస్తేస్తు నమస్తేస్తు పులస్తయే
౬౨. నమో గోష్ఠ్యాయ గృహ్యాయ గ్రహాణాం పతయే నమః
సమస్తల్ప్యాయ గేహ్యాయ గుహావాసాయ తే నమః
౬౩. కాట్యాయ గహ్వరేష్ఠాయ హ్రదయ్యాయ చ తే నమః



నివేష్ప్యాయ నమస్తుభ్యం పాగ్ంసవ్యాయ తే నమః
౬౪. రజస్యాయ నమస్తుభ్యం పరాత్పర తరాయ చ
నమస్తే హరికేశాయ శుష్క్యాయ చ నమోనమః
౬౫. హరిత్యాయ నమస్తుభ్యం హరిద్వర్ణాయ తే నమః
నమ ఉర్మ్యాయ సూర్మ్యాయ పర్ణ్యాయ చ నమోనమః
౬౬. నమోపగురమాణాయ పర్ణశద్యాయ తే నమః
అభిఘ్నతే చాఖ్ఖిదతే నమః ప్రఖ్ఖిదతే నమః
౬౭. విశ్వరూపాయ విశ్వాయ విశ్వాధారాయతే నమః
త్ర్యమ్బకాయ చ రుద్రాయ గిరిజాపతయే నమః
౬౮. మణికోటీర కోటిస్థ కాన్తిదీప్తాయ తే నమః
వేదవేదాన్త వేద్యాయ వృషారూఢాయ తే నమః
౬౯. అవిజ్ఞేయస్వరూపాయ సున్దరాయ నమోనమః
ఉమాకాన్త నమస్తేస్తు నమస్తే సర్వసాక్షిణే
౭౦. హిరణ్యబాహవే తుభ్యం హిరణ్యాభరణాయ చ
నమో హిరణ్యరూపాయ రూపాతీతాయ తే నమః

౭౧. హిరణ్యపతయే తుభ్యమంబికా పతయే నమః
ఉమాయాః పతయే తుభ్యం నమః పాప ప్రణాశక
౭౨. మీఢుష్టమాయ దుర్గాయ కద్రుద్రాయ ప్రచేతసే
తవ్యసే బిల్వపూజ్యాయ నమః కళ్యాణరూపిణే
౭౩. అపార కళ్యాణ గుణార్ణవాయ శ్రీ నీలకంఠాయ నిరంజనాయ
కాలాంతకాయాపి నమోనమస్తే దిక్కాలరూపాయ నమోనమస్తే

౭౪. వేదాంత బృందస్తుత సద్గుణాయ గుణప్రవీణాయ గుణాశ్రయాయ
శ్రీ విశ్వనాథాయ నమోనమస్తే కాశీనివాసాయ నమోనమస్తే
౭౫. అమేయ సౌందర్య సుధానిధాన సమృద్ధిరూపాయ నమోనమస్తే
ధరాధరాకార నమోనమస్తే ధారా స్వరూపాయ నమోనమస్తే
౭౬. నీహారశైలాత్మజ హృద్విహార ప్రకాశహార ప్రవిభాసి వీర
వీరేశ్వరాపార దయానిధాన పాహి ప్రభో పాహి నమోనమస్తే
వ్యాస ఉవాచ:

ఏవం స్తుత్వా మహాదేవం ప్రణిపత్య పునఃపునః
కృతాంజలిపుట స్తస్థౌ పార్శ్వే డుంఠివినాయకః
త మాలోక్య సుతం ప్రాప్తం వేదవేదాంగ పారగమ్
స్నేహాశ్రుధారా సంవీతం ప్రాహ డుంఠిం సదాశివః
ఇతి శ్రీ శివరహస్యే హరాఖ్యే తృతీయాంశే పూర్వార్థే
గణేశకృత రుద్రాధ్యాయస్తుతిః నామ దశమోధ్యాయః
అనేన శ్రీ గణేశకృత శ్లోకాత్మక రుద్రాధ్యాయ పారాయణేన
శ్రీ విశ్వేశ్వర స్సుప్రీతస్సుప్రసన్నోవరదో భవతు!!
పశూనాం పతిం పాపనాశం పరేశం – గజేంద్రస్య కృత్తిం వసానం వరేణ్యమ్ |
జటాజూటమధ్యే స్ఫురద్గాంగవారిం – మహాదేవమేకం స్మరామి స్మరారిమ్ || ౧ ||
మహేశం సురేశం సురారాతినాశం – విభుం విశ్వనాథం విభూత్యంగభూషమ్ |విరూపాక్షమింద్వర్కవహ్నిత్రినేత్రం – సదానందమీడే ప్రభుం పంచవక్త్రమ్ || ౨ ||
గిరీశం గణేశం గళే నీలవర్ణం – గవేంద్రాధిరూఢం గుణాతీతరూపమ్ |
భవం భాస్వరం భస్మనా భూషితాంగం – భవానీకలత్రం భజే పంచవక్త్రమ్ || ౩ ||
శివాకాంత శంభో శశాంకార్ధమౌళే – మహేశాన శూలింజటాజూటధారిన్ |
త్వమేకో జగద్వ్యాపకో విశ్వరూపః – ప్రసీద ప్రసీద ప్రభో పూర్ణరూప || ౪ ||
పరాత్మానమేకం జగద్బీజమాద్యం – నిరీహం నిరాకారమోంకారవేద్యమ్ |
యతో జాయతే పాల్యతే యేన విశ్వం – తమీశం భజే లీయతే యత్ర విశ్వమ్ || ౫ ||
న భూమిర్న చాపో న వహ్నిర్న వాయుర్న చాకాశమాస్తే న తంద్రా న నిద్రా |
న చోష్ణం న శీతం న దేశో న వేషో – న యస్యాస్తి మూర్తిస్త్రిమూర్తిం తమీడే || ౬ ||
అజం శాశ్వతం కారణం కారణానాం – శివం కేవలం భాసకం భాసకానామ్ |
తురీయం తమఃపారమాద్యంతహీనం – ప్రపద్యే పరం పావనం ద్వైతహీనమ్ || ౭ ||
నమస్తే నమస్తే విభో విశ్వమూర్తే – నమస్తే నమస్తే చిదానందమూర్తే |
నమస్తే నమస్తే తపోయోగగమ్య – నమస్తే నమస్తే శ్రుతిజ్ఞానగమ్య || ౮ ||
ప్రభో శూలపాణే విభో విశ్వనాథ – మహాదేవ శంభో మహేశ త్రినేత్ర |
శివాకాంత శాంత స్మరారే పురారే – త్వదన్యో వరేణ్యో న మాన్యో న గణ్యః || ౯ ||
శంభో మహేశ కరుణామయ శూలపాణే – గౌరీపతే పశుపతే పశుపాశనాశిన్ |
కాశీపతే కరుణయా జగదేతదేకస్త్వం హంసి పాసి విదధాసి మహేశ్వరోఽసి || ౧౦ ||
త్వత్తో జగద్భవతి దేవ భవ స్మరారే – త్వయ్యేవ తిష్ఠతి జగన్మృడ విశ్వనాథ |
త్వయ్యేవ గచ్ఛతి లయం జగదేతదీశ – లింగాత్మకే హర చరాచరవిశ్వరూపిన్ || ౧౧ ||


ఆపాతాళనభఃస్థలాన్త భువన బ్రహ్మాండ మావిస్ఫురత్
జ్యోతిః స్ఫాటికలింగ మౌళి విలసత్పూర్ణేందు వాన్తామృతైః
అస్తోకాప్లుతమేకమీశ మనిశం రుద్రానువాకాన్ జపన్
ధ్యాయేదీప్సితసిద్ధయేత్ ధ్రువపదం విప్రోభిషించే ఛ్ఛివమ్!!
బ్రహ్మాండ వ్యాప్తదేహాః భసిత హిమరుచా భాసమానా భుజంగైః
కంఠే కాలాః కపర్దాః కలితశశికలాశ్చండ కోదండ హస్తాః
త్ర్యక్షా రుద్రాక్షమాలాః సలలితవపుషాశ్శాంభవామూర్తిభేదాః
రుద్రాః శ్రీరుద్రసూక్త ప్రకటిత విభవాః నః ప్రయచ్ఛంతు సౌఖ్యమ్!!


with mint distance of cancer, could .

పుదీనా……….ఆకు కూరల్లో పుదీనా ఆకుకు ప్రత్యేకమైన ఔషధ గుణాలున్నాయి.

కూరలకు తిరుగులేని రుచిని ఇచ్చే పుదీనా ఆకులో……..
క్యాన్సర్ ను నయం చేసే గుణాలున్నట్టు పరిశోధనలు చెబుతున్నాయి.

pudina



పుదీనా ఆకు తరుచూ వాడటం వల్ల పెద్ద ప్రేగులో వచ్చే క్యాన్సర్ ను నిరోధించవచ్చని
సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ అండ్ కౌన్సిల్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ (CIMAP AND CISR )లకు చెందిన సైంటిస్టులు జరిపిన పరిశోధనల్లో ఈ విషయం రుజువైందట.

పెద్ద ప్రేగులో వచ్చే క్యాన్సర్ కారక కణాలను
పుదీనా లో ఉండే ఎల్ మెంథాల్ అనే పదార్ధం నాశనం చేస్తుందని స్టడీ లో పేర్కొన్నారు.

క్యాన్సర్ కారక కణ విభజన జరగకుండా ఆపడంతో బాటు,
క్యాన్సర్ శరీరంలో ఇతర భాగాలకు సోకకుండా ఎల్ మెంథాల్ నిరోధిస్తుందని తేల్చారు.
share it

చిత్రగుప్తుని దేవాలయాలు ఎక్కడెక్కడున్నాయో తెలుసా.

మనుషులు తెల్లవారి లేచిన దగ్గర్నుంచి పడుకునే వరకు పాపాలు చేస్తుంటాడు. ఈ పాపాలు ఎవరూ చూడరు అనుకుంటారు, కానీ ఇదంతా భ్రమ. మనలోనే ఓ ప్రాణి దాగి ఉంది. ఆ ప్రాణిని సృష్టించింది సృష్టికర్త బ్రహ్మ. మనం చేసే ప్రతి పాపపు పనికీ లెక్క కట్టి చిట్టా తయారు చేస్తుంది. ఆ ప్రాణి పేరే చిత్రగుప్త అని గరుడ పురాణం చెబుతుంది. కలియుగంలో అతని పేరిట గుళ్లు గోపురాలు కూడా ఉన్నాయి. మన రాజధాని నగరంలోనూ చిత్రగుప్తుడికో ఆలయం ఉంది. అసలు చిత్రగుప్తుడు ఎవరో, ఆయన మన పాప పుణ్యాల చిట్టా రాయడం ఏమిటో తెలుసుకుందాం..


యమధర్మరాజు ఆస్థానంలో చిట్టాలు రాసే చిత్రగుప్తుడికి భూలోకంలో అక్కడక్కడా దేవాలయాలు ఉన్నాయి. కానీ వీటిని వేళ్ల మీద లెక్కించొచ్చు. ముఖ్యంగా ఆసియా ఖండంలో చిత్రగుప్తుడి భక్తులు ఎక్కువగా ఉన్నారు భరతుడు పాలించిన భారత దేశంలో వీటిని నిర్మించారు. రాముడు సైతం చిత్రగుప్తుడిని కొలిచినట్లు పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. అందుకే రాముడు రాజ్యమేలిన అయోధ్యలో చిత్రగుప్తుడి దేవాలయం ఉంది.


 స్వయంగా రాముడే ఇక్కడ పూజలు చేసినట్టు ప్రతీతి. దీన్ని ధర్మ హరి చిత్రగుప్త దేవాలయం అని అంటారు. ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న ఈ దేవాలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. మధ్యప్రదశ్‌ రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో చిత్రగుప్త దేవాలయాలు ఉన్నాయి. జబల్‌ పూర్‌ లోని ఫూటాతాల్‌, షిప్రా నదీ తీరంలోని రామ్‌ఘాట్‌లో, ఉజ్జయినిలో రెండు దేవాలయాలు ఉన్నాయి. అవి దాదాపు రెండు శతాబ్దాలు దాటినవి అయి ఉంటాయి. అంటే ఒక్క మధ్య ప్రదేశ్‌లో నాలుగు చిత్ర గుప్త దేవాలయాలు ఉన్నాయి. రాజస్థాన్‌ అల్వార్‌లో మూడు శతాబ్దాల చిత్రగుప్త దేవాలయం ఉంది. అదే రాష్ట్రం ఉదయపూర్‌లో మరో చిత్రగుప్త దేవాలయం ఉంది.
ఉత్తర భారత దేశంలో అరుదుగా ఉన్న చిత్రగుప్త దేవాలయాలు దక్షిణాదిన తమిళనాడులోని కాంచిపురంలో ఒకటి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా చిత్రగుప్తుడి దేవాలయం కేవలం ఒకే ఒకటి ఉంది. ఇంత అరుదైన దేవాలయం హైద్రాబాద్‌ పాతబస్తీ కందికల్‌ గేట్‌ ప్రాంతంలో ఉంది. అయినా స్థానికులు చాలా మందికి ఇక్కడ చిత్రగుప్త దేవాలయం ఉందన్న విషయం తెలియదు. చిత్రగుప్తుడి గుడి గంట మోగే శబ్దం వినిపించడం కన్నా వారికి చావు డప్పు, బంధువుల శోకాలు వినిపిస్తుంటాయి. దేవాలయం ముందు నుంచి తరచుగా పీనుగులను మోసుకెళ్లే పాడెలు కనిపిస్తుంటాయి. ఎందుకంటే దేవాలయానికి కూత వేటు దూరంలోనే నల్లవాగు స్మశాన వాటిక ఉండటంతో ఈ మార్గం గుండానే అనేక శవయాత్రలు వెళాల్సి ఉంటుంది.


 దేవాలయ పరిసరాల్లో సాంబ్రాణి పొగ వాసనకు బదులుగా శవం కాలుతున్న వాసనలే విపరీతం. పాతబస్తీలో ఇదే అతిపెద్ద స్మశానవాటిక అని చెప్పొచ్చు. అపుడపుడు కందికల్‌ గేట్‌ రైల్వే ట్రాక్‌ మీద ప్రమాదాలు జరిగి మృత్యువాత పడే జీవులెందరో. బహుశా ఆ భయంతోనే ఇక్కడ రాత్రిపూట పెద్దగా జనసంచారం ఉండదు. దీపావళి రెండో రోజు మాత్రమే ఘనంగా జరిగే ఉత్సవం తప్పించి మామూలు రోజుల్లో కూడా పెద్దగా పూజలు జరగవు.
దీపావళి రెండో రోజు యమద్వితీయ ఉంటుందని ఆరోజు చిత్రగుప్తుడి పుట్టిన రోజు నిర్వహించే ఆచారం కొనసాగుతుంది.దీన్నే భాయ్‌ దూజ్‌ అంటారు. చిత్రగుప్తుడికి ఇష్టమైన రోజు బుధవారం అని దేవాలయ పూజారీ రంగాచార్యులు చెప్పారు. అభిషేకం, ప్రత్యేక పూజలు జరుపుతామన్నారు.


 అకాల మృత్యువును జయించడానికి మాత్రమే కాదు ఆరోగ్యం, చదువు, పెళ్లి, సంతానం ఇలా అనేక వాటికి పరిష్కారం కోసం ఈ దేవాలయాన్ని దర్శించుకుంటున్నారని ఆయన తెలిపారు. కేతు గ్రహ దోష నివారణకు కూడా ఈ దేవాలయంలో పూజలు జరుగుతుంటాయని మరో పూజారీ చంద్రకాంత్‌ జోషి తెలిపారు. ఈ దేవాలయానికి భక్తులు సంఖ్య కూడా అంతంత మాత్రమే.ఇంతటి విశిష్టమైన దేవాలయం అభివృద్ది కాకపోవడానికి వాస్తు దోషమేనంటారు ప్రముఖ వాస్తు నిపుణులు జాలిగామ నరేష్‌ కుమార్‌. తూర్పు ఆగ్నేయం పెరగడం,తూర్పు భారం,ఈశాన్యం బరువు, దక్షిణ నైరుతి గేటు తెరవడం వల్ల దేవాలయం ఖ్యాతి చెందడం లేదని ఆయన అన్నారు.

సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం

సదా బాలరూపాఽపి విఘ్నాద్రిహంత్రీ – మహాదంతివక్త్రాఽపి పంచాస్యమాన్యా |
విధీంద్రాదిమృగ్యా గణేశాభిధా మే – విధత్తాం శ్రియం కాఽపి కళ్యాణమూర్తిః || ౧ ||
న జానామి శబ్దం న జానామి చార్థం – న జానామి పద్యం న జానామి గద్యమ్ |
చిదేకా షడాస్యా హృది ద్యోతతే మే – ముఖాన్నిఃసరంతే గిరశ్చాపి చిత్రమ్ || ౨ ||
మయూరాధిరూఢం మహావాక్యగూఢం – మనోహారిదేహం మహచ్చిత్తగేహమ్ |
మహీదేవదేవం మహావేదభావం – మహాదేవబాలం భజే లోకపాలమ్ || ౩ ||



యదా సంనిధానం గతా మానవా మే – భవాంభోధిపారం గతాస్తే తదైవ |
ఇతి వ్యంజయన్సింధుతీరే య ఆస్తే – తమీడే పవిత్రం పరాశక్తిపుత్రమ్ || ౪ ||
యథాబ్ధేస్తరంగా లయం యాంతి తుంగాస్తథైవాపదః సంనిధౌ సేవతాం మే |
ఇతీవోర్మిపంక్తీర్నృణాం దర్శయంతం – సదా భావయే హృత్సరోజే గుహం తమ్ || ౫ ||
గిరౌ మన్నివాసే నరా యేఽధిరూఢాస్తదా పర్వతే రాజతే తేఽధిరూఢాః |
ఇతీవ బ్రువన్గంధశైలాధిరూఢః – స దేవో ముదే మే సదా షణ్ముఖోఽస్తు || ౬ ||
మహాంభోధితీరే మహాపాపచోరే – మునీంద్రానుకూలే సుగంధాఖ్యశైలే |
గుహాయాం వసంతం స్వభాసా లసంతం – జనార్తిం హరంతం శ్రయామో గుహం తమ్ || ౭ ||



లసత్స్వర్ణగేహే నృణాం కామదోహే – సుమస్తోమసంఛన్నమాణిక్యమంచే |
సముద్యత్సహస్రార్కతుల్యప్రకాశం – సదా భావయే కార్తికేయం సురేశమ్ || ౮ ||
రణద్ధంసకే మంజులేఽత్యంతశోణే – మనోహారిలావణ్యపీయూషపూర్ణే |
మనఃషట్పదో మే భవక్లేశతప్తః – సదా మోదతాం స్కంద తే పాదపద్మే || ౯ ||
సువర్ణాభదివ్యాంబరైర్భాసమానాం – క్వణత్కింకిణీమేఖలాశోభమానామ్ |
లసద్ధేమపట్టేన విద్యోతమానాం – కటిం భావయే స్కంద తే దీప్యమానామ్ || ౧౦ ||





పులిందేశకన్యాఘనాభోగతుంగస్తనాలింగనాసక్తకాశ్మీరరాగమ్ |
నమస్యామ్యహం తారకారే తవోరః – స్వభక్తావనే సర్వదా సానురాగమ్ || ౧౧ ||
విధౌ క్లృప్తదండాన్స్వలీలాధృతాండాన్నిరస్తేభశుండాన్ద్విషత్కాలదండాన్ |
హతేంద్రారిషండాన్జగత్రాణశౌండాన్సదా తే ప్రచండాన్శ్రయే బాహుదండాన్ || ౧౨ ||
సదా శారదాః షణ్మృగాంకా యది స్యుః – సముద్యంత ఏవ స్థితాశ్చేత్సమంతాత్ |
సదా పూర్ణబింబాః కళంకైశ్చ హీనాస్తదా త్వన్ముఖానాం బ్రువే స్కంద సామ్యమ్ || ౧౩ ||
స్ఫురన్మందహాసైః సహంసాని చంచత్కటాక్షావలీభృంగసంఘోజ్జ్వలాని |
సుధాస్యందిబింబాధరాణీశసూనో – తవాలోకయే షణ్ముఖాంభోరుహాణి || ౧౪ ||






విశాలేషు కర్ణాంతదీర్ఘేష్వజస్రం – దయాస్యందిషు ద్వాదశస్వీక్షణేషు |
మయీషత్కటాక్షః సకృత్పాతితశ్చేద్భవేత్తే దయాశీల కా నామ హానిః || ౧౫ ||
సుతాంగోద్భవో మేఽసి జీవేతి షడ్ధా – జపన్మంత్రమీశో ముదా జిఘ్రతే యాన్ |
జగద్భారభృద్భ్యో జగన్నాథ తేభ్యః – కిరీటోజ్జ్వలేభ్యో నమో మస్తకేభ్యః || ౧౬ ||
స్ఫురద్రత్నకేయూరహారాభిరామశ్చలత్కుండలశ్రీలసద్గండభాగః |
కటౌ పీతవాసాః కరే చారుశక్తిః – పురస్తాన్మమాస్తాం పురారేస్తనూజః || ౧౭ ||
ఇహాయాహి వత్సేతి హస్తాన్ప్రసార్యాహ్వయత్యాదరాచ్ఛంకరే మాతురంకాత్ |
సముత్పత్య తాతం శ్రయంతం కుమారం – హరాశ్లిష్టగాత్రం భజే బాలమూర్తిమ్ || ౧౮ ||



కుమారేశసూనో గుహ స్కంద సేనాపతే శక్తిపాణే మయూరాధిరూఢ |
పులిందాత్మజాకాంత భక్తార్తిహారిన్ – ప్రభో తారకారే సదా రక్ష మాం త్వమ్ || ౧౯ ||
ప్రశాంతేంద్రియే నష్టసంజ్ఞే విచేష్టే – కఫోద్గారివక్త్రే భయోత్కమ్పిగాత్రే |
ప్రయాణోన్ముఖే మయ్యనాథే తదానీం – ద్రుతం మే దయాలో భవాగ్రే గుహ త్వమ్ || ౨౦ ||




కృతాంతస్య దూతేషు చండేషు కోపాద్దహచ్ఛింద్ధి భింద్ధీతి మాం తర్జయత్సు |
మయూరం సమారుహ్య మా భైరితి త్వం – పురః శక్తిపాణిర్మమాయాహి శీఘ్రమ్ || ౨౧ ||
ప్రణమ్యాసకృత్పాదయోస్తే పతిత్వా – ప్రసాద్య ప్రభో ప్రార్థయేఽనేకవారమ్ |
న వక్తుం క్షమోఽహం తదానీం కృపాబ్ధే – న కార్యాంతకాలే మనాగప్యుపేక్షా || ౨౨ ||




సహస్రాండభోక్తా త్వయా శూరనామా – హతస్తారకః సింహవక్త్రశ్చ దైత్యః |
మమాంతర్హృదిస్థం మనఃక్లేశమేకం – న హంసి ప్రభో కిం కరోమి క్వ యామి || ౨౩ ||
అహం సర్వదా దుఃఖభారావసన్నో – భవాందీనబంధుస్త్వదన్యం న యాచే |
భవద్భక్తిరోధం సదా క్లృప్తబాధం – మమాధిం ద్రుతం నాశయోమాసుత త్వమ్ || ౨౪ ||


అపస్మారకుష్టక్షయార్శః ప్రమేహజ్వరోన్మాదగుల్మాదిరోగా మహాంతః |
పిశాచాశ్చ సర్వే భవత్పత్రభూతిం – విలోక్య క్షణాత్తారకారే ద్రవంతే || ౨౫ ||
దృశి స్కందమూర్తిః శ్రుతౌ స్కందకీర్తిర్ముఖే మే పవిత్రం సదా తచ్చరిత్రమ్ |
కరే తస్య కృత్యం వపుస్తస్య భృత్యం – గుహే సంతు లీనా మమాశేషభావాః || ౨౬ ||
మునీనాముతాహో నృణాం భక్తిభాజామభీష్టప్రదాః సంతి సర్వత్ర దేవాః |
నృణామంత్యజానామపి స్వార్థదానే – గుహాద్దేవమన్యం న జానే న జానే || ౨౭ ||
కలత్రం సుతా బంధువర్గః పశుర్వా – నరో వాథ నారీ గృహే యే మదీయాః |
యజంతో నమంతః స్తువంతో భవంతం – స్మరంతశ్చ తే సంతు సర్వే కుమార || ౨౮ ||




మృగాః పక్షిణో దంశకా యే చ దుష్టాస్తథా వ్యాధయో బాధకా యే మదంగే |
భవచ్ఛక్తితీక్ష్ణాగ్రభిన్నాః సుదూరే – వినశ్యంతు తే చూర్ణితక్రౌంచశైల || ౨౯ ||






జనిత్రీ పితా చ స్వపుత్రాపరాధం – సహేతే న కిం దేవసేనాధినాథ |
అహం చాతిబాలో భవాన్ లోకతాతః – క్షమస్వాపరాధం సమస్తం మహేశ || ౩౦ ||
నమః కేకినే శక్తయే చాపి తుభ్యం – నమశ్ఛాగ తుభ్యం నమః కుక్కుటాయ |
నమః సింధవే సింధుదేశాయ తుభ్యం – పునః స్కందమూర్తే నమస్తే నమోఽస్తు || ౩౧ ||
జయానందభూమం జయాపారధామం – జయామోఘకీర్తే జయానందమూర్తే |
జయానందసింధో జయాశేషబంధో – జయ త్వం సదా ముక్తిదానేశసూనో || ౩౨ ||



భుజంగాఖ్యవృత్తేన క్లృప్తం స్తవం యః – పఠేద్భక్తియుక్తో గుహం సంప్రణమ్య |
స పుత్రాన్కలత్రం ధనం దీర్ఘమాయుర్లభేత్స్కందసాయుజ్యమంతే నరః సః || ౩౩ ||

అభిలాషాష్టకము’ (ఆత్మావీరేశ్వర స్తోత్రం) (కాశీఖండం 10వ అధ్యాయం)

అభిలాషాష్టకము’ (ఆత్మావీరేశ్వర స్తోత్రం) (కాశీఖండం 10వ అధ్యాయం)
విశ్వానరుడు వీరేశ్వర లింగమునుండి తనకు ఎనిమిదేళ్ళ బాలునిగా సాక్షాత్కరించిన శివుని స్తుతించినది.
౧. ఏకం బ్రహ్మైవాద్వితీయం సమస్తం సత్యం సత్యం నేహ నానాస్తి కించిత్!
ఏకోరుద్రో నద్వితీయోవతస్థే తస్మాదేకం త్వాం ప్రపద్యే మహేశం!!
౨. ఏకః కర్తా త్వం హి సర్వస్య శంభో నానారూపే ష్వేకరూపోస్య రూపః!
యద్వత్ప్రత్యపస్వర్క ఏకోప్యనేక స్తస్మాన్నాన్యం త్వాం వినేశం ప్రపద్యే!!


౩. రజ్జౌ సర్పః శుక్తికాయాంచ రూప్యం నైరః పూరః తన్మృగాఖ్యే మరీచౌ!
యద్వత్తద్వద్విష్వగేష ప్రపంచో యస్మిన్ జ్ఞాతే తమ్ ప్రపద్యే మహేశం!!
౪. తోయే శైత్యం దాహకత్వం చ వహ్నౌ తాపో భానౌ శీతభానౌ ప్రసాదః!
పుష్పే గంధో దుగ్ధమధ్యేపి సర్పిః యత్తచ్ఛంభోత్వం తతస్త్యాం ప్రపద్యే!!



౫. శబ్దం గృహ్ణాసి అశ్రవాస్త్యం హి జిఘ్రేరఘ్రాణస్త్యం వ్యంఘ్రిరాయాసి దూరాత్!
వ్యక్షః పశ్యేస్త్యం రసజ్ఞోప్యజిహ్వః కస్త్వాం సమ్యగ్ వేత్త్యతస్త్యాం ప్రపద్యే!!
౬. నో వేదస్త్వామీశ సాక్షాద్ధివేద నోవా విష్ణుః నోవిధాతాఖిలస్య!
నోయోగీంద్రా నేంద్ర ముఖ్యాశ్చ దేవా భక్తో వేద త్వామతస్త్యాం ప్రపద్యే!!
౭. నో తే గోత్రం నేశ జన్మాపి నాఖ్యా నోవారూపం నైవశీలం న దేశః!
ఇత్థం భూతోపీశ్వరస్త్యం త్రైలోక్యాః సర్వాన్ కామాన్ పూరయే స్తద్భజే త్వాం!!




౮. త్వత్తః సర్వం త్వంహి సర్వం స్మరారే త్వం గౌరీశస్త్యంచ నగ్నోతి శాంతః!
త్వం వైవృద్ధస్త్వం యువాత్వం చ బాలః తత్త్వం యత్కిం నాస్యతస్త్యాం నతోస్మి!!
ఫలశ్రుతి: ఈ స్తోత్ర పఠనం పుత్రపౌత్ర ధనప్రదము, సర్వ శాంతికరము, సర్వాపత్పరినాశకము, స్వర్గమోక్ష సంపత్తికారకము. ప్రాతః కాలమున నిద్రమేల్కొని, చక్కగా స్నానము చేసి, శివలింగమును పూజించి ఒక సంవత్సరము జపించిన యెడల అపుత్రకుడు పుత్రవంతుడగును. వైశాఖ, కార్తిక, మాఘమాసము లందు విశేష ఫలప్రదము. స్త్రీగాని, పురుషుడు గాని వీరేశ్వర లింగ సన్నిధియందు నియమ పూర్వకముగా ఒక సంవత్సరము జపించుటవలన పుత్రవంతుడగును. సందేహం లేదు.
శ్లో!! స్త్రియావా పురుషేణాపి నియమాల్లింగసన్నిధౌ!
అబ్దం జప్తమిదం స్తోత్రం పుత్రదం నాత్ర సంశయః!!