Thursday, 1 December 2016

జంధ్యమేసినంత మాత్రాన బ్రాహ్మణత్వం సిద్ధిస్తుందా?
టోపీ ధరించినంత మాత్రాన ఇస్లాం సారం వంటపడినట్టేనా?
ఎద పై శిలువ వ్రేలాడదీసుకున్నంత మాత్రాన క్రీస్తు మార్గంలో నడుస్తున్నట్టేనా?
జంధ్యమేసుకొమ్మని, టోపీ లు, శిలువలు ధరించమని నేను చెప్పానా?
నేను మిమ్మల్ని, మీకోసం ప్రకృతిని సృష్టిస్తే మీరు మీ ఇష్టానుసారం కుల, మతాలను సృష్టించుకుని చంపుకుంటూ చివరకు నాకోసమే అని సమర్ధించుకుంటారా?


మీ అవసరాలకు, విలాసాలకు ప్రకృతి ని నాశనం చేసి విలయాలకు బాధ్యున్ని నేనంటూ నన్ను ఆడిపోసుకుంటారా?
దీక్షలు తీసుకోమని నేను చెప్పానా?
కడుపు కాల్చుకోమని నేను చెప్పానా?
మోకాళ్ళ మీద నడిచి రమ్మని నేను చెప్పానా?
మీలోనే ఉన్న నన్ను కనుగొనలేక గుళ్ళలో, మసీదు లలో, చర్చి లలో వెతుకుతున్నారు..
రక్తాలు కారేలా నేను కొట్టుకోమన్నానా.?
మా మతం శాంతి అని చెప్తూ, ఇతర మతాల వారు దైవంగా బావించే గోమాతను భక్షించమని నేను చెప్పానా.?
మతం పేరుతో జిహదీ యుద్దాలు చెయ్యమని నేను చెప్పానా.?
బాంబు దాడులు చెయ్యమని నేను చెప్పానా.?

అర్ధరాత్రిలు ప్రార్ధనల పేరుతో మోసాలు చెయ్యమని నేను చెప్పాన.?
మతం మార్చమని నేను చెప్పానా. ?
మీ తల్లిదండ్రులలొ నన్ను చూసుకోమని చెప్పాను,
చెప్పింది మాత్రం చెయ్యరు,
ఆకలన్నవానికి పిడికెడు ముద్ద పెట్టలేరు కానీ హుండీ లో కోట్ల రూపాయలు గుమ్మరిస్తారు, మీరిచ్చే కాగితపు నోట్లు నాకు అవసరమా?
మీరు సృష్టించుకున్న కాగితాలకిస్తున్నంత విలువ, మానవ సంబంధాలకు ఇవ్వడం మర్చిపోయారు
ఎప్పటికైనా మీరు నాదగ్గరకు రావలసిన వారే అన్న స్పృహ లేకుండా బ్రతుకుతున్నారు.
చనిపోయిన తరువాత మిమ్మల్ని చుట్టే వస్త్రానికి జేబులు ఉండవు,
సంపాదించిన సొమ్మును
దాచుకోడానికి నీ సమాధిలో బీరువాలు ఉండవు,
చనిపోయిన తరువాత మిమ్మల్ని తీసుకు వచ్చే నా దూతలు మీ ప్రలోభాలకు లొంగి లంచం కూడా తీసుకోరని గుర్తించుకోండి..

దేవుళ్ళలో ఒక్క పరమశివుడికి మాత్రమే లింగరూపం ఉండటంలోని విశేషమేమిటంటే…

ఈలోకంలో ఉన్న దేవుళ్ళలో ఎవరికీ లింగరూపం లేదు…………..
ఒక్క పరమ శివుడికి మాత్రమే లింగరూపం ఉండటంలోని విశిష్టత ఏమిటి……….?
పరమేశ్వరుణ్ణి ఎప్పటి నుండి లింగరూపంలో కొలుస్తున్నారో మీకు తెలుసా…………?
శివ లింగము అనేది శివుడిని సూచించే ఒక పవిత్ర చిహ్నం.
సాంప్రదాయంలో లింగము శక్తి సూచికగా, దైవ సంభావ్యతగా పరిగణింపబడుతోంది.
పూర్వం శివుడ్ని విగ్రహ రూపం లోనే పూజించే వారు
(హరప్పా శిధిలాలలో దొరికిన పశుపతి విగ్రహాన్ని పరిశీలించవచ్చు).
వరాహపురాణం లోని వేంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన గాధ లో భృగు మహర్షి శాప ఘట్టం లో భృగుమహర్షి శివుడ్ని “నేటి నుండి నీ లింగానికే కానీ నీ విగ్రహానికి పూజలుండవు,
నీ ప్రసాదం నింద్యం అవుతుంది” అని శపిస్తాడు.అంటే అంతకుముందు విగ్రహానికి పూజలుండేవన్నమాట.
శివ లింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించి పూజించే ఆచారం మాత్రం ప్రాచీనమైనదే.
ఇది ఎప్పుడు ప్రారంభమైందో ఇప్పటి దాకా ఎవరూ ఖచ్చితంగా తేల్చలేదు.
శివం అనే పదానికి అర్థం శుభప్రథమైనది అని.
లింగం అంటే సంకేతం అని అర్థం. అంటే శివలింగం సర్వ శుభప్రథమైన దైవాన్ని సూచిస్తుంది.
శివలింగము(మానుష లింగము) లో మూడు భాగాలు ఉంటాయి.
బ్రహ్మ భాగము భూమిలో , విష్ణు భాగం పీఠం లొ , శివ భాగం మనకు కనిపించే పూజా భాగము గా ఉంటుంది.
శివ లింగములు – రకములు
• స్వయం భూ లింగములు:స్వయముగా వాటి అంతట అవే వెలసినవి.
• దైవిక లింగములు:దేవతా ప్రతిష్టితాలు.
• రుష్య లింగములు:ఋషి ప్రతిష్టితాలు.
• మానుష లింగములు:ఇవి మానవ నిర్మిత లింగములు.
• బాణ లింగములు:ఇవి నర్మదా నదీతీరాన దొరికే(తులా పరిక్షకు నెగ్గిన)బొమ్మరాళ్ళు(pebbles).
పంచభూతలింగాలు
పంచభూతాలు అనగా పృథివి, జలం అగ్ని, వాయువు, ఆకాశం. శివుడు
ఈ పంచభూతాల స్వరూపాలైన లింగరూపాలతో ఐదు క్షేత్రాలలో ప్రతిష్టితుడై ఉన్నాడు.
• 1. తేజో లింగం: అన్నామలైశ్వరుడు – అన్నామలై
• 2. జల లింగం: జంబుకేశ్వరుడు- తిరువనైకావల్ లేదా జంబుకేశ్వరం
• 3. ఆకాశ లింగం: చిదంబరేశ్వరుడు(నటరాజ)- చిదంబరం
• 4. పృథ్వీ లింగం: ఏకాంబరేశ్వరుడు – కంచి
• 5. వాయు లింగం: శ్రీకాళహస్తీశ్వరుడు – శ్రీకాళహస్తి
పంచారామాలు
• 1. అమారారామము:
అమరావతి (గుంటూరు జిల్లా) శ్రీ అమరేశ్వర స్వామి, బాలచాముండికా దేవి
• 2. ద్రాక్షారామము:
ద్రాక్షారామ (తూర్పు గోదావరి జిల్లా) శ్రీ భీమేశ్వర స్వామి, మాణిక్యాంబ
• 3. కుమారారామము:
సామర్లకోట (తూర్పు గోదావరి జిల్లా) శ్రీ కుమార భీమేశ్వర స్వామి, బాలాత్రిపురసుందరి
• 4 భీమారామము:
భీమవరము (పశ్చిమ గోదావరి జిల్లా) శ్రీ సోమేశ్వర స్వామి, అన్నపూర్ణ
• 5. క్షీరారామము:
పాలకొల్లు (పశ్చిమ గోదావరి జిల్లా) శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి.
కొన్ని విశేషాలు:
• శ్రీకాళహస్తి లోని శివలింగాన్ని అభిషేకించేటపుడు ఎవరూ లింగాన్ని తాకరు.
కేవలం లింగం యొక్క కింద భాగమైన పానువట్టాన్ని మాత్రమే తాకుతారు.
• కంచి లోని శివలింగం మట్టి తో చేసినది(పృధ్వీ లింగం)
కాబట్టి లింగానికి అభిషేకము జరగదు.నూనెను మాత్రం పూస్తారు.


పెసరపప్పుతో ఎంత పెద్ద జ్వరాన్ని అయినా 15 నిమిషాల్లో తగ్గించొచ్చు..!

నిజానికి జ్వరం అంటే ఏమిటి? జ్వరం ఎందుకు వస్తుంది? ఆరోగ్యంగా ఉండే వ్యక్తి శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెంటిగ్రేడ్‌ (98.6 డిగ్రీల ఫారెన్‌హీట్‌) ఉంటుంది. ఎవరికైనా జ్వరం (ఫీవర్‌) వచ్చిందంటే ఆ వ్యక్తి శరీర ఉష్ణోగ్రత పెరిగిందన్నమాటే. జ్వరం తీవ్రత 107.6 ఫారన్‌హీట్‌ను మించినపుడు బ్రెయిన్‌ డ్యామేజ్‌కు ఆస్కారం ఉంటుంది. అయితే జ్వరాన్ని తగ్గించాలంటే…ముందుగా టెంపరేచర్ ను కంట్రోల్ చేయాలి. అమాంతం పెరిగిపోయిన టెంపరేచర్ ను నార్మల్ లెవల్ కు తీసుకువస్తే…జ్వరాన్ని తగ్గించినట్టే..! అందుకోసం ఓ చిన్న చిట్కాను పాటిస్తే చాలు..!


ఓ కప్పు పెసరపప్పును తీసుకొని, దానిని ఓ సారి కడిగి, ఓ గిన్నె నిండా నీళ్లు పోసి అందులో పెసరపప్పును ఓ 20 నిమిషాలు నానబెట్టాలి. 20 నిమిషాల తర్వాత ఆ పెసరపప్పు కడిగిన నీళ్లను ఓ గ్లాస్ లో పోసి జ్వరంతో బాధపడుతున్న వ్యక్తికి తాగించాలి. జ్వరంతో బాధపడుతున్న వ్యక్తి…ఈ నీటిని తాగిన 10 నిమిషాల్లో అతని బాడీ టెంపరేచర్ క్రమంగా తగ్గుకుంటూ వస్తుంది. ఓ 20 నిమిషాల తర్వాత అతడు సాధారణ స్థితికి చేరుకుంటాడు. అప్పటి వరకు చేదుగా ఉన్న అతని నోరు…ఇప్పుడు కాసింత దారిలోకి వస్తుంది. ఆ సమయంలో తేలికగా జీర్ణమయ్యే పదార్థాలను తినిపించాలి. దీనితో పాటు డాక్టర్ ఇచ్చిన మందులను వాడుతుండాలి.


పెసరపప్పు లో వేడిని తగ్గించే అద్భుతమైన గుణాలున్నాయి, ఓ 20 నిమిషాల నానబెట్టడం వల్ల ఆ గుణాన్ని ఆ నీటికి సంక్రమింపజేస్తుంది పెసరపప్పు. అంతే కాదు పెసలలో విటమిన్ బి, విటమిన్ సి, మాంగనీస్ తోపాటు ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. సూర్యుని నుంచి వచ్చే అతినీలిలోహిత కిరణాలు, పర్యావరణ కాలుష్యం వల్ల వచ్చే చర్మ సమస్యల నుండి కూడా కాపాడే శక్తి పెసళ్లకు ఉంది. పెసళ్లను మన ఆహారంలో భాగం చేసుకోవడం చాలా ఉత్తమం. వేడి ఎక్కువగా ఉండే వాళ్లకు ఈ పెసరపప్పు ఓ వరం. పండగలప్పుడు పెసరపప్పు పానకం చేస్తారు. శరీరంలో వేడిని తగ్గించి వ్యాధి నిరోధక శక్తిని పెంచటంలో ఈ పానకం సమర్దవంతంగా పనిచేస్తుంది.
share it



nij

వ్యాసుడు చెప్పిన కాలజ్ఞానం గురించి మీకు తెలుసా ? చాల ఇంట్రెస్టింగ్ అందరూ చదవండి

హిందువులు అత్యంత ప‌విత్రంగా భావించే ఓ పుణ్యస్థ‌లం మొత్తం నీటితో నిండిపోతుంద‌ట‌. హెయిర్‌స్టైల్‌ను బ‌ట్టే అందం నిర్దార‌ణ‌కు వ‌స్తార‌ట‌. కేవ‌లం తమ సొంత క‌డుపు నిండ‌డ‌మే ల‌క్ష్యంగా మాన‌వులు జీవిస్తార‌ట‌. కుటుంబ క‌ష్టాల‌ను, సంసారాన్ని ఈదే మ‌నుషులు గొప్ప‌వార‌వుతార‌ట‌. మ‌త విశ్వాసాల‌ను పాటించే వారు, పూజ‌లు చేసే వారు కేవ‌లం వాటిని మొక్కుబ‌డి కోస‌మే చేస్తార‌ట‌.


దేవుడి గురించే కాదు, ప్ర‌పంచంలోని ఏ విష‌యం గురించి తెలియ‌కున్నా అలాంటి వారే గొప్ప స‌న్యాసులుగా, యోగులుగా, స్వామీజీలుగా కీర్తించ‌బ‌డ‌తార‌ట‌. ప్ర‌జ‌లు, నాయ‌కులు, బ‌డాబాబులు, ధ‌న‌వంతులు వారిన పూజిస్తార‌ట‌.
విప‌రీత‌మైన చ‌లి, గాలులు, ఎండ‌, వ‌ర్షాలు, మంచు వంటి ప్ర‌కృతి భీభ‌త్సాలే కాక మ‌నుషులు గొడ‌వ‌లు, ఆక‌లి, దాహం, వ్యాధులు వంటి కార‌ణాల వ‌ల్ల ఎక్కువగా న‌శిస్తార‌ట‌


.
స్త్రీ, పురుషులు ఇద్ద‌రూ వివాహం చేసుకోకుండానే స‌హ‌జీవ‌నం చేయ‌డం ప్రారంభిస్తార‌ట‌. వ్యాపారాలు చేసే వారికి మోస‌పూరిత‌మైన బుద్ధి బాగా పెరిగిపోతుంద‌ట‌. కేవ‌లం జంధ్యం వేసుకుంటే చాలు, అలాంటి వారిని బ్రాహ్మ‌ణుల‌ని అంటార‌ట‌.
మ‌నుషుల మ‌ధ్య తార‌త‌మ్యాలు తీవ్ర స్థాయికి చేరుకుంటాయ‌ట‌. ఈర్ష్య‌, అసూయ‌, ద్వేషాలు పెరిగిపోతాయ‌ట‌. ప‌క్క వారే కాదు సొంత బంధువులు, కుటుంబ స‌భ్యులే చిన్న గొడ‌వ‌ల‌కే ఒక‌ర్ని ఒక‌రు చంపుకుంటార‌ట‌.
ధ‌న‌వంతులుగా పుట్టిన వారికే ఎక్కువ మ‌ర్యాద ద‌క్కుతుంద‌ట‌. పేద వాడికి న్యాయం జ‌ర‌గ‌ద‌ట‌. డ‌బ్బున వారిదే శ‌క్తిగా, వారు ఆడిందే ఆట‌గా మారుతుంద‌ట‌.



మనుషులు త‌మ పెద్ద‌వారిని, త‌ల్లిదండ్రుల‌ను అస్స‌లు గౌర‌వించ‌ర‌ట‌. వారిని వృద్ధాప్యంలో దూరం చేస్తార‌ట‌.
క‌లియుగంలో క‌లి ప్ర‌భావం వ‌ల్ల మ‌తం, నిజాయితీ, నీతి, శుభ్ర‌త‌, స‌హ‌నం, ఓర్పు, ద‌య‌, జీవిత ప్ర‌మాణ కాలం, శారీర‌క శ‌క్తి, జ్ఞాప‌క‌శ‌క్తి వంటివ‌న్నీ రోజు రోజుకీ త‌గ్గిపోతాయ‌ట‌. చివ‌ర‌కి మ‌నిషి ప‌త‌న‌మ‌వుతాడ‌ట‌.



దొంగ‌ల‌దే సామ్రాజ్యం అవుతుంద‌ట‌. వారు అన్ని ప్ర‌దేశాల‌ను పంచుకుంటార‌ట‌. రాజ‌కీయ నాయ‌కుల్లో అవినీతి పెచ్చ‌రిల్లుతుంద‌ట‌. వారు ప్ర‌జ‌ల‌ను ఏ మాత్రం ప‌ట్టించుకోర‌ట‌. వారు కేవ‌లం బాబాజీల‌ను మాత్ర‌మే న‌మ్ముతార‌ట‌.
ఎవ‌రు ఏ మ‌తానికి చెందుతారో తెలుసుకోవ‌డం కోసం ప్ర‌త్యేకంగా గుర్తులు, చిహ్నాలు ధ‌రించాల్సి వ‌స్తుంద‌ట‌. మ‌నిషి త‌న జీవితం గ‌డ‌వ‌డం కోసం ధ‌నం సంపాదించ‌డం క‌ష్ట‌త‌ర‌మ‌వుతుంద‌ట‌. బాగా మేథ‌స్సు ఉన్న‌వారు గొప్ప‌వారిగా పేరు తెచ్చుకుంటార‌ట‌.
share it

బిల్వాష్టోత్తర శతనామస్తోత్రం:

త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధమ్ ।
త్రిజన్మ పాపసంహారమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౧॥
త్రిశాఖైః బిల్వ పత్రైశ్చ అశ్ఛిద్రైః కోమలైః శుభైః ।
తవ పూజాం కరిష్యామి ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౨॥
సర్వత్రైలోక్య కర్తారం సర్వత్రైలోక్య పాలనమ్ ।
సర్వత్రైలోక్య హర్తారమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౩॥
నాగాధిరాజవలయం నాగహారేణభూషితమ్ ।
నాగకుండలసంయుక్తమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౪॥
అక్షమాలాధరం రుద్రం పార్వతీ ప్రియవల్లభమ్ ।
చన్ద్రశేఖరమీశానమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౫॥
త్రిలోచనం దశభుజం దుర్గాదేహార్ధధారిణమ్।
విభూత్యభ్యర్చితం దేవం ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౬॥
త్రిశూలధారిణం దేవం నాగాభరణసున్దరమ్ ।
చన్ద్రశేఖరమీశానమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౭॥
గఙ్గాధరామ్బికానాథం ఫణికుణ్డలమణ్డితమ్ ।
కాలకాలం గిరీశం చ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౮॥
శుద్ధస్ఫటిక సంకాశం శితికంఠం కృపానిధిమ్ ।
సర్వేశ్వరం సదాశాన్తమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౯॥
సచ్చిదానన్దరూపం చ పరానన్దమయం శివమ్ ।
వాగీశ్వరం చిదాకాశం ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౧౦॥
శిపివిష్టం సహస్రాక్షం కైలాసాచలవాసినమ్ ।
హిరణ్యబాహుం సేనాన్యమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౧౧॥

భూతేశం ఖణ్డపరశుం వామదేవం పినాకినమ్ ।
వామే శక్తిధరం శ్రేష్ఠమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౨౨॥
ఫాలేక్షణం విరూపాక్షం శ్రీకంఠం భక్తవత్సలమ్ ।
నీలలోహితఖట్వాఙ్గమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౨౩॥
కైలాసవాసినం భీమం కఠోరం త్రిపురాన్తకమ్ ।
వృషాఙ్కం వృషభారూఢమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౨౪॥
సామప్రియం సర్వమయం భస్మోద్ధూలిత విగ్రహమ్ ।
మృత్యుఞ్జయం లోకనాథమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౨౫॥
దారిద్ర్యదుఃఖహరణం రవిచన్ద్రానలేక్షణమ్ ।
మృగపాణిం చన్ద్రమౌళిమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౨౬॥
సర్వలోకభయాకారం సర్వలోకైకసాక్షిణమ్ ।
నిర్మలం నిర్గుణాకారమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౨౭॥
సర్వతత్త్వాత్మకం సామ్బం సర్వతత్త్వవిదూరకమ్ ।
సర్వతత్త్వస్వరూపం చ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౨౮॥
సర్వలోక గురుం స్థాణుం సర్వలోకవరప్రదమ్ ।
సర్వలోకైక నేత్రం చ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౨౯॥
మన్మథోద్ధరణం శైవం భవభర్గం పరాత్మకమ్ ।
కమలాప్రియ పూజ్యంం చ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౩౦॥
తేజోమయం మహాభీమమ్ ఉమేశం భస్మలేపనమ్ ।
భవరోగవినాశం చ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౩౧॥
స్వర్గాపవర్గఫలదం రఘునాథవరప్రదమ్ ।
నగరాజసుతాకాంతమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౩౨॥
మంజీరపాదయుగలం శుభలక్షణలక్షితమ్ ।
ఫణిరాజ విరాజం చ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౩౩॥
నిరామయం నిరాధారం నిస్సఙ్గం నిష్ప్రపఞ్చకమ్ ।
తేజోరూపం మహారౌద్రమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౩౪॥
సర్వలోకైక పితరం సర్వలోకైక మాతరమ్ ।
సర్వలోకైక నాథం చ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౩౫॥


చిత్రామ్బరం నిరాభాసం వృషభేశ్వర వాహనమ్ ।
నీలగ్రీవం చతుర్వక్త్రమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౩౬॥
రత్నకఞ్చుకరత్నేశం రత్నకుణ్డల మణ్డితమ్ ।
నవరత్న కిరీటం చ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౩౭॥
దివ్యరత్నాఙ్గులీ స్వర్ణం కణ్ఠాభరణభూషితమ్ ।
నానారత్నమణిమయమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౩౮॥
రత్నాఙ్గులీయ విలసత్కరశాఖానఖప్రభమ్ ।
భక్తమానస గేహం చ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౩౯॥
వామాఙ్గభాగ విలసదమ్బికా వీక్షణప్రియమ్ ।
పుణ్డరీకనిభాక్షం చ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౪౦॥
సమ్పూర్ణకామదం సౌఖ్యం భక్తేష్టఫలకారణమ్ ।
సౌభాగ్యదం హితకరమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౪౧॥
నానాశాస్త్రగుణోపేతం స్ఫురన్మంగల విగ్రహమ్ ।
విద్యావిభేదరహితమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౪౨॥
అప్రమేయగుణాధారం వేదకృద్రూప విగ్రహమ్ ।
ధర్మాధర్మ ప్రవృత్తం చ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౪౩॥
గౌరీవిలాససదనం జీవజీవపితామహమ్ ।
కల్పాన్తభైరవం శుభ్రమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౪౪॥
సుఖదం సుఖనాశం చ దుఃఖదం దుఃఖనాశనమ్ ।
దుఃఖావతారం భద్రం చ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౪౫॥
సుఖరూపం రూపనాశం సర్వధర్మ ఫలప్రదమ్ ।
అతీంద్రియం మహామాయమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౪౬॥
సర్వపక్షిమృగాకారం సర్వపక్షిమృగాధిపమ్ ।
సర్వపక్షిమృగాధారమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౪౭॥
జీవాధ్యక్షం జీవవంద్యం జీవజీవనరక్షకమ్ ।
జీవకృజ్జీవహరణమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౪౮॥
విశ్వాత్మానం విశ్వవంద్యం వజ్రాత్మావజ్రహస్తకమ్ ।
వజ్రేశం వజ్రభూషం చ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౪౯॥
గణాధిపం గణాధ్యక్షం ప్రలయానలనాశకమ్ ।
జితేన్ద్రియం వీరభద్రమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౫౦॥
త్ర్యమ్బకం మృడం శూరం అరిషడ్వర్గనాశనమ్ ।
దిగమ్బరం క్షోభనాశమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౫౧॥
కున్దేన్దు శంఖధవలమ్ భగనేత్రభిదుజ్జ్వలమ్ ।
కాలాగ్నిరుద్రం సర్వజ్ఞమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౫౨॥
కమ్బుగ్రీవం కమ్బుకంఠం ధైర్యదం ధైర్యవర్ధకమ్ ।
శార్దూలచర్మవసనమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౫౩॥
జగదుత్పత్తి హేతుం చ జగత్ప్రలయకారణమ్ ।
పూర్ణానన్ద స్వరూపం చ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౫౪॥
సర్గకేశం మహత్తేజం పుణ్యశ్రవణ కీర్తనమ్ ।
బ్రహ్మాండనాయకం తారమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౫౫॥
మన్దారమూలనిలయం మన్దారకుసుమప్రియమ్ ।
బృన్దారకప్రియతరమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౫౬॥
మహేన్ద్రియం మహాబాహుం విశ్వాసపరిపూరకమ్ ।
సులభాసులభం లభ్యమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౫౭॥
బీజాధారం బీజరూపం నిర్బీజం బీజవృద్ధిదమ్ ।
పరేశం బీజనాశం చ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౫౮॥
యుగాకారం యుగాధీశం యుగకృద్యుగనాశనమ్ ।
పరేశం బీజనాశం చ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౫౯॥
ధూర్జటిం పిఙ్గలజటం జటామణ్డలమణ్డితమ్ ।
కర్పూరగౌరం గౌరీశమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౬౦॥
సురావాసం జనావాసం యోగీశం యోగిపుఙ్గవమ్ ।
యోగదం యోగినాం సింహమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౬౧॥
ఉత్తమానుత్తమం తత్త్వమ్ అంధకాసురసూదనమ్ ।
భక్తకల్పద్రుమస్తోమమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౬౨॥
విచిత్రమాల్యవసనం దివ్యచన్దనచర్చితమ్ ।
విష్ణుబ్రహ్మాది వంద్యం చ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౬౩॥
కుమారం పితరం దేవం శ్రితచన్ద్రకలానిధిమ్ ।
బ్రహ్మశత్రుం జగన్మిత్రమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౬౪॥
లావణ్యమధురాకారం కరుణారసవారధిమ్ ।
భ్రువోర్మధ్యే సహస్రార్చిమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౬౫॥
జటాధరం పావకాక్షం వృక్షేశం భూమినాయకమ్ ।
కామదం సర్వదాగమ్యమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౬౬॥
శివం శాన్తం ఉమానాథం మహాధ్యానపరాయణమ్ ।
జ్ఞానప్రదం కృత్తివాసమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౬౭॥
వాసుక్యురగహారం చ లోకానుగ్రహకారణమ్ ।
జ్ఞానప్రదం కృత్తివాసమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౬౮॥
శశాఙ్కధారిణం భర్గం సర్వలోకైకశఙ్కరమ్ ।
శుద్ధం చ శాశ్వతం నిత్యమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౬౯॥
శరణాగత దీనార్తి పరిత్రాణపరాయణమ్ ।
గమ్భీరం చ వషట్కారమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥౭౦॥
భోక్తారం భోజనం భోజ్యం జేతారం జితమానస్ ।
కరణం కారణం జిష్ణుమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౭౧॥
క్షేత్రజ్ఞం క్షేత్రపాలఞ్ చ పరార్ధైకప్రయోజనమ్ ।
వ్యోమకేశం భీమవేషమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౭౨॥
భవజ్ఞం తరుణోపేతం చోరిష్టం యమనాశనమ్ ।
హిరణ్యగర్భం హేమాఙ్గమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౭౩॥
దక్షం చాముణ్డజనకం మోక్షదం మోక్షనాయకమ్ ।
హిరణ్యదం హేమరూపమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౭౪॥
మహాశ్మశాననిలయం ప్రచ్ఛన్న స్ఫటికప్రభమ్ ।
వేదాస్యం వేదరూప। చ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౭౫॥
స్థిరం ధర్మమ్ ఉమానాథం బ్రహ్మణ్యం చాశ్రయం విభుమ్ ।
జగన్నివాసం ప్రథమమేక బిల్వం శివార్పణమ్ ॥ ౭౬॥
రుద్రాక్షమాలాభరణం రుద్రాక్షప్రియవత్సలమ్ ।
రుద్రాక్షభక్త సంస్తోమమేక బిల్వం శివార్పణమ్ ॥ ౭౭॥
ఫణీన్ద్ర విలసత్కంఠం భుజఙభరణప్రియమ్ ।
దక్షాధ్వర వినాశం చ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౭౮॥
నాగేన్ద్ర విలసత్కర్ణం మహీన్ద్రవలయావృతమ్ ।
మునివంద్యం మునిశ్రేష్ఠమేక బిల్వం శివార్పణమ్ ॥ ౭౯॥
మృగేన్ద్రచర్మవసనం మునీనామేకజీవనమ్ ।
సర్వదేవాది పూజ్యం చ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౮౦॥
నిధనేశం ధనాధీశమ్ అపమృత్యువినాశనమ్ ।
లిఙ్గమూర్తిమలిఙ్గాత్మమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౮౧॥
భక్తకల్యాణదం వ్యస్తం వేదవేదాంతసంస్తుతమ్ ।
కల్పకృత్కల్పనాశం చ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౮౨॥
ఘోరపాతకదావాగ్నిం జన్మకర్మవివర్జితమ్ ।
కపాలమాలాభరణమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౮౩॥
మాతఙ్గచర్మవసనం విరాడ్రూపవిదారకమ్ ।
విష్ణుక్రాంతమనంతం చ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౮౪॥
యజ్ఞకర్మఫలాధ్యక్షం యజ్ఞవిఘ్నవినాశకమ్ ।
యజ్ఞేశం యజ్ఞభోక్తారమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౮౫॥
కాలాధీశం త్రికాలజ్ఞం దుష్టనిగ్రహకారకమ్ ।
యోగిమానసపూజ్యం చ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౮౬॥
మహోన్నతమహాకాయం మహోదరమహాభుజమ్ ।
మహావక్త్రం మహావృద్ధమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౮౭॥
సునేత్రం సులలాటం చ సర్వభీమపరాక్రమమ్ ।
మహేశ్వరం శివతరమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౮౮॥
సమస్తజగదాధారం సమస్తగుణసాగరమ్ ।
సత్యం సత్యగుణోపేతమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౮౯॥
మాఘకృష్ణచతుర్దశ్యాం పూజార్ధం చ జగద్గురోః ।
దుర్లభం సర్వదేవానామ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౯౦॥
తత్రాపిదుర్లభం మన్యేత్ నభోమాసేన్దువాసరే ।
ప్రదోషకాలేపూజాయామ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౯౧॥
తటాకంధననిక్షేపం బ్రహ్మస్థాప్యం శివాలయమ్
కోటికన్యామహాదానమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౯౨॥
దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనమ్।
అఘోరపాపసంహారమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౯౩॥
తులసీబిల్వనిర్గుణ్డీ జంబీరామలకం తథా ।
పఞ్చబిల్వమితిఖ్యాతమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౯౪॥
అఖణ్డబిల్వపత్రైశ్చ పూజయేన్నందికేశ్వరమ్ ।
ముచ్యతే సర్వపాపేభ్యః ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౯౫॥
సాలంకృతాశతావృత్తా కన్యాకోటిసహస్రకమ్ ।
సామ్రాజ్యపృథ్వీదానం చ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౯౬॥
దన్త్యశ్వకోటిదానాని అశ్వమేధసహస్రకమ్ ।
సవత్సధేనుదానాని ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౯౭॥
చతుర్వేదసహస్రాణి భారతాదిపురాణకమ్ ।
సామ్రాజ్యపృథ్వీదానం చ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౯౮॥
సర్వరత్నమయం మేరుం కాఞ్చనం దివ్యవస్త్రకమ్ ।
తులాభాగం శతావర్తమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౯౯॥
అష్టోత్తరశ్శతం బిల్వం యోర్చయేల్లిఙ్గమస్తకే ।
అధర్వోక్తమ్ అధేభ్యస్తు ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౧౦౦॥
కాశీక్షేత్రనివాసం చ కాలభైరవదర్శనమ్ ।
అఘోరపాపసంహారమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౧౦౧॥
అష్టోత్తరశ్శతశ్లోకైః స్తోత్రాద్యైః పూజయేద్యధాః ।
త్రిసంధ్యం మోక్షమాప్నోతి ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౧౦౨॥
దన్తికోటిసహస్రాణాం భూః హిరణ్యసహస్రకమ్ ।
సర్వక్రతుమయం పుణ్యమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౧౦౩॥
పుత్రపౌత్రాదికం భోగం భుక్త్వాచాత్రయధేప్సితమ్ ।
అంతేజ శివసాయుజ్యమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౧౦౪॥
విప్రకోటిసహస్రాణాం విత్తదానాశ్చయత్ఫలమ్ ।
తత్ఫలం ప్రాప్నుయాత్సత్యమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౧౦౫॥
త్వన్నామకీర్తనం తత్త్వతవపాదామ్బుయః పిబేత్ ।
జీవన్ముక్తోభవేన్నిత్యమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౧౦౬॥
అనేకదానఫలదమ్ అనన్తసుకృతాదికమ్ ।
తీర్థయాత్రాఖిలం పుణ్యమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౧౦౭॥
త్వం మాం పాలయ సర్వత్ర పదధ్యానకృతం తవ ।
భవనం శాఙ్కరం నిత్యమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౧౦౮॥
ఉమయాసహితం దేవం సవాహనగణం శివమ్ ।
భస్మానులిప్తసర్వాఙ్గమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౧౦౯॥
సాలగ్రామసహస్రాణి విప్రాణాం శతకోటికమ్ ।
యజ్ఞకోటిసహస్రాణి ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౧౧౦॥
అజ్ఞానేన కృతం పాపం జ్ఞానేనాభికృతం చ యత్ ।
తత్సర్వం నాశమాయాత్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౧౧౧॥
అమృతోద్భవవృక్షస్య మహాదేవప్రియస్య చ ।
ముచ్యంతే కంటకాఘాతాత్ కంటకేభ్యో హి మానవాః ॥ ౧౧౨॥
ఏకైకబిల్వపత్రేణ కోటియజ్ఞఫలం భవేత్ ।
మహాదేవస్య పూజార్థమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౧౧౩॥
ఏకకాలే పఠేన్నిత్యం సర్వశత్రునివారణమ్ ।
ద్వికాలేచ పఠేన్నిత్యం మనోరథఫలప్రదమ్ ।
త్రికాలేచ పఠేన్నిత్యమ్ ఆయుర్వర్ధ్యో ధనప్రదమ్ ।
అచిరాత్కార్యసిద్ధిం చ లభతే నాత్ర సంశయః ॥ ౧౧౪॥
ఏకకాలం ద్వికాలం వా త్రికాలం యః పఠేన్నరః ।
లక్ష్మీప్రాప్తిశ్శివావాసః శివేన సహ మోదతే ॥ ౧౧౫॥
కోటిజన్మ కృతం పాపమ్ అర్చనేన వినశ్యతి ।
సప్తజన్మకృతం పాపం శ్రవణేన వినశ్యతి ।
జన్మాన్తరకృతం పాపం పఠనేన వినశ్యతి ।
దివారాత్రకృతం పాపం దర్శనేన వినశ్యతి ।
క్షణేక్షణేకృతం పాపం స్మరణేన వినశ్యతి ।
పుస్తకం ధారయేద్దేహి ఆరోగ్యం భయనాశనమ్ ॥ ౧౧౬॥

ఇతి బిల్వాష్టోత్తర శతస్తోత్రం సమాప్తా

గోమాత విగ్రహానికి ఒక ప్రత్యేకత, విశిష్టత ఉంది. అదేమిటంటే…

ఓం నమఃశివాయ
ఇక్కడ ఫోటోలో మీరు చూస్తున్న గోమాత విగ్రహం కడపజిల్లా ప్రొద్దుటూరు పట్టణానికి సమీపంలోని
ఉప్పరపల్లె లో ఉన్న నవ దేవాలయ ప్రాంగణం నారాయణాశ్రమంలో ఉంది.
మిగిలిన తొమ్మిది దేవతా మూర్తుల విగ్రహాలతో పాటు ఈ గోమాత విగ్రహానికి కూడా ప్రత్యేక ఆలయం ఉంది.
ఇక్కడున్న గోమాత విగ్రహానికి ఒక ప్రత్యేకత, విశిష్టత ఉంది. అదేమిటంటే……….
ఈ దేవాలయాల ప్రాంగణంలోనే ఒక గోశాల ఉంది. అక్కడ దాదాపుగా 200 గోవులకు పైగానే ఉన్నాయి.
అక్కడున్న మిగతా ఆలయాల మాదిరిగానే గోమాతకు కూడా ఒక ఆలయం నిర్మించాలని సంకల్పించిన
ఆశ్రమ నిర్వాహకులు , గోశాలలో ఉన్న ఒక గోవును పోలినట్లుగానే విగ్రహం ఉండాలని శిల్పాచార్యున్ని దేవాలయ ప్రాంగణంలోకే పిలిపించారు.



ఆయన గోశాలలో ఉన్న గోవులలో ఒక గోవును ఎంపిక చేసుకొని ,
దాని మాదిరిగానే విగ్రహం ఉండాలని , దేవాలయ ప్రాంగణంలోనే దీక్ష తీసుకొని,
గోవు యొక్క విగ్రహాన్ని అద్భుతంగా రూపొందించాడు.
ఈ విగ్రహం ఆలయ ప్రాంగణంలో ప్రతిష్టించే సమయంలో ఒక ఆశ్చర్యకర అద్భుతం జరిగింది.
ఖచ్చితంగా విగ్రహాన్ని ప్రతిష్టించే సమయంలో…….
ఏ గోవును ఆధారంగా చేసుకొని శిల్పాచార్యుడు ఈ విగ్రహాన్ని రూపొందించాడో………..
ఆ గోవు ఉన్నట్లుండి ఆకస్మికంగా శివైక్యం పొందింది.
నాటి నుండి నేటి వరకు గోమాతకు విశేష పూజలు నిర్వహిస్తున్నారు.
ఈ గోమాత ఆలయం ప్రక్కలోనే కాశీ నుండి తెచ్చి ప్రతిష్టించిన శివలింగం ఉంది.
ఇక్కడ భక్తులే స్వయంగా శివలింగాన్ని స్పర్శిస్తూ అన్ని రకాల పూజలూ చేసుకునే సదుపాయం కల్పించారు.
బిల్వవృక్షాల మధ్యలో ఎంతో శోభాయమానంగా ఉన్న ఈ శివ లింగాన్ని
ప్రతి నిత్యం అనేక మంది భక్తులు దర్శిస్తూ ఉంటారు.
ప్రతిరోజూ ఈ ఆలయ ప్రాంగణంలో భజన కార్యక్రమాలతో , ఆధ్యాత్మిక శోభతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది.

share this

దానిమ్మకాయ రసం తో ఇలా చెయ్యండి.. నిగనిగలాడే చర్మం పొందండి.

మీ చర్మం నల్లగా ఉందని బాధపడుతున్నారా.. మీ అందంతో అందరిని అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారా… బ్యూటిఫుల్ స్కిన్ కోసం ప్రయత్నిస్తున్నారా… అయితే దానిమ్మకాయతో సాధ్యమవుతుంది. పెరుగుతున్న పొల్యూషన్ మధ్య జీవిస్తున్న వారి సంఖ్య ఎక్కువైతున్న ఈ రోజుల్లో స్కిన్ డిసీస్ లు చాలా మందిని వేధిస్తున్నాయి. పొల్యూషన్ నుండి తమ అందమైన స్కిన్ ను కాపాడుకోవడానికి ముఖాలను కవర్ చేసుకొని బయట తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సమస్య నుండి దూరం కావడానికి దానిమ్మకాయ మంచి మందుగా పనిచేస్తుందని చెప్తున్నారు డాక్టర్లు.



దానిమ్మ ఫేస్ ప్యాక్ : 
ఎరన్ని ముదురు రంగు పండ్లలో దానిమ్మ ఒకటి. దీన్ని హోం మేడ్ ఫేస్ ప్యాక్ గా ఉపయోగించుకోవచ్చు. ఒక కప్పు దానిమ్మ గింజలను పేస్ట్ చేసి 3/4కప్పు క్రీమ్ మిక్స్ చేసి ముఖం, మెడ కు అప్లై చేయాలి. ఈ ప్యాక్ అప్లై చేసిన తర్వాత 20నిముషాలు అలాగే ఉండి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల ఆయిల్ స్కిన్ తొలగిపోతుంది. చర్మం ప్రకాశవంతంగా క్లియర్ గా ఉంటుంది.