Monday, 24 October 2016

బెర్ముడా ట్ర‌యాంగిల్ వెనుక ఉన్న అస‌లు ర‌హ‌స్యాన్ని ఛేదించిన సైంటిస్టులు.!? bermuda triangle mystery

ఈ భూ ప్ర‌పంచంమే కాదు, అస‌లు మొత్తం విశ్వ‌మంటేనే అనేక వింత‌లు, విశేషాల‌కు నిల‌యం. వాటిలో మ‌న‌కు రోజుకో కొత్త విష‌యం తెలుస్తూనే ఉంది. అయినా మ‌నిషి ప్ర‌య‌త్నాలు మాత్రం ఆగ‌డం లేదు. విశ్వంలో ఇంకా దాగి ఉన్న ఎన్నో విశేషాల‌ను తెలుసుకోవాల‌ని ఎప్ప‌టికప్పుడు ఉవ్విళ్లూరుతూనే ఉన్నాడు.






ఈ క్ర‌మంలో కొన్ని విష‌యాల‌ను మాత్రం తెలుసుకుంటున్నాడు, కానీ కొన్ని మాత్రం ఎప్ప‌టికీ మిస్ట‌రీలుగానే మిగిలిపోతున్నాయి. అలాంటి వాటిలో పేరుగాంచింది బెర్ముడా ట్ర‌యాంగిల్‌. కొన్ని శ‌తాబ్దాల కాలం నాటి నుంచి బెర్ముడా ట్ర‌యాంగిల్ ఓ మిస్ట‌రీగానే మారిపోయింది. కానీ దాన్ని ఎవరూ ఛేదించ‌లేక‌పోయారు. అయితే సైంటిస్టులు ఈ ట్ర‌యాంగిల్ వెనుక ఉన్న అస‌లు ర‌హ‌స్యాన్ని క‌నిపెట్టేశార‌ట‌.








 మియామి, ప్యూర్టోరికో, బెర్ముడాల మ‌ధ్య విస్త‌రించి ఉన్న‌దే బెర్ముడా ట్ర‌యాంగిల్‌. ఎన్నో వంద‌ల సంవత్స‌రాల కాలం నుంచి ఇదొక మిస్ట‌రీగా మారిపోయింది. కార‌ణం అక్క‌డ సంచ‌రించే షిప్పులు లేదంటే విమానాలు ట్ర‌యాంగిల్‌లో ప‌డి అదృశ్య‌మ‌వుతుండ‌డ‌మే. అయితే అలా అవి ఎందుకు మిస్ అవుతున్నాయో ఎవ‌రూ కూడా ఇప్ప‌టి వ‌రకు చెప్ప‌లేక‌పోయారు. దాని ర‌హ‌స్యాన్ని ఛేదించాల‌ని చూసి కూడా చాలా మంది విఫ‌ల‌మ‌య్యారు.









 కొంద‌రైతే ఏకంగా త‌మ ప్రాణాల‌నే పోగొట్టుకున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా ప‌లువురు సైంటిస్టులు ఈ ట్ర‌యాంగిల్ వెనుక ఉన్న అస‌లు ర‌హస్యాన్ని ఛేదించేశారు కూడా. అక్క‌డ షిప్పులు, విమానాలు ఎందుకు అదృశ్య‌మ‌వుతున్నాయో వారు వివ‌ర‌ణ‌లు కూడా ఇచ్చారు.






 చిత్రంలో చూశారుగా. ష‌డ్బుజి (హెగ్జాగాన్‌) ఆకారంలో కూడిన మేఘాలు బెర్ముడా ట్ర‌యాంగిల్ ప్ర‌దేశంలోని వాతావ‌ర‌ణంలో సుమారు 20 నుంచి 50 మైళ్ల పొడ‌వున ఒక్కొక్క‌టి విస్త‌రించి ఉన్నాయి. నిజానికి సైంటిస్టులు చెబుతున్న‌దేమిటంటే ఇవి సాధార‌ణ మేఘాలు కావ‌ట‌. వీటిని ఎయిర్ బాంబ్స్ అని పిలుస్తార‌ట‌. అంటే ఇవి గాలి శ‌క్తితో కూడిన పెద్ద పెద్ద బాంబుల‌న్న‌మాట‌.





 సాధార‌ణ బాంబుల‌లాగే ఇవి కూడా విస్ఫోట‌న శ‌క్తిని క‌లిగి ఉంటాయి. అయితే అది గాలి రూపంలో ఉంటుంది. అలా విస్ఫోట‌నం చెందిన‌ప్పుడు అక్క‌డి వాతావ‌ర‌ణంలో ఉండే గాలి అప్ప‌టిక‌ప్పుడే 170 మైళ్ల వేగాన్ని అందుకుంటుంద‌ట‌. దీంతో ఆ ప్ర‌దేశానికి స‌మీపంలో ఉన్న షిప్పులు, విమానాలు కూడా ఆ గాలి శ‌క్తి నిల‌వ‌లేవ‌ట‌. అందుకే అవి స‌ద‌రు ట్ర‌యాంగిల్‌లో అదృశ్య‌మ‌వుతున్నాయ‌ని సైంటిస్టులు తేల్చేశారు. అయితే స‌ద‌రు ష‌డ్బుజి మేఘాలు అక్క‌డే ఎందుకు ఉన్నాయనే విష‌యాన్ని మాత్రం సైంటిస్టులు చెప్ప‌లేదు. దానికి కూడా వారికి త్వ‌ర‌లో స‌మాధానం దొరుకుతుంద‌నే ఆశిద్దాం.

Friday, 21 October 2016

బ్రౌన్ రైస్ ఇడ్లీ మధుమేహగ్రస్తులకు స్పెషల్ బ్రేక్ ఫాస్ట్


సౌత్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్ రిసిపిలో చాలా వెరైటీలున్నాయి. వాటిలో ముఖ్యంగా రెగ్యులర్ గా తయారు చేసుకొనే బ్రేక్ ఫాస్ట్ రిసిపిలు, ఇడ్లీ, దోసె, ఉప్మా, పొంగల్, రైస్ ఐటమ్స్ లో కొన్ని. వీటిల్లో ఇడ్లీ చాలా పాపులర్ వంటకం. చాలా త్వరగా తయారయ్యే వంటకం. ఇడ్లీ సాంబార్, చట్నీ రుచి మాత్రమే కాదు. హెల్తీ మరియు కడుపు ఫుల్ గా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. రెగ్యులర్ గా తయారు చేసుకొని ఇడ్లీ తినితిని బోరుకొడుతుంటే కొంచెం వెరైటీగా ట్రై చేయండి.




బ్రౌన్ రైస్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. అందుకే వీటిని మన రెగ్యులర్ డైట్ లో ఏదో ఒక విధంగా తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మధుమేహగ్రస్తులకు ఈ బ్రౌన్ రైస్ తో చేసే వంటలు చాలా సహాయపడుతాయి. బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుతాయి. దాంతో పాటు ఇన్సులిన్ స్థాయిలు కూడా స్థిరంగా ఉండేలా చేస్తాయి. బ్రౌన్ రైస్ లో అధిక శాతంలో ఫైబర్ ఉన్నందున క్యాన్సర్ నివారిస్తుంది, బరువు తగ్గిస్తుంది మరియు షుగర్ లెవల్స్ ను స్థిరంగా ఉంచుతుంది. ఈ హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రిసిపిని మధుమేహగ్రస్తులు డైలీ బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకోవచ్చు.




కావల్సిన పదార్థాలు:
బ్రౌన్ రైస్: 3cups
ఉద్దిపప్పు: 1/2cup
పోహా(అటుకులు): 1/2cupఉప్పు: రుచికి సరిపడా
నీళ్ళు: 7-8cups

తయారుచేయు విధానం:
1. ముందుగా బ్రౌన్ రైస్, పోహ, ఉద్దిపప్పు మూడింటిని వేరు వేరుగా శుభ్రంగా కడిగి, తర్వాత నీళ్ళు పోసి 8గంటల పాటు నానబెట్టుకోవాలి.
2. 8గంటల తర్వాత రైస్,పోహా, ఉద్దిపప్పు నుండి నీళ్ళను వంపేసి, మూడింటిని వేరువేరుగా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి.





3. ఇలా చేసుకొన్న తర్వాత అన్ని పదార్థాలను ఒక పెద్ద బౌల్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి . ఈ మిశ్రమాన్ని నాలుగు గంటలపాటు పక్కన పెట్టుకోవాలి. పిండి పులుయడానికి కొద్ది సమయం పడుతుంది.
4. తర్వాత అందులో ఉప్పు మిక్స్ చేసి, ఇడ్లీ ప్లేట్స్ లో పోయాలి తర్వాత, ఇడ్లీ ప్లేట్స్ ను ఇడ్లీ పాత్రలో పెట్టి 5-10నిముషలు ఆవిరి మీద ఉడికించుకోవాలి.
5. అంతే ఐదు నిముషాల తర్వాత ఇడ్లీ స్టాండ్ ను బయటకు తీసి, వేడి వేడి ఇడ్లీలను కొబ్బరి చట్నీతో సర్వ్ చేయాలి.

Sunday, 28 August 2016

wish you happy birthday to king nagarjuna నాగార్జున పుట్టిన రోజు

అక్కినేని నాగేశ్వర రావు వారసుడిగా టాలీవుడ్లో కి అడుగుపెట్టి తనదైన యాక్టింగ్ తో, తనదైన డిక్షన్ తో తెలుగు ప్రేక్షకుల్లో యువ సామ్రాట్ గా , ఆ తర్వాతా టాలీవుడ్ మన్మథుడిగా , టాలీవుడ్ కింగ్ గా తెలుగు ప్రేక్షకుల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు.. తొలి సినిమా విక్రమ్ నుంచి ఇప్పటి ఊపిరి వరకు విలక్షణమైన నటనను చూపించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించున్న నాగార్జున పుట్టిన రోజు ఈరోజు..

భక్తి రస చిత్రాలు తీయాలంటే గుర్తొచ్చేది నాగ్.. లవ్ సినిమాలు చేయాలంటే జ్ఞాపకం వచ్చేది నాగ్.. మాస్ సినిమా లకు పెర్మనెంట్ అడ్రస్, పీరియాడిక్ సినిమాలకు కేర్ అఫ్ అడ్రస్.. అన్ని రకాలా సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పెట్టారు.. ఒక యాక్టర్ గా, ఒక ప్రొడ్యూసర్ గా, ఒక ప్రజెంటర్ గా అన్ని రకాల పాత్రలు పోషిస్తూ టాలీవుడ్ కే కాదు అన్ని వుడ్ లకు పరిచమయి అక్కడ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు..
ప్రతిభావంతులైన కొత్త వారిని ప్రోత్సహిస్తూ ఎంతో మందికి మంచి భవిష్యత్ ని అందించిన నాగ్ నుంచి వచ్చిన కొన్ని మంచి సినిమాల గురించి తెలుసుకుందాం..

Saturday, 27 August 2016

selfie bride ,bridegroom waiting....marriage


WHAT SWORD DID YOU GET?


GANAPATHI IDOL 59 FT HEGHT KHAIRATHABAD HYDERABAD


Ganapathi Bappa Moriya Visakha Maha Ganapati Suru by the Guinness record for the arrival of 12,500 kg heavy Laddu Laddu preparation గణపతి బప్పా మోరియా విశాఖ మహా గణపతి కి గిన్నిస్ రికార్డు లడ్డు రాక సురుచి వారిచే 12,500 కిలోల భారీ లడ్డు తయారీ

గణపతి బప్పా మోరియా
విశాఖ మహా గణపతి కి గిన్నిస్ రికార్డు లడ్డు రాక
సురుచి వారిచే 12,500 కిలోల భారీ లడ్డు తయారీ. .
రాజమండ్రి,ప్రపంచం లోనే అతి పెద్ద లడ్డు గా 12,500 కిలోల భారీ లడ్డు తయారు చేస్తున్నాట్టు సురుచి అధినేత పోలిశెట్టి మల్లిబాబు శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ లడ్డూ తయారీకి రూ. 30 లక్షలు వ్యయం అవుతుందని అంచనా. లడ్డూను విశాఖపట్నం లోని గాజువాకలో విశ్వ నెలకొల్పే దేశంలోనే అతిపెద్ధ గణనాథుని విగ్రహానికి సమర్పించనున్నట్టు తెలిపారు. ఈ లడ్డూను పూర్తిగా ఉచితంగా ఇవ్వనున్నారు. మిత్రులు, బంధువులు ఇచ్చే విరాళాలలతో దీన్ని తయారు చేయనున్నారు. దీంతో పాటు ఎప్పటి లాగే హైదరాబాదులోని ఖైరతాబాద్ గణనాథుడికి 500 కిలోల లడ్డూ ఉచితంగా సమర్పిస్తారు. దీంతో పాటు రామచంద్రపురం ,కాకినాడ , అయినవల్లి, బిక్కవోలు, హైదరాబాదు చాపల బజార్లకు లడ్డూలు పంపుతారు. గిన్నిస్ లడ్డూతో పాటు ఈ లడ్డూల తయారీకి ఈ నెల 29 ఆదివారం మల్లిబాబు తో పాటు 20 సురుచి సిబ్బంది వినాయక మాలధారణ చేస్తారు. ఆవరణలో ఏర్పాటు చేసిన మిఠాయి మేస్త్రి గణనాథుని ప్రతిష్టిస్తారు. సెప్టెంబరు 2 న తయారీ ఆరంభిస్తారు. 3 న జీడిపప్పు ఫేస్టుతో అలంకరణ తుది మెరుగులు దిద్ధుతారు. 4 న ప్రజల సందర్శనార్ధం ఉంచి సాయంత్రం ఇటు హైదరాబాద్ అటు విశాఖ పట్నం లకు భారీ క్రేన్ ల సాయంతో తరలిస్తారు. హైదరాబాద్ లో గవర్నర్ నరసింహన్ దంపతుల ప్రత్యేక పూజల అనంతరం 500 కిలోల లడ్డూను ఖైరతాబాద్ గణనాథుని హస్తంలో అలంకరిస్తారు. గాజువాకలోని అతి పెద్ధ వినాయక విగ్రహం వద్ధ గిన్నిస్ రికార్డు సురుచి లడ్డూ (12500 కిలోల ) ను నివేదిస్తారు.
ఇప్పటివరకూ గుజరాత్ రాష్ట్రంలోని అంబాజీ పట్టణంలో 11115 కిలోల లడ్డూ 2015 సెప్టెంబర్ 24న తయారు చేసినట్టు గిన్నిస్ లో నమోదై వుంది. ఇపుడు సురుచి 12500 కిలోల లడ్డూను తయారు చేసి గిన్నీస్ రికార్డు కోసం ప్రయత్నిస్తోంది.