Friday, 18 January 2019

Amavas | Official Trailer | Sachiin Joshi | Nargis Fakhri | Releasing on...







Watch the Official Trailer of Amavas starring Sachiin Joshi, Nargis Fakhri, Mona Jasbir Singh, Ali Asgar Agha, Navneet Kaur Dhillon and Vivan Bhathena directed by Bhushan Patel.

The film is slated to release on 11th January, 2019.

The film is presented under the banner of Viiking Media Entertainment.




amavas,amavasya,amavas trailer,trailer,official trailer,spooky,horror film,suspense,thriller,new year video,2019,january,bollywood film,popular video,new video,trending video,sachiin joshi,nargis fakhri,navneet kaur dhillon,ali asgar,vivan bhathena,alone,mona singh,bhushan patel,scary movie,best movie,awards,simmba,zero review,simmba review,new youtube video

Thursday, 27 September 2018

Snake bite posion.

___________________________________
दोस्तो सबसे पहले साँपो के बारे मे एक महत्वपूर्ण
बात आप ये जान लीजिये ! कि अपने देश भारत मे
550 किस्म के साँप है ! जैसे एक cobra है ,viper है
,karit है ! ऐसी 550 किस्म की साँपो की जातियाँ
हैं ! इनमे से मुश्किल से 10 साँप है जो जहरीले है सिर्फ
10 ! बाकी सब non poisonous है! इसका मतलब ये
हुआ 540 साँप ऐसे है जिनके काटने से आपको कुछ
नहीं होगा !! बिलकुल चिंता मत करिए !
लेकिन साँप के काटने का डर इतना है (हाय साँप ने
काट लिया ) और कि कई बार आदमी heart attack
से मर जाता है !जहर से नहीं मरता cardiac arrest से
मर जाता है ! तो डर इतना है मन मे ! तो ये डर
निकलना चाहिए !
वो डर कैसे निकलेगा ????
जब आपको ये पता होगा कि 550 तरह के साँप है
उनमे से सिर्फ 10 साँप जहरीले हैं ! जिनके काटने से
कोई मरता है ! इनमे से जो सबसे जहरीला साँप है
उसका नाम है !
russell viper ! उसके बाद है karit इसके बाद है viper
और एक है cobra ! king cobra जिसको आप कहते है
काला नाग !! ये 4 तो बहुत ही खतरनाक और जहरीले
है इनमे से किसी ने काट लिया तो 99 % chances है
कि death होगी !
लेकिन अगर आप थोड़ी होशियारी दिखाये तो आप
रोगी को बचा सकते हैं
होशियारी क्या दिखनी है ???
आपने देखा होगा साँप जब भी काटता है तो उसके
दो दाँत है जिनमे जहर है जो शरीर के मास के अंदर
घुस जाते हैं ! और खून मे वो अपना जहर छोड़ देता है !
तो फिर ये जहर ऊपर की तरफ जाता है ! मान
लीजिये हाथ पर साँप ने काट लिया तो फिर जहर
दिल की तरफ जाएगा उसके बाद पूरे शरीर मे
पहुंचेगा ! ऐसे ही अगर पैर पर काट लिया तो फिर
ऊपर की और heart तक जाएगा और फिर पूरे शरीर मे
पहुंचेगा ! कहीं भी काटेगा तो दिल तक जाएगा !
और पूरे मे खून मे पूरे शरीर मे उसे पहुँचने मे 3 घंटे लगेंगे !
मतलब ये है कि रोगी 3 घंटे तक तो नहीं ही मरेगा !
जब पूरे दिमाग के एक एक हिस्से मे बाकी सब जगह पर
जहर पहुँच जाएगा तभी उसकी death होगी
otherwise नहीं होगी ! तो 3 घंटे का time है रोगी
को बचाने का और उस तीन घंटे मे अगर आप कुछ कर ले
तो बहुत अच्छा है !
क्या कर सकते हैं ?? ???
घर मे कोई पुराना इंजेक्शन (injection) हो तो उसे ले
और आगे जहां सुई(needle) लगी होती है वहाँ से
काटे ! सुई(needle) जिस पलास्टिक मे फिट होती है
उस प्लास्टिक वाले हिस्से को काटे !! जैसे ही आप
सुई के पीछे लगे पलास्टिक वाले हिस्से को काटेंगे तो
वो injection एक सक्षम पाईप की तरह हो जाएगा !
बिलकुल वैसा ही जैसा होली के दिनो मे बच्चो की
पिचकारी होती है !
उसके बाद आप रोगी के शरीर पर जहां साँप ने काटा
है वो निशान ढूँढे ! बिलकुल आसानी से मिल जाएगा
क्यूंकि जहां साँप काटता है वहाँ कुछ सूजन आ
जाती है और दो निशान जिन पर हल्का खून लगा
होता है आपको मिल जाएँगे ! अब आपको वो
injection( जिसका सुई वाला हिस्सा आपने काट
दिया है) लेना है और उन दो निशान मे से पहले एक
निशान पर रख कर उसको खीचना है ! जैसी आप
निशान पर injection रखेंगे वो निशान पर चिपक
जाएगा तो उसमे vacuum crate हो जाएगा ! और
आप खींचेगे तो खून उस injection मे भर जाएगा !
बिलकुल वैसे ही जैसे बच्चे पिचकारी से पानी भरते
हैं ! तो आप इंजेक्शन से खींचते रहिए !और आप first
time निकलेंगे तो देखेंगे कि उस खून का रंग हल्का
blackish होगा या dark होगा तो समझ लीजिये
उसमे जहर मिक्स हो गया है !
तो जब तक वो dark और blackish रंग blood
निकलता रहे आप खिंचीये ! तो वो सारा निकल
आएगा ! क्यूंकि साँप जो काटता है उसमे जहर
ज्यादा नहीं होता है 0.5 मिलीग्राम के आस पास
होता है क्यूंकि इससे ज्यादा उसके दाँतो मे रह ही
नहीं सकता ! तो 0.5 ,0.6 मिलीग्राम है दो तीन
बार मे आपने खीच लिया तो बाहर आ जाएगा ! और
जैसे ही बाहर आएगा आप देखेंगे कि रोगी मे कुछ
बदलाव आ रहा है थोड़ी consciousness (चेतना) आ
जाएगी ! साँप काटने से व्यकित unconsciousness
हो जाता है या semi consciousness हो जाता है
और जहर को बाहर खींचने से चेतना आ जाती है !
consciousness आ गई तो वो मरेगा नहीं ! तो ये
आप उसके लिए first aid (प्राथमिक सहायता) कर
सकते हैं !
इसी injection को आप बीच से कट कर दीजिये
बिलकुल बीच कट कर दीजिये 50% इधर 50% उधर !
तो आगे का जो छेद है उसका आकार और बढ़ जाएगा
और खून और जल्दी से उसमे भरेगा !
तो ये आप रोगी के लिए first aid (प्राथमिक
सहायता) के लिए ये कर सकते हैं !
____________________________
दूसरा एक medicine आप चाहें तो हमेशा अपने घर मे
रख सकते हैं बहुत सस्ती है homeopathy मे आती है !
उसका नाम है NAJA (N A J A ) ! homeopathy
medicine है किसी भी homeopathy shop मे
आपको मिल जाएगी ! और इसकी potency है 200 !
आप दुकान पर जाकर कहें NAJA 200 देदो ! तो
दुकानदार आपको दे देगा ! ये 5 मिलीलीटर आप घर
मे खरीद कर रख लीजिएगा 100 लोगो की जान
इससे बच जाएगी ! और इसकी कीमत सिर्फ पाँच रुपए
है ! इसकी बोतल भी आती है 100 मिलीग्राम की
70 से 80 रुपए की उससे आप कम से कम 10000 लोगो
की जान बचा सकते हैं जिनको साँप ने काटा है !
और ये जो medicine है NAJA ये दुनिया के सबसे
खतरनाक साँप का ही poison है जिसको कहते है
क्रैक ! इस साँप का poison दुनिया मे सबसे खराब
माना जाता है ! इसके बारे मे कहते है अगर इसने
किसी को काटा तो उसे भगवान ही बचा सकता
है ! medicine भी वहाँ काम नहीं करती उसी का ये
poison है लेकिन delusion form मे है तो घबराने की
कोई बात नहीं ! आयुर्वेद का सिद्धांत आप जानते है
लोहा लोहे को काटता है तो जब जहर चला जाता
है शरीर के अंदर तो दूसरे साँप का जहर ही काम
आता है !
तो ये NAJA 200 आप घर मे रख लीजिये !अब देनी कैसे
है रोगी को वो आप जान लीजिये !
1 बूंद उसकी जीभ पर रखे और 10 मिनट बाद फिर 1
बूंद रखे और फिर 10 मिनट बाद 1 बूंद रखे !! 3 बार
डाल के छोड़ दीजिये !बस इतना काफी है !
और राजीव भाई video मे बताते है कि ये दवा रोगी
की जिंदगी को हमेशा हमेशा के लिए बचा लेगी !
और साँप काटने के एलोपेथी मे जो injection है वो
आम अस्तप्तालों मे नहीं मिल पाते ! डाक्टर आपको
कहेगा इस अस्तपाताल मे ले जाओ उसमे ले जाओ
आदि आदि !!
और जो ये एलोपेथी वालो के पास injection है
इसकी कीमत 10 से 15 हजार रुपए है ! और अगर मिल
जाएँ तो डाक्टर एक साथ 8 से -10 injection ठोक
देता है ! कभी कभी 15 तक ठोक देता है मतलब लाख-
डेड लाख तो आपका एक बार मे साफ !! और यहाँ
सिर्फ 10 रुपए की medicine से आप उसकी जान
बचा सकते हैं !
और राजीव भाई इस video मे बताते है कि injection
जितना effective है मैं इस दवा(NAJA) की गारंटी
लेता हूँ ये दवा एलोपेथी के injection से 100 गुना
(times) ज्यादा effective है !
तो अंत आप याद रखिए घर मे किसी को साँप काटे
और अगर दवा(NAJA) घर मे न हो ! फटाफट कहीं से
injection लेकर first aid (प्राथमिक सहायता) के
लिए आप injection वाला उपाय शुरू करे ! और अगर
दवा है तो फटाफट पहले दवा पिला दे और उधर से
injection वाला उपचार भी करते रहे !
दवा injection वाले उपचार से ज्यादा जरूरी है !!
________________________________
तो ये जानकारी आप हमेशा याद रखे पता नहीं कब
काम आ जाए हो सकता है आपके ही जीवन मे काम
आ जाए ! या पड़ोसी के जीवन मे या किसी
रिश्तेदार के काम आ जाए! तो first aid के लिए
injection की सुई काटने वाला तरीका और ये NAJA
200 hoeopathy दवा ! 10 - 10 मिनट बाद 1 - 1 बूंद
तीन बार
रोगी की जान बचा सकती है !!

Sunday, 18 March 2018

విళంబి నామ సంవత్సరం రాశిఫలాలు మీనంPisces results 2018

మీనం


పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఆదాయం: 5; వ్యయం: 5

రాజపూజ్యం: 3; అవమానం: 1
సమయస్ఫూర్తి అవసరం. ఆటుపోట్లు ఉన్నా శక్తిమంతులై కార్యాలను పూర్తిచేస్తారు. కాలం సహకరిస్తుంది. మిత్రుల సూచనలు అవసరం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా
పట్టుదలతో పనిచేయండి. ఆర్థికంగా కలిసి వస్తుంది. క్రమంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు. వ్యయభారం పెరుగుతుంది. మొహమాటాన్ని పక్కనపెట్టి సకాలంలో తగిన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగండి. సహనాన్ని కోల్పోవద్దు. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవాలి.అనవసర ధనవ్యయం కాకుండా శ్రద్ధ పెట్టాలి. ఆటంకాలు వాటంతటవే తొలగుతాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది.




అంతిమంగా లక్ష్యాన్ని చేరుకుంటారు. సంతృప్తినిచ్చే ఫలితం దగ్గరలోనే ఉంది. అదృష్టయోగం పడుతుంది. వ్యవస్థాగతంగా సమూల మార్పులు తీసుకురావడానికి అనుకూలమైన కాలమిది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. అచంచలమైన ఆత్మవిశ్వాసం మిమ్మల్ని కార్యోన్ముఖుల్ని చేస్తుంది.




ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారపరంగా కొన్ని మార్పులు చేసుకుంటే అఖండమైన లాభం చేకూరుతుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. మహిళలకు కొంత ఇబ్బందికరంగా ఉన్నా అంతిమంగా కార్యసిద్ధి లభిస్తుంది. ప్రారంభంలో సమస్యలు ఎదురైనా వినయంతో వాటిని సాధిస్తారు. సౌభాగ్య యోగం ఉంది. ఆధ్యాత్మికంగా విశేషమైన దైవరక్షణ లభిస్తుంది. ఆపదల నుంచి బయటపడతారు. ఆరోగ్యరీత్యా అనుకూల కాలం. సుబ్రహ్మణ్య స్తోత్రం పఠించాలి. దుర్గామాత దర్శనం శుభాన్నిస్తుంది. కందులు, శనగలు దానం ఇవ్వాలి.
ఈ రాశివారి అదృష్ట సంఖ్య 3, కలిసొచ్చే వారం - సోమవారం, రంగులు - పసుపుపచ్చ, తెలుపు. అదృష్ట దైవం దుర్గాదేవి.

విళంబి నామ సంవత్సరం రాశిఫలాలు కుంభం Aquarius results 2018

కుంభం


ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
ఆదాయం: 8; వ్యయం: 14
రాజపూజ్యం: 7; అవమానం: 5
అదృష్టం పడుతుంది. దైవబలంతో గొప్పవారవుతారు. సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగంలో మంచి పేరు సంపాదిస్తారు. ఇబ్బందికర సంఘటనలు ఎదురయ్యే సూచనలున్నాయి. ఆటంకాలను సమర్థంగా ఎదుర్కొంటారు. మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరుస్తారు. అసాధారణమైన ప్రతిభతో అనేక విజయాలను సొంతం చేసుకుంటారు. అనుకూల పవనాలు వీస్తాయి.


ప్రయత్నాన్నిబట్టే ఫలితం ఉంటుంది. కాబట్టి బాగా కృషి చేయండి. అర్హత పెరుగుతుంది. సమాజంలో ప్రత్యేకమైన స్థానం లభిస్తుంది. బాధ్యతలు అధికమవుతాయి. విశేషమైన ధనయోగం పడుతుంది. వ్యాపారంలో ఆశించిన దానికంటే రెట్టింపు లాభాలు వస్తాయి. పది రకాలుగా ప్రయత్నాలు మొదలుపెట్టాలి. ఉద్యోగరీత్యా బ్రహ్మాండమైన శుభయోగాలున్నాయి. రాజయోగం పడుతుంది. తగినంత కృషిచేస్తే సరిపోతుంది. మంచి ఆరోగ్యం చేకూరుతుంది. ఇబ్బందులు లేనివిధంగా జీవితం కొనసాగుతుంది. విద్యార్థులకు సరస్వతీ కటాక్షం లభిస్తుంది. చదివింది అక్కరకు వస్తుంది. పోటీతత్వం పెరుగుతుంది. మనోభీష్టం నెరవేరుతుంది. పెద్దల ఆశీర్వచనం పనిచేస్తుంది. మహిళలకు తిరుగులేని విజయాలున్నాయి. భవిష్యత్తు ప్రణాళికలు కొన్ని అమలుచేస్తారు.





అధికారుల మన్ననలు పొందుతారు. కావలసినంత శక్తి లభిస్తుంది. ఆధ్యాత్మికంగా జ్ఞానవృద్ధి లభిస్తుంది. ఖండాంతరాల్లో ఖ్యాతి లభిస్తుంది. బాధ్యతాయుతమైన ప్రవర్తన ఆదర్శవంతమవుతుంది. ఆంజనేయ ధ్యానం శుభాన్నిస్తుంది. శివాలయ దర్శనం ఆరోగ్యాన్నిస్తుంది. గోధుమల దానం ఉద్యోగ బలాన్ని వృద్ధి పరుస్తుంది.

ఈ రాశివారి అదృష్ట సంఖ్య 8, కలిసొచ్చే వారం - బుధవారం, రంగులు - నీలం, ఆకుపచ్చ. అదృష్ట దైవం విష్ణుమూర్తి.

విళంబి నామ సంవత్సరం రాశిఫలాలు మకరం Capricorn 2018 results

మకరం

ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆదాయం: 8; వ్యయం: 14

రాజపూజ్యం: 4; అవమానం: 5
మిశ్రమకాలం. ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే విజయం అవలీలగా వస్తుంది. ఆత్మవిశ్వాసంతో కార్యాలను పూర్తిచేస్తారు. కొన్ని సందర్భాల్లో ఒకటనుకుంటే ఇంకొకటి అవుతుంది. మొహమాటంతో అనవసర ఖర్చులు పెరుగుతాయి. భవిష్యత్తు ప్రణాళికలు ఫలిస్తాయి. ఒక శుభవార్త మీ ఇంట సంతోషాన్ని నింపుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో  పాల్గొంటారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. సమయానుకూలంగా వ్యవహరించండి.


 లక్ష్యం మీద అవగాహనతో ముందుకు సాగాలి. తోటివారికి ఉపయోగపడే పనులు చేపడతారు. ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఏకాగ్రతకు భంగం కలగకుండా వ్యవహరిస్తే సరిపోతుంది. ఎంతటి క్లిష్ట కార్యాన్నైనా ఇట్టే సాధించగల సమర్థత ఏర్పడుతుంది. బంధుమిత్రుల సలహాలు మేలైన ఫలితాలను ఇస్తాయి. ముఖ్యమైన విషయాలపై శ్రద్ధ పెట్టాలి. ఆర్థికాంశాల్లో లాభాలున్నాయి. మానసిక దృఢత్వం అవసరం. ఉద్యోగంలో ఖ్యాతి గడిస్తారు. విందువినోదాల్లో పాలుపంచుకుంటారు. సంపాదన పెరుగుతుంది. ఖర్చు తగ్గిస్తే స్థిరాస్తులు ఏర్పడతాయి. సాహసం చేసి తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాన్నిస్తాయి. శక్తిసామర్థ్యాలు పెరుగుతాయి.



సమాజంలో మంచిపేరును సంపాదిస్తారు. కుటుంబసభ్యులతో విభేదాలు రాకుండా జాగ్రత్తపడండి. మాట పట్టింపులకు పోకండి. కార్యసిద్ధిలో అలుపెరగని శ్రమ అవసరం. అనేక విజయాలకు ఇది సరైన కాలం. అందుకు అవసరమైన శక్తి దైవబలంతో మీకు లభిస్తుంది. వ్యాపారంలో ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయండి. అపార నష్టానికి అవకాశముంది. ఆరోగ్యరీత్యా కొంత ఇబ్బంది తలెత్తే అవకాశముంది. వ్యాపారస్థులకు అనుకూలమైన కాలం. మనసులో చెడు ఆలోచనలు రానీయకండి. ఒక వార్త మనోబలాన్ని పెంచుతుంది. ముందస్తు జాగ్రత్తలు అవసరం. అవసరానికి మించి ఖర్చులుంటాయి. విద్యార్థులకు ఆటంకాలు ఎదురవుతాయి.




 మహిళలకు కొంత శ్రమ ఉన్నా పట్టుదలతో విఘ్నాలను అధిగమిస్తారు. ఆర్థికంగా బలపడతారు. ధనధాన్యాది లాభాలున్నాయి. నూతన పనులు ప్రారంభిస్తారు. స్వేచ్ఛా భావాలతో ఆనందంగా ఉంటారు. గౌరవం పెరుగుతుంది. తగినంత గుర్తింపు లభిస్తుంది. అన్ని రంగాల్లో ముందుకు దూసుకువెళ్తారు. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. ఆంజనేయ స్తోత్రం చదవాలి. శ్రీరామ దర్శనం ఉత్తమం. నువ్వులూ, మినుములూ దానం చేయాలి.
ఈ రాశివారి అదృష్ట సంఖ్య 8, కలిసొచ్చే వారం - శుక్రవారం, రంగులు - నీలం, తెలుపు. అదృష్ట దైవం లక్ష్మీదేవి.

విళంబి నామ సంవత్సరం రాశిఫలాలు ధనుస్సు Sagittarius results 2018

ధనుస్సు


మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
ఆదాయం: 5; వ్యయం: 5

రాజపూజ్యం: 1; అవమానం: 5
బలమైన ప్రయత్నం ద్వారా విజయం సాధిస్తారు. ఆనందకర వాతావరణం ఉంటుంది. చైతన్యవంతంగా పనులు ప్రారంభించండి. బంధుజన సహకారం పూర్తిగా ఉంటుంది.
బుద్ధిబలంతో అంచెలంచెలుగా వృద్ధిని సాధిస్తారు. నూతన కార్యాలు ఉత్సాహాన్నిస్తాయి. గతంలో పూర్తికాని పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి. ఆరోగ్యంపై అశ్రద్ధ వద్దు. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన కాపాడుతుంది. అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. తోటివారి సహకారంతో పనులు పూర్తి అవుతాయి. అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి.





 మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అదృష్టం కలిసొచ్చి గొప్ప స్థితిమంతులవుతారు. అధికార లాభం సూచితం. వస్తు వస్త్రప్రాప్తి. ఒక శుభవార్త ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది.బాధ్యతలు అధికమవుతాయి. శత్రువులు మిత్రులవుతారు. గతంలో ఆగిన పనులను మళ్లీ ప్రారంభిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. బుద్ధి బలం బాగుంటుంది. శత్రువులమీద విజయం సాధిస్తారు. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ఉద్యోగరీత్యా శుభకాలం ఉంటుంది. అందరికీ మేలు చేసే విధంగా మీ ప్రణాళికలుంటాయి. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. సొంత నిర్ణయాలు ఆనందాన్నిస్తాయి. స్వతంత్ర భావాలు రక్షిస్తాయి





. శాశ్వతమైన కీర్తి లభిస్తుంది. దయాగుణం కలిగి ఇతరులకు మేలు చేస్తారు. కుటుంబంలోని వ్యక్తులకు అభివృద్ధి బాగా ఉంటుంది. ఒక విషయంలో ధర్మసంకటం ఏర్పడుతుంది. పెద్దల సూచనలతో ఆటంకాలు తొలగుతాయి. అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారపరంగా జాగ్రత్తలు అవసరం. లక్ష్య సాధనలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా దీటుగా ఎదుర్కొంటారు. మోసపూరిత వాతావరణం ఉంటుంది.





 ఆర్థికంగా అనవసరమైన వ్యయాన్నినివారించండి. విద్యార్థులు శ్రద్ధపెట్టి చదవాలి. ప్రయాణాల్లో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించండి. అశాంతి కలిగినా వెంటనే పూర్వ పుణ్యం వల్ల శాంతి చేకూరుతుంది. కుటుంబ సభ్యుల సలహాలు అక్కరకు వస్తాయి. విభేదాలకు తావివ్వకండి. మహిళలకు పనిభారం పెరుగుతుంది. సంతృప్తినిచ్చే జీవితం లభిస్తుంది. తోటివారి సహకారం ఉంటుంది.


 ఈ రాశివారు ఆరోగ్యరీత్యా కొన్ని నియమాలు పాటించాలి. వెంకటేశ్వరస్వామిని ప్రార్థించాలి. లక్ష్మీ దర్శనం అదృష్టాన్నిస్తుంది. నువ్వులు, మినుములు దానం చేస్తే ఆపదలు తొలగుతాయి.
ఈ రాశివారి అదృష్ట సంఖ్య 3, కలిసొచ్చే వారం - మంగళవారం, రంగులు - పసుపుపచ్చ, ఎరుపు. అదృష్ట దైవం సుబ్రహ్మణ్యస్వామి.

విళంబి నామ సంవత్సరం రాశిఫలాలు వృశ్చికం Scorpio 2018 results

వృశ్చికం

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ
ఆదాయం: 2; వ్యయం: 14

రాజపూజ్యం: 5; అవమానం: 2
కల సాకారమవుతుంది. ఉత్సాహంతో పనులు ప్రారంభిస్తారు. ఆశయం వెంటనే నెరవేరుతుంది. కార్యసాధనలో మీదే పైచేయి అవుతుంది. సకాలంలో స్పందించి ఆపదలు దరిచేరకుండా జాగ్రత్తపడతారు. ఉద్యోగంలో విశేషమైన శుభయోగముంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. పట్టుదలతో ముందడుగు వేయండి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. సంబంధ బాంధవ్యాలు పటిష్ఠం చేసుకుంటారు. శ్రమ పెరుగుతుంది. అద్భుతమైన మేధోసంపత్తితో విజయాలు వశమవుతాయి. ఆర్థికంగా మంచి కాలమిది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి అవుతాయి. మాట విలువను
కాపాడుకోవాలి. అపోహలు తొలగుతాయి. నిబద్ధతతో పనిచేసి ప్రశంసలందుకుంటారు. బుద్ధిబలంతో పెద్దలను మెప్పిస్తారు. స్థానచలన సూచనలున్నాయి. బంధువుల వ్యవహారాల్లో అతి చొరవ తీసుకోవద్దు. విశేషమైన కృషి అవసరం. దయాగుణంతో వ్యవహరిస్తే బంగారు భవిష్యత్తు ఏర్పడుతుంది. సమాజంలో మీ విలువ పెరుగుతుంది.
సంతృప్తినిచ్చే ఫలితాలు వస్తాయి. వ్యాపారంలో ఒడిదొడుకులున్నా సమయస్ఫూర్తితో పనిచేసి లాభాలు రాబడతారు. పక్కనే ఉండి ఇబ్బందిపెట్టేవారున్నారు. సందర్భానుసారం మాట్లాడితే సరిపోతుంది. ఈ రాశి మహిళలకు బాగా కలిసి వస్తుంది. పని ఒత్తిడిని జయిస్తారు. సానుకూల వాతావరణం లభిస్తుంది. కుటుంబ వాతావరణం ఆనందాన్నిస్తుంది. శక్తికి మించిన పనులు చేసి సమాజంలో మీకంటూ ఒక
ప్రత్యేకమైన గుర్తింపును పొందుతారు. విష్ణు సహస్రనామం చదువుకుంటే అదృష్టం పడుతుంది. విష్ణు సందర్శనం శాంతినిస్తుంది. శనగలు, నువ్వులు దానం చేస్తే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి.
ఈ రాశివారి అదృష్ట సంఖ్య 9, కలిసొచ్చే వారం - గురువారం, రంగులు - ఎరుపు, పసుపుపచ్చ. అదృష్ట దైవం శివుడు.

విళంబి నామ సంవత్సరం రాశిఫలాలు 2018 తుల Libra results

తుల


చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆదాయం: 11; వ్యయం: 5

రాజపూజ్యం: 2; అవమానం: 2
బ్రహ్మాండమైన శుభకాలం నడుస్తోంది. అనుకున్నది సాధిస్తారు. ఎటుచూసినా విజయమే కనపడుతోంది. సందేహాస్పదమైన అంశాల్లో పనిచేసేటప్పుడు మిత్రుల సూచనలు పాటించండి. స్వయంప్రతిపత్తితో ముందుకు సాగండి. మనోబలమే విజయానికి మూలం. పెద్దల నిర్ణయాన్ని స్వీకరిస్తే ప్రశాంతత లభిస్తుంది.
కుటుంబసభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు సత్వర శుభాన్నిస్తాయి. మేలు జరిగే ఆలోచనలు కలుగుతాయి. ఉద్యోగపరంగా మంచి ఖ్యాతిని గడిస్తారు. వ్యాపారయోగం బాగా కలిసి వస్తుంది. అదృష్టయోగం పడుతుంది. ఆర్థిక వృద్ధి విశేషంగా ఉంటుంది. మనోధైర్యంతో చేసే పనులు విజయాన్నిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
మీ సత్ప్రవర్తన మీ అభివృద్ధికి మూలం. సంకల్పాలు నెరవేరతాయి. చేసే పనిలో స్పష్టత పెరుగుతుంది. ముఖ్య వ్యవహారాల్లో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అర్హతనుబట్టి లాభాలుంటాయి. వినయ విధేయతలతో పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు. విద్యార్థులకు స్వల్ప ప్రయత్నంతోనే లాభం చేకూరుతుంది.
మనోభీష్టం వెంటనే నెరవేరుతుంది. అనుకున్న రంగాల్లో స్థిరపడతారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలం ముందుకు సాగుతుంది. ఒక వ్యవహారంలో గొప్ప కీర్తిని సొంతం చేసుకుంటారు. ఆరోగ్యపరంగా దృఢంగా ఉంటారు. గతంకంటే అధిక శక్తి లభిస్తుంది. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. పదిమందికీ మేలు చేస్తారు. దైవానుగ్రహంతో ఒక మంచిపని చేపడతారు. సంఘంలో ప్రత్యేక స్థానం లభిస్తుంది. భవిష్యత్తులో సుఖపడే విధంగా ఆలోచనా విధానం ఏర్పడుతుంది. దత్తాత్రేయ స్తోత్రం శుభదాయకం. లక్ష్మీదేవి సందర్శనం మేలు చేస్తుంది. శనగలు దానం చేస్తే ధనబలం మరింతగా పెరుగుతుంది.
ఈ రాశివారి అదృష్ట సంఖ్య 6, కలిసొచ్చే వారం - శనివారం, రంగులు - ఎరుపు, పసుపుపచ్చ. అదృష్ట దైవం శివుడు.

విళంబి నామ సంవత్సరం రాశిఫలాలు కన్య Virgo results 2018

కన్య

ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆదాయం: 14; వ్యయం: 2

రాజపూజ్యం: 6; అవమానం: 6
చక్కని ప్రణాళికలతో విజయం సాధిస్తారు. మనోబలంతో స్థిరమైన ఫలితాలు రాబడతారు. ఉద్యోగంలో అభివృద్ధి అద్భుతంగా ఉంటుంది. సిరిసంపదలు పుష్కలంగా సిద్ధిస్తాయి. విశేషమైన శుభ యోగాలున్నాయి. ధైర్యంగా ముందడుగువేస్తే తిరుగులేని కార్యసిద్ధి ఉంటుంది. శాశ్వతమైన శుభం ఒకటి చేకూరుతుంది. క్రమశిక్షణతో కూడిన ఫలితాలు మీకు గౌరవాన్నిస్తాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. పెద్దల అండదండలు పరిపూర్ణంగా ఉంటాయి. ఆర్థికంగా ఎదుగుదలకు ఇది సరైన సమయం. మంచి ఆలోచనలతో బంగారు భవిష్యత్తును నిర్మిస్తారు. భూలాభం ఉంది. వాహనయోగం పడుతుంది. స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నం చేస్తారు.




అదృష్టం వరిస్తుంది. ఉద్యోగపరంగా అధికారుల సహకారం లభిస్తుంది. ఆనందం కలిగించే వార్తలు వింటారు. ముఖ్య వ్యక్తులకు శుభం జరుగుతుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. దీర్ఘకాల ప్రణాళికలు ఫలిస్తాయి. సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. కొన్ని సందర్భాల్లో వికటించే ప్రమాదం ఉంది. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారంలో మంచి లాభం చేకూరుతుంది. వ్యాపారం దశదిశలా విస్తరిస్తుంది. గృహంలో శుభ కార్యాలు చేపడతారు. ఆరోగ్యంపై ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. దైవ నిర్ణయం మీకు అనుకూలంగానే ఉంటుంది. అనేకమార్గాల్లో పైకి వచ్చే సూచనలు ఉన్నాయి.విద్యార్థులకు మంచి ఫలితం లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. ప్రత్యేకంగా స్త్రీలకు విశేషమైన శుభఫలితాలున్నాయి. మనోబలం ఉంటుంది. మహాలక్ష్మీ స్తోత్రం, లక్ష్మీ దర్శనం శక్తిని పెంచుతాయి. బొబ్బర్లు దానం చేయడం వల్ల ధనయోగం ఉంటుంది.

ఈ రాశివారి అదృష్ట సంఖ్య 5, కలిసొచ్చే వారం - శనివారం, రంగులు - ఆకుపచ్చ, నీలం. అదృష్ట దైవం శివుడు.

విళంబి నామ సంవత్సరం రాశిఫలాలు సింహం leo results 2018

సింహం

మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆదాయం: 11; వ్యయం: 11
రాజపూజ్యం: 3; అవమానం: 6
బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంది. చేపట్టే పనుల్లో శీఘ్ర విజయం లభిస్తుంది. గృహలాభం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీదైన ప్రతిభను కనపరుస్తారు. ధనయోగం క్రమంగా పెరుగుతుంది. శ్రమ అధికమైనా శాంతియుతంగా జీవనం ఉంటుంది. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. విందువినోదాల్లో పాల్గొంటారు. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. మీ ఆలోచనా ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కృషి విశేషంగా


చేయడం అవసరం. విద్యార్థులకు శుభ ఫలితాలు రావాలంటే బాగా శ్రమించాలి. కొన్ని పరిస్థితులు మానసికంగా అసంతృప్తిని కలిగిస్తాయి. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నా ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. వ్యాపారాల్లో ప్రతిభే కీలకమవుతుంది. కాలం ఆనందంగా గడుస్తుంది. తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. మాటపట్టింపులకు దూరంగా
ఉండండి. కొన్ని సందర్భాల్లో శత్రువుల నుంచి అవమానాలు ఎదురవుతాయి. బుద్ధిబలంతో వాటిని ఛేదించండి. వాగ్వాదాలతో కాలం వృథా కాకుండా జాగ్రత్తపడండి. న్యాయబద్ధంగా వ్యవహరించి ఒక విషయంలో లాభపడతారు



. తొందరపడి డబ్బులు ఎవ్వరికీ ఇవ్వకండి. వ్యాపార లాభాలు ఉన్నాయి. సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప విజయాలను అందుకుంటారు. ఈ రాశి మహిళలు అన్ని రంగాల్లోనూ పురోభివృద్ధిని సాధిస్తారు. ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. ప్రతి విషయంలోనూ ఆచితూచి ఆలోచించి పనులను చక్కగా నిర్వర్తిస్తారు. వినయపూర్వకమైన ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆరోగ్యపరంగా ఈ రాశివారికి బాగుంటుంది. దుర్గాస్తోత్రం పఠించాలి. దుర్గాదేవిని సందర్శిస్తే మేలు జరుగుతుంది. మినుములు దానం ఇస్తే మనశ్శాంతి పెరుగుతుంది. ఈ రాశివారి అదృష్ట సంఖ్య 1, కలిసొచ్చే వారం - గురువారం, రంగులు - గులాబీ, పసుపు. అదృష్ట దైవం శివుడు.

విళంబి నామ సంవత్సరం రాశిఫలాలు కర్కాటకం Cancer 2018 results

కర్కాటకం

పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష
ఆదాయం: 8; వ్యయం: 2;

రాజపూజ్యం: 7; అవమానం: 3
సంపదలు సమకూరుతాయి. కొన్ని ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు  సాగుతారు. కలహాలకు అవకాశముంది. ప్రతిదీ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలున్నాయి. వ్యాపార రంగంలోని వారికి ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అనుకోని ఖర్చులు వచ్చిపడతాయి. గొప్ప ప్రయత్నంతో ఆస్తి వృద్ధి చెందుతుంది. శత్రుబాధ తొలగుతుంది. కలహాలకు దూరంగా ఉండాలి. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. శుభకార్య ప్రసక్తి ఉంది. సంతానాభివృద్ధికి సంబంధించిన
శుభవార్తలు వింటారు. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కీలక నిర్ణయాల్లో దృఢంగా వ్యవహరించాలి. బంధుమిత్రుల సలహాలూ సూచనలూ అవసరమవుతాయి. ముఖ్య వ్యవహారాలకోసం పెద్దలను సంప్రదిస్తారు. ఆర్థికంగా బాగా లాభపడతారు. చర స్థిరాస్తులు అభివృద్ధి చెందుతాయి. సాంకేతికపరంగా గొప్ప అభివృద్ధిని సాధిస్తారు. మనసు చెడును ఊహిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలు మానసిక ప్రశాంతతను ఇస్తాయి.


 వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ వాతావరణం ఉంటుంది. పై అధికారుల నుంచి కొంత ఒత్తిడి ఉన్నా అంతిమంగా విజయం లభిస్తుంది. ఆశించిన ఫలితం నిదానంగానైనా వస్తుంది. ప్రయత్నం మాత్రం గట్టిగా ఉండాలి. ఎవ్వరితోనూ విభేదించవద్దు. శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారపరంగా ధనలాభం ఉంది. కీలక పనుల్లో జాప్యం జరిగే సూచనలు ఉన్నాయి. శుభవార్తలు వింటారు. అయితే శ్రమ అధికంగా ఉంటుంది. చిన్నవిషయానికి కూడా అధికంగా ప్రయత్నం చేయాల్సిన కాలం. నూతన వాహనాలు లేదా వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆటంకాలు ఎదురైనా దృఢ చిత్తంతో ముందుకు సాగుతారు. కుటుంబసభ్యుల సలహాలు అక్కరకు వస్తాయి.




అవసరానికి డబ్బు చేతికందుతుంది. ఆరోగ్యపరంగా అనుకూల ఫలితం ఉంటుంది. ప్రయాణాల్లో జాగరూకత అవసరం.శత్రుబాధ తొలగుతుంది. ఆర్థిక వ్యయం పెరిగినా పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. స్థానచలన సూచనలు ఉన్నాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదవాల్సిన కాలం. మహిళలకు సమాజంలో చక్కని గౌరవం లభిస్తుంది. భవిష్యత్తును బాగా తీర్చిదిద్దుతారు. ఎంచుకున్న రంగాల్లో బాగా రాణిస్తారు. తెలివితేటలు వృద్ధి చెందుతాయి. సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. గణపతి దర్శనం ఉత్తమం. కందులు
దానం చేస్తే రుణ సమస్యలు తొలగుతాయి.ఈ రాశివారి అదృష్ట సంఖ్య 2, కలిసొచ్చే వారం - మంగళవారం, రంగులు - తెలుపు, ఎరుపు. అదృష్ట దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు.

విళంబి నామ సంవత్సరం రాశిఫలాలు మిథునం GEMINI RESULTS 2018

మిథునం

మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆదాయం: 14; వ్యయం: 2;

రాజపూజ్యం: 4; అవమానం: 3
సంపూర్ణ ధనలాభం ఉంది. బుద్ధిబలంతో చక్కని ఫలితాలను సాధిస్తారు. అదృష్టఫలాలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ప్రశాంతమైన జీవనవిధానం కొనసాగుతుంది. ఒక శుభవార్త ఆనందాన్ని నింపుతుంది. అవసరానికి తగిన సహకారం అందుతుంది. పనులు స్వల్ప ప్రయత్నంతోనే పూర్తవుతాయి. కీలక
వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఒక నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. మనోబలం పరిపూర్ణంగా రక్షిస్తుంది. బంధువుల అండదండలు లభిస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. ప్రయాణాల్లో ముందుచూపుతో వ్యవహరించాలి. అనవసర ప్రయాణాలు సూచితం. ధర్మచింతనతో న్యాయబద్ధంగా వ్యవహరించి కార్యసఫలతను పొందుతారు. సొంతింటి నిర్మాణపనులు చేపడతారు. ముఖ్యవిషయాల్లో స్పష్టత వస్తుంది. సాధ్యమైనంత త్వరగా వాటిని పూర్తిచేస్తారు. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. బుద్ధిబలం అక్కరకు వస్తుంది. కొందరికి మేలు చేస్తారు. ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అపార్థం చేసుకునే సంఘటనలు ఎదురవుతాయి.
కుటుంబపరమైన అభివృద్ధి లభిస్తుంది. కుటుంబంలోని వ్యక్తులకు కలిసి వస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. విజ్ఞానపరంగా మంచి ఫలితాలను సాధిస్తారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు గొప్ప శుభఫలితాలున్నాయి. లక్ష్యం నెరవేరుతుంది. ఉద్యోగస్థులకు మేలు చేకూరుతుంది. వ్యాపారస్థులకు అదృష్టం పడుతుంది. మహిళలకు అనువైన కాలం. సౌభాగ్యం సిద్ధిస్తుంది. అవివాహితులకు వివాహయోగం ఉంటుంది. ఉల్లాసంగా కాలం గడుపుతారు. తోటివారి సహాయంతో
అభివృద్ధి దిశగా పయనిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. దైవబలం అధికమవుతుంది. శివారాధన శ్రేష్ఠమైన ఫలితాన్నిస్తుంది. ఉలవలు దానం చేస్తే ఆపదలు తొలగుతాయి. విష్ణు దర్శనం శాంతినిస్తుంది.ఈ రాశివారి అదృష్ట సంఖ్య 5, కలిసొచ్చే వారం - శుక్రవారం, రంగులు - తెలుపు, ఆకుపచ్చ. అదృష్ట దైవం లక్ష్మీదేవి.

విళంబి నామ సంవత్సరం రాశిఫలాలు వృషభం Taurus 2018 RESULTS

కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు
ఆదాయం: 11; వ్యయం: 5

రాజపూజ్యం: 1; అవమానం: 3
అదృష్టం వరిస్తుంది. విజయప్రదంగా కాలం మొదలవుతుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆలోచనలు చైతన్యవంతంగా ఉంటాయి. బుద్ధిబలంతో అధికారులను మెప్పిస్తారు. ప్రతిభ విశేషంగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. నూతన వస్తువులు కొంటారు. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో అభిప్రాయభేదాలు రాకుండా చూసుకోవాలి. ధనయోగం పుష్కలంగా ఉంది. నిరంతరం అభివృద్ధి దిశగా ఆలోచించాలి. మంచి పేరుప్రతిష్ఠలు సంపాదిస్తారు. ఆశయాలు శీఘ్రంగా


నెరవేరుతాయి. పట్టుదల మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. విందూ వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఖర్చులు అధికమవుతాయి. కీలక విషయాల్లో ముందుచూపుతో వ్యవహరించి పెద్దల మన్ననలు పొందుతారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. కొంతమంది సహకారంతో మంచి పనులు చేపడతారు. కొన్ని సమస్యలకు వెంటనే పరిష్కారం దొరుకుతుంది. సంతోషంగా కాలం గడుపుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. వ్యాపారపరంగా కొంత శ్రద్ధ వహించాలి. మోసపోయే అవకాశం ఉంది. అపార్థాలకు తావివ్వరాదు. ఆరోగ్యపరంగా మిశ్రమ కాలం. విద్యార్థులకు మంచి అవకాశాలున్నాయి. కానీ, బాగా శ్రద్ధ చూపాలి. మహిళలకు అనుకూల ఫలితాలున్నాయి. ఆధ్యాత్మికంగా కాలం కలిసి వస్తుంది. శివారాధన ఉత్తమ ఫలితాన్నిస్తుంది. నువ్వులు దానం చేస్తే మంచిది.
ఈ రాశివారి అదృష్ట సంఖ్య 6, కలిసొచ్చే వారం - బుధవారం, రంగులు - తెలుపు, ఆకుపచ్చ. అదృష్ట దైవం విష్ణుమూర్తి.

విళంబి నామ సంవత్సరం రాశిఫలాలు 2018. మేషం ..

అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
ఆదాయం: 2; వ్యయం: 14

రాజపూజ్యం: 5; అవమానం: 7
ఇష్టకార్యసిద్ధి ఉంది. ఆర్థికాంశాలు బాగా కలిసి వస్తాయి. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తవుతాయి. సమాజంలో ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది. ఉద్యోగపరంగా మంచి విజయాలు సాధిస్తారు, పదోన్నతులున్నాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేసి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. కీలక వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. అధికార పరిధి పెరుగుతుంది. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. న్యాయపరమైన అభివృద్ధి సూచితం. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆత్మీయులకు మేలు జరుగుతుంది. బుద్ధి బలంతో అందరినీ ఆకట్టుకుంటారు. సుఖశాంతులు నెలకొంటాయి. కుటుంబపరంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆటంకాలను అధిగమించి కార్యసాధనలో ముందడుగు వేస్తారు. ఆధ్యాత్మికంగా శుభ ఫలితాలు వస్తాయి. ఏదైనా శ్రద్ధతో ఆచరిస్తే ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారపరంగా అనేక లాభాలున్నాయి. క్రమంగా ధనాదాయం పెరుగుతుంది.



విద్యార్థులకు కలిసివచ్చే కాలమిది. ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఆశయం నెరవేరుతుంది. స్వల్ప ప్రయత్నంతోనే సంతృప్తికరమైన ఫలితాలు వస్తాయి. మహిళలకు అనుకూలమైన కాలం. అనేక రంగాల్లో వీరు సత్ఫలితాలను సాధిస్తారు. ఆరోగ్యపరంగా గతంలో కంటే మంచి ఫలితం ఉంటుంది. శుభయోగాలున్నాయి. రోజూ లక్ష్మీ ధ్యానం చేస్తే ఐశ్వర్యసిద్ధి కలుగుతుంది. మినుములు దానం చేస్తే శక్తి పెరుగుతుంది. రుద్రాభిషేకం వల్ల శాంతి లభిస్తుంది. రాజరాజేశ్వరీ దేవిని దర్శించాలి.
ఈ రాశివారి అదృష్ట సంఖ్య 9, కలిసొచ్చే వారం - ఆదివారం, రంగులు - ఎరుపు, గులాబీ. అదృష్ట దైవం సూర్యుడు.

జాతకరీత్యా రాశి శ్లోకం:


ఒక్క ఆధ్యాత్మిక అంశాల్లోనే కాదు వ్యాపార అభివృద్ధికైనా, ఆటలో గెలవాలన్నా, పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలన్నా, జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్నా అందుకు తగిన శ్లోకాన్ని పఠించాలనుకుంటాం. దాని గురించి చర్చిస్తాం. ఆదిశంకరాచార్యుల నుంచి స్వామీ వివేకానంద వరకూ శ్లోకాల గొప్పతనాన్ని వేనోళ్ల చాటినవారే. అయితే ఎన్నో వేల శ్లోకాల్లో జాతకరీత్యా  ఈ ఏడాది ఏ రాశివారు ఏ శ్లోకాన్ని జపించాలో క్లుప్తంగా...


జ్యోతిష సంప్రదాయంలోనూ హిందువుల దైనందిన ఆచారవ్యవహారాల్లోనూ నవగ్రహాలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. మానవుల స్థితిగతులు, భవిష్యత్తు తదితర వ్యవహారాల మీద వీటి ప్రభావం ఉంటుందనే విశ్వాసమే ఇందుకు కారణం. అందుకే నిత్య జీవితంలో విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం, ఇల్లు... ఇలా ఏ విషయంలోనైనా సమస్యలు ఎదురైనప్పుడూ లేదా జాతకరీత్యా ఆటంకాలు ఏర్పడతాయన్న సందేహం వచ్చినప్పుడూ ఆయా గ్రహాల అనుగ్రహం పొందడానికి సంబంధిత శ్లోకాలను పఠిస్తారు. జపాలూ, హోమాలూ మొదలైన క్రతువులను నిర్వహిస్తారు. అయితే ఈ విళంబినామ సంవత్సరంలో పన్నెండు రాశులవారు ఏ గ్రహానికి సంబంధించిన జపం చేయాలో, తద్వారా ఎలాంటి ఫలితాలు లభిస్తాయో తెలుసుకుందాం.

ఈ అయిదు రాశులకూ...
వృషభం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మకర రాశులవారికి ఈ సంవత్సరం శని ప్రభావం అధికంగా ఉండటం వల్ల ఈ రాశుల వారు శని శ్లోకాన్ని పఠిస్తే కొంత ఉపశమనం లభిస్తుంది. వృషభ రాశివారు ఈ శ్లోకాన్ని పఠించడం ద్వారా ఆరోగ్యం వృద్ధి చెందుతుంది, మనసు నిలకడగా ఉంటుంది. కన్యా రాశివారికి ఆర్థిక ఇబ్బందులు తొలగి, కుటుంబ సౌఖ్యం చేకూరుతుంది. వృశ్చికం, ధనుస్సు, మకర రాశులవారికి ఏలినాటి శని ప్రభావం తగ్గడంతోపాటు సంపద వృద్ధి చెంది, ఆటంకాలు తొలగుతాయి.
శ్లోకం: నీలాంజన సమాభాసం ।
      రవిపుత్రం యమాగ్రజం
      ఛాయామార్తాండ సంభూతం ।
      తం నమామి శనైశ్చరం ।।


 శక్తి కారకం...
మేష, మిథున, కర్కాటక, మీన రాశులవారు ఈ ఏడాది అంతా కుజ ధ్యానం చేయాలి. మేష రాశివారికి ఆర్థిక సమస్యలు, అపార్థాలకు తావులేకుండా ఉండేందుకు ఈ శ్లోకాన్ని పఠించాలి. మిథున రాశివారు ఈ శ్లోకాన్ని జపించడం వల్ల దాంపత్య విషయాల్లో గొడవలు సర్దుకోవడంతోపాటు సన్నిహితులతో సంబంధాలు మెరుగుపడతాయి. కర్కాటక రాశివారికి అదృష్టాన్నీ ధనాన్నీ పెంపొందించుకోవడానికి ఇది తోడ్పడుతుంది. కలహ నివృత్తికీ, అదృష్టప్రాప్తికీ కుజ శ్లోకం ఉపకరిస్తుంది.
శ్లోకం: ధరణీగర్భ సంభూతం ।
      విద్యుత్కాంతి సమప్రభమ్‌
      కుమారం శక్తిహస్తం ।
      తం మంగళం ప్రణమామ్యహం ।।

రాహు శ్లోకం...
సింహరాశిలో పుట్టిన వారు లేదా నామ నక్షత్రం ప్రకారం సింహరాశిలో ఉన్న వారూ ఈ సంవత్సరం మొత్తం రాహువుని ధ్యానిస్తే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఆకస్మికంగా ఎదురయ్యే ఇబ్బందులు లేదా ప్రమాదాల నుంచి రక్షణ పొందడంతోపాటు మనశ్శాంతిగా కాలం గడవడానికి ఈ శ్లోకం ఉపయోగపడుతుంది.
శ్లోకం: అర్ధకాయం మ


హావీరం ।
      చంద్రాదిత్య విమర్దనం
      సింహికాగర్భ సంభూతం ।
      తం రాహుం ప్రణమామ్యహం ।।

గురు కృప కోసం

 తులా రాశివారికి జన్మ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఈ రాశివారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలే లభిస్తాయి. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకాల్లోని బృహస్పతి శ్లోకాన్ని పఠిస్తే కొంత ఉపశమనం కలుగుతుంది. ఆర్థిక వృద్ధి, మనోబలం చేకూరడంతోపాటు ఎంచుకున్న రంగంలో ఉన్నతిని సాధించడానికి ఈ శ్లోకం కొంత తోడ్పడుతుంది.
శ్లోకం: దేవానాంచ రుషీనాంచ ।
      గురుంకాంచన సన్నిభం
      బుద్ధిమంతం త్రిలోకేశం ।
      తం నమామి బృహస్పతిం ।।

ఆరోగ్యం కోసం...
జాతక రీత్యా కుంభ రాశివారికి ఈ ఏడాది తిరుగులేని కాలం.  ఆయురారోగ్యం, ఐశ్వర్యం సిద్ధించడానికి ఈ ఏడాది రవి శ్లోకాన్ని పఠించాల్సి ఉంటుంది.
శ్లోకం: జపాకుసుమ సంకాశం ।
      కాశ్యపేయం మహాద్యుతిమ్‌
      తమోరిం సర్వపాపఘ్నం ।
      ప్రణతోస్మి దివాకరమ్‌ ।।







ఉగాది నూతన సంవత్సర శాస్త్ర విధి...

భారతదేశంలో కాలగణనకు మూడు మానాలు అనూచానంగా వస్తున్నాయి. చాంద్రమానం, సౌరమానం, బార్హస్పత్య మానం. ఈ మూడూ వేదాధారమైన ప్రాచీన జ్యోతిషశాస్త్ర ప్రమాణాలతో ఉన్నవే. కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కాలమానాలు ప్రమాణాలు. సౌర-చాంద్ర మానాల్లో సంవత్సర నామాలు మారవు. చంద్రుడి నక్షత్ర యోగాన్ని అనుసరించి చాంద్రమానం, సూర్య సంక్రమణాల ప్రకారం సౌరమానం, గురూదయాన్ని ఆధారంగా చేసుకొని బార్హస్పత్య మానం లెక్కిస్తారు. ఎవరి పరంపరాగతమైన, ప్రాంతానుసార మానాలు వారికి ప్రమాణాలు. ఇందులో వైరుధ్యాలేమీ లేవు.

లెక్కించే తీరుతెన్నుల్లో విభిన్నత్వం ఉన్నా- ఫలాల్లో, పంచాంగాల పద్ధతుల్లో పెద్దగా భేదమేదీ ఉండదు. ఈ సంవత్సరానికి ఉన్న పేర్లలో వేరువేరు వాదాలు ఉన్నాయి. వ్యవహారంలో అనేకమంది హేవళంబి, హేవిళంబి- అంటున్నారు. కొందరు హేమలంబ, హేమలంబి- అని వ్యవహరిస్తున్నారు. ఎవరి తీరు వారిదిగా నామం చెప్పవచ్చు. కానీ, ప్రాచీనమైన పలు గ్రంథాలు- జ్యోతిర్విదాభరణం, పంచాంగ పీఠికా లేఖన ప్రక్రియ, నిర్ణయ సింధు మొదలైనవి ‘హేమలంబ(బి)’ అని పేర్కొన్నాయి. దీన్ని ప్రమాణంగా భావించవచ్చు.

ఈ ఏడాది దృక్‌ సిద్ధాంత రీత్యా పంచాంగ గణన చేసేవారు 28వ తేదీ (మంగళవారం) ఉగాదిగా నిర్ణయిస్తే, పూర్వ పద్ధతి ప్రకారం 29వ తేదీ (బుధవారం)గా స్వీకరించారు. పంచాంగ గణిత భేదంతో వచ్చిన చిన్న తేడా ఇది. ఎవరి పద్ధతి వారు అనుసరించి ఉగాది చేసుకోవచ్చు.రెండు ఉగాదులు చేసుకొనేవారూ కొందరు ఉండవచ్చు. ఇది పెద్ద వివాదాంశం కాదు.

ఉగాదినాడు నూతన సంవత్సర ఆరంభాన్ని చక్కని శుభ భావనతో, కాలరూపుడైన భగవంతుడి ఆరాధనతో పవిత్రంగా ఆచరించడం భారతీయుల సంప్రదాయం. శాస్త్ర విధిని అనుసరించి- ముందురోజే శుభ్రం చేసుకున్న గృహాన్ని మామిడి తోరణాలు, రంగవల్లులు, పసుపు గుమ్మాలతో అలంకరించడం సంప్రదాయం. బ్రాహ్మీ ముహూర్తంలో అభ్యంగన స్నానం చేసి గణపతిని, ఇష్టదేవతను పూజించాలి. వాణీ హిరణ్యగర్బు ´(సరస్వతి, బ్రహ్మ)లు, లక్ష్మీ నారాయణులు, ఉమా మహేశ్వరులతో పాటు దిక్పాలకులను, నవగ్రహాలను యథాశక్తి అర్చించాలి. పంచాంగాన్ని పూజించి, పంచాంగ శ్రవణం చేయాలి.

తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు- అనే అయిదు అంగాలను జ్యోతిషశాస్త్ర రీత్యా గణించిన గ్రంథమే ‘పంచాంగం’. సంవత్సర ఆరంభంలో- గ్రహ, నక్షత్ర, వారాదులు అనుసరించి కాలాంశాల్ని తెలుసుకోవడమే పంచాంగ శ్రవణం. నిత్యం అనుష్ఠానం చేసుకొనేటప్పుడూ- దేశ, కాల సంకీర్తన అనే సంప్రదాయం ఉంది. ఆ సమయంలో మనం ఉన్న ప్రాంతం; అక్కడి నది, పర్వతాల ప్రస్తావన; దేశ సంకీర్తన; ఆనాటి తిథి, వార, నక్షత్రాది స్మరణ కాల సంకీర్తన ఉంటుంది. అనునిత్యం ఈ సంప్రదాయాన్ని పాటించడం వల్ల, ఆ రోజుకు సంబంధించిన కాలభాగాలు జ్ఞప్తిలో ఉంటాయి.

సంవత్సరం, పగలు, రాత్రి, పక్షం, మాసం, అయనం, యుగం, కల్పం... వీటన్నింటికీ పేర్లు, లక్షణాలు ఉన్నాయి. వీటి పరిజ్ఞానమే సంస్కృతి సంబంధ వారసత్వంగా భారతీయులందరి కర్తవ్యం. ఈ కర్తవ్య పాలనలో ఉగాది ఒక మధుర ఘట్టం. ఉ-గ- ‘ఉదు’ అంటే, నక్షత్రం. ‘గ’ అంటే, గమనం. నక్షత్ర గమన (చంద్రుడితో నక్షత్రానుబంధం) రీత్యా ఇది ఉగాది.

పంచాంగ శ్రవణ అనంతరం- ఉగాది పచ్చడిని నివేదించి, ప్రసాదంగా స్వీకరించడం విధి. నింబ కుసుమం (వేప పూత), మామిడి, బెల్లం- దీని ప్రధాన ద్రవ్యాలు అని శాస్త్రం చెబుతోంది. ఈ ప్రసాదాన్ని మొదటి యామం (జాము)లోనే (ఉదయం 8.30-9.00 గంటల మధ్య) గ్రహించాలంటారు. కాలం ఎటువంటివాటిని సూచిం చినా సంకల్ప బలం, సత్కర్మ ఆచరణ, సద్భావనతో సవరించుకోగలం అనే చక్కటి విషయాన్ని పలు ధార్మిక, జ్యోతిష గ్రంథాలు చెబుతున్నాయి.

అందుకే ఉత్సాహం, ఆశాభావం, దేశహిత కాంక్షతో నూతన వత్సరాన్ని స్వాగతిద్దాం. కాల స్వరూపుడైన పరమేశ్వరుడు అందరికీ శుభాలు ప్రసాదించుగాక అని ప్రార్థిద్దాం!

ఉగాది పుట్టిందిలా , పంచ అంగాలు..

ఉగాది నాడే బ్రహ్మ సృష్టిని ఆరంభించాడట. సకల చరాచర జీవరాశికీ మూల కారకుడైన బ్రహ్మ ఈ మహత్కార్యాన్ని ఆరంభించిన రోజుని అత్యంత వైభవోపేతంగా జరపాలన్న కాంక్షతోనే సరికొత్త అందాలను మోసుకొచ్చే వసంత మాసపు తొలి రోజునే ఉగాదిగా ఎంచుకున్నాడు. అందుకే ఆ పండగకు సర్వాంగ సుందరంగా ముస్తాబయిన ప్రకృతే వేదిక. మామిడి చిగురు తిన్న మత్తకోయిలల గానాలూ, సాయం సంధ్యల్లో మరు మల్లెల పరిమళాలూ, గిలిగింతలు పెట్టే వాసంత సమీరాలూ, వెండి వెన్నెలను కురిపించే చందమామ అందాలూ... అన్నీ ఈ పండగకు ప్రత్యేకతలే. అందమైన రేపటికి సంకేతాలే


‘ఎవరదీ... నువ్వేనా ఉగాదీ!
కొమ్మల్లో కోయిల కూస్తుంటే
మా పెరటి రెమ్మల్లో మల్లియ పూస్తుంటే
ఈ మధుమాసోదయ వేళ
ఉగాదీ నిన్ను పోల్చుకున్నానులే’’
అంటాడు ఓ కవి చమత్కారంగా... నిజమే ఉగాది ఆగమనం అంత అందంగానే ఉంటుంది. పండగంటే మనింటిని తోరణాలతో ముస్తాబు చేయటమే మనకు తెలుసు ఈ పండగకు మాత్రం అనంత ప్రకృతీ సన్నద్ధమైపోతుంది. అందమైన వసంతానికి స్వాగతం పలుకుతుంది.
అందుకే గీతలో శ్రీకృష్ణుడు ‘మాసానాం మార్గశీర్షోహం... ఋతూనాం కుసుమాకరః’ అంటాడు. అంటే మాసాల్లో మార్గశిరమూ, రుతువుల్లో వసంత రుతువూ తానేనని అర్థం. అంతటి మహత్యం ఉంది వసంత రుతువుకి. ప్రపంచంలో అత్యధికంగా పూలు వసంతంలోనే పూస్తాయట. ఎర్రటి ఎండాకాలంలో సుకుమారమైన మల్లెపూలు పూయడం, చుక్కనీరు లేని చోట రసాలు నిండిన మధుర ఫలాలు గుత్తులుగా విరగకాయడం ఈ మాసానికే సొంతమైన ప్రకృతి వింతలు. అలాంటి వింతలే కృష్ణుణ్ని సైతం కట్టిపడేశాయి. వసంతం అనే పదానికి ఏడాది అనే అర్థమూ ఉంది. ఒక్క

 తెలుగువారే కాదు చాంద్రమానాన్ని పాటించే తెలుగు, కన్నడ, మహారాష్ట్ర ప్రజలూ చైత్ర శుక్ల పాడ్యమిని నూతన సంవత్సరానికి తొలి దినంగా పరిగణిస్తారు. కృతయుగంలో కార్తీకశుద్ధ అష్టమినాడు ఉగాది జరుపుకునేవారట. త్రేతాయుగంలో వైశాఖశుద్ధ తదియ రోజు సంవత్సరాది పండగ వచ్చేది. దాన్నే మనం ఇప్పుడు అక్షయ తృతీయగా జరుపుకుంటున్నాం. ద్వాపరయుగం మొదలైంది మాఘ బహుళ అమావాస్య నాడు. అయితే అన్ని యుగాల ఆరంభమూ వసంత మాసంలోనే జరిగిందని చెబుతారు. ఆయా యుగాల్లో వసంతం ఆయా మాసాల్లో వచ్చేదట. మోడువారిన చెట్లు చిగురిస్తూ పచ్చని ప్రకృతి మనిషిని పరవశానికి గురిచేసే కాలం, ఏ యుగంలోనైనా కొత్త ఉగాదికి నాంది పలికేదిగానే ఉంటుంది మరి!

‘వసంతి సుఖం యథా తథా అస్మిన్నితి’ అంటారు. అంటే వసంతకాలంలో ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారని అర్థం. నిజానికి సాధారణ పండగల్లా ఉగాది ఏ దేవతకో సంబంధించిన పండగ కాదు. కాలాన్ని ఆరాధించే పండగ. నిరంతరమూ, నిత్యనూతనమూ అయిన కాలాన్ని కొలుచుకుని అనంత కాలగమనంలో మనమెక్కడ ఉన్నామో తెలుసుకుని మరొక్కసారి దేవుడు ఇచ్చిన కాలాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా మరల్చుకునే ప్రయత్నానికి నాంది పలికే పండగ.

ఉగాది పుట్టిందిలా...
ఉగాదిని తొలుత యుగాదిగా పిలిచేవారు. యుగస్య ఆదిః అని అర్థం. అంటే ఉత్తర దక్షిణ ఆయనాలు రెండూ కలిసిఉండే సంవత్సరానికి చైత్రశుద్ధ పాడ్యమే ఆది కనుక ఆ రోజును యుగాది అంటారు. యుగాది అంటే బ్రహ్మసృష్టిని ప్రారంభించిన రోజని అర్థం. కాలక్రమేణా అది ఉగాదిగా మారింది. బ్రహ్మ ఇప్పుడు ద్వితీయ పరార్ధంలో అంటే రెండో సగం జీవిత కాలంలో ఉన్నాడు. అందుకే ఏదైనా కార్యం చేయాలనుకున్నప్పుడు సంకల్పంలో కాలాన్ని ప్రస్తావిస్తూ ఆయన్ని గౌరవిస్తాం. అద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహకల్పే, వైవస్వత మన్వంతరే, అష్టావింశిన్‌ మహాయుగే, కలియుగే ప్రథమపాదే... అస్మిన్‌ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన విళంబి నామ సంవత్సరే చైత్ర మాసే, వసంత రుతౌ, శుక్లపక్షే, పాడ్యమ్యాం తిథౌ, భానువాసరే శుభ నక్షత్రే శుభయోగ శుభ కరణే... అని చెబుతాం. అంటే ఏ కార్యాన్ని మొదలు పెట్టాలనుకున్నా మనం సృష్టికర్త అయిన బ్రహ్మ మొదలు జరిగిన కాలాన్నంతా చెబుతూ మనం ఏడోదైన వైవస్వత మన్వంతరంలో 28వ మహాయుగమైన కలియుగంలో విళంబి నామ సంవత్సరంలో ఉన్నామంటూ వర్తమాన సమయం దాకా చెబుతాం. గడచిన అనంత కాలం మొదలు ఈ ఏడాది ఈ రోజు దాకా కాలాన్ని నిమిషాలతో సహా లెక్కగట్టి నిత్య పూజా విధానాల్లో, శుభాశుభ కార్యాల్లో తప్పనిసరిగా మననం చేసుకునే ఉత్కృష్టత మన జీవన శైలిలో భాగం. అదీ మన సంప్రదాయంలో కాలానికున్న ప్రాధాన్యత. ఉగాది అచ్చంగా ఆ కాలానికి ప్రతిరూపమైన పండగే. కృష్ణపరమాత్మ కురుక్షేత్ర సమయంలో విశ్వరూపధారణ చేసినప్పుడు ‘నేను కాలాన్ని... ఈ వ్యవస్థను విధ్వంసం చేస్తాను’ అని అంటాడు. అంటే ఇక్కడ కాలం విష్ణుస్వరూపమే. కానీ ఆ కాలస్వరూపుడు చెప్పిన విధ్వంసం వెనుక ఒక రహస్యం దాగి ఉంది. ఆ విధ్వంసం ఒక కొత్తసృష్టికీ, సరికొత్త వ్యవస్థ రూపకల్పనకూ పునాది అవుతుంది. ఏవైనా గడిచిన విషయాల గురించి చెప్పేటప్పుడు కాలగర్భంలో కలిసిపోవడం అనే పదాన్ని మనం అందుకే వాడతాం. పాతదాన్నంతటినీ తనలోకి లాక్కొనే కాలం నిరంతరం మనకు కొత్త సమయాన్నీ, కొత్త ఆశల్నీ అవకాశాల్నీ ఇస్తూనే ఉంటుంది.

ఇలా జరుపుకోవాలి...
ఏడాది తొలిరోజు ఎలా గడుస్తుందో అలాగే ఏడాదంతా గడుస్తుందని ప్రజల విశ్వాసం. అందుకే ఆ రోజుని సకల శుభప్రదంగా జరుపుకునేందుకు అంతా సన్నద్ధమవుతారు. ఆ పండగ రోజుని ఎలా జరుపుకోవాలి అనే దానికి శాస్త్రం ఒక క్రమ పద్ధతిని సూచించింది. ప్రాతఃకాలంలోనే లేచి పెద్దవాళ్లతో తలకు నువ్వుల నూనె పెట్టించుకుని వాళ్ల ఆశీర్వాదం తీసుకుని అభ్యంగన స్నానం చేయాలి. తలమీద నీళ్లు కుమ్మరించుకుంటూ
గంగేచ యమునేచైవ కృష్ణా గోదావరి సరస్వతీ
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్‌ సన్నిధిం కురు
అనే శ్లోకాన్ని జపించాలి. తైలాభ్యంగనం వల్ల ఆకలి, దప్పిక, మలిన నిర్మూలనాలు జరుగుతాయనీ, మహాలక్ష్మీ కృప లభించి దరిద్రం తొలగిపోతుందనీ చెబుతారు. ఆ రోజు కొత్త బట్టలు కట్టుకోవాలి. నూతన వస్త్రంలో సకల దేవతలూ నివాసముంటారని శాస్త్రం చెబుతోంది. కొత్త బట్టలు కట్టుకుని కుటుంబ సభ్యులూ, ఇష్టమైన వారి సాంగత్యంలో గడిపితే లలితా, లక్ష్మీ కటాక్షాలు లభిస్తాయట. దిష్టి పోయేందుకు ఇంటి ముందు గుమ్మడికాయను కట్టాలి. తర్వాత ఇష్టదేవతను ప్రార్థించి పరగడుపున ఉగాది పచ్చడిని స్వీకరించాలి. షడ్రుచుల సమ్మేళనమైన ఈ పచ్చడి గొప్ప ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందన్నది పురాణోక్తి. సర్వశుభప్రదమైన పంచాంగ శ్రవణాన్ని ఉగాది నాడు తప్పక వినాలి. అందులోనూ ఉత్తర ముఖంగా కూర్చుని పంచాంగశ్రవణం చేయడం వల్ల విశేషపుణ్య ఫలితాలు కలుగుతాయట.


 పంచాంగ శ్రవణం...
శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్స్వప్న దోషాపహం
గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం
ఆయుర్వ్యిద్ధిద ముత్తమం శుభకరం సంతానసంపత్ప్రదం
నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతామ్‌
పంచాంగం సిరిసంపదలను ప్రసాదిస్తుంది. దుస్స్వప్నాలను హరించడంతో పాటు గంగానదీ స్నాన ఫలితాన్నిస్తుంది. గోదానం చేసిన భాగ్యాన్నీ, ఆయురారోగ్యాలనూ, విద్యాబుద్ధులనూ, సత్సంతానాన్నీ ప్రసాదిస్తూ సకల విజయాలనూ సిద్ధింపజేస్తుంది. అందుకే పంచాగ శ్రవణం తప్పక చేయాలని చెబుతాయి శాస్త్ర గ్రంథాలు. ఉగాదినాడు చేసే పనుల్లో ఇదో ముఖ్య ఘట్టం. పంచాంగ శ్రవణ సమయంలో ఎన్నోసార్లు గ్రహాల పేర్లను పలుకుతారు. అందువల్ల ఆయా గ్రహాలు సంతోషిస్తాయి. ఫలితంగా పంచాగ శ్రవణం చేసిన వాళ్లకీ, విన్నవాళ్లకీ సూర్యుడివల్ల తేజస్సు, చంద్రుడివల్ల వైభవం, కుజుడి వల్ల సర్వమంగళం, బుధుడి వల్ల బుద్ధి వికాసం, గురుడి వల్ల జ్ఞానం, శుక్రుడి వల్ల సుఖం, శని వల్ల దుఃఖరాహిత్యం, రాహువు వల్ల ప్రాబల్యం, కేతువు వల్ల ప్రాధాన్యం కలుగుతాయని జ్యోతిషవాక్కు. పంచాంగ ప్రస్తావన వేదాలు మొదలు ఎన్నో శాస్త్ర గ్రంథాల్లో కనిపిస్తుంది. మన పంచాంగానికి మూలమైన కాల సిద్ధాంతాలున్న గ్రంథాన్ని క్రీ.శ.505లో వరాహమిహిరుడు ప్రతిపాదించాడు. మొత్తం 18 సిద్ధాంతాలుండగా అందులో ముఖ్యమైనవంటూ అయిదింటిని తన గ్రంథంలో ప్రస్తావించాడు. ఆ జ్యోతిష గ్రంథాన్ని ఉగాది నాడే ప్రజలకు అంకితం చేశాడట. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న పంచాంగాలను అందులోని పూర్వగణిత, దృగ్గణిత సిద్ధాంతాల ఆధారంగా రూపొందిస్తున్నారు.
 బ్రహ్మ మంత్రివర్గం
ఏడాదికి తొలిరోజుగా ఉగాదిని ప్రతిపాదించిన బ్రహ్మ ఆ సంవత్సరాన్ని ఎవరు పరిపాలించాలీ, ఏయే శాఖలకు ఎవరెవరు మంత్రులుగా ఆధిపత్యం చెలాయించాలీ అనే వ్యవహారాన్ని నవగ్రహాలకు అప్పగించాడు. దాని ప్రకారమే ఆయా శాఖల అధిపతుల స్వభావాన్ని బట్టి ఆ ఏడాది వారు ఆధిపత్యం వహించే అంశం ఎలా ఉంటుంది అనేది నిర్ణయమౌతుంది. ఈ ఏడాది ఎంత వర్షం కురుస్తుందీ, ఏయే పంటలు బాగా పండుతాయీ, ధరలెలా ఉండబోతున్నాయీలాంటి అంశాలన్నీ ఈ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటాయి. ఈ మంత్రివర్గంలో మొత్తం నవనాయకులుంటారు. వాళ్లను ఎలా నిర్ణయిస్తారంటే...
1. చాంద్రమానాన్ని అనుసరించి ఏ వారం ఉగాది వచ్చిందో ఆ వారాధిపతి ఆ సంవత్సరానికి రాజు
2. సౌరమాన సంవత్సరం ప్రారంభమైన రోజు ఏ వారం వస్తే ఆ వారాధిపతి మంత్రి
3. సూర్యుడు సింహరాశిలో ప్రవేశించే సమయంలో ఉన్న వారాధిపతి ఆ సంవత్సరానికి సేనా నాయకుడు
4. సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించేటప్పుడు వారానికి అధిపతి సస్యాధిపతి
5. సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించే సమయంలో ఉన్న వారానికి అధిపతి ఆ సంవత్సరానికి ధాన్యాధిపతి
6. సూర్యుడు మిథున రాశిలో ప్రవేశించేనాటి వారాధిపతి అర్ఘాధిపతి (ధరలకు వాణిజ్యానికీ అధిపతి)
7. సూర్యుడు ఆరుద్రా నక్షత్రంలో ప్రవేశించేనాటి వారానికి అధిపతి మేఘాధిపతి
8. సూర్యుడు తులారాశిలో ప్రవేశించే రోజుకి వారాధిపతి రసాధిపతి
9. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజున ఉన్న వారాధిపతి నీరసాధిపతి ఈ ఏడాది నవనాయక ఫలితాలు

రాజు రవి: సూర్యుడు రాజు అయినందు వల్ల పాలకుల మధ్య పరస్పర వైరం కలుగుతుంది. వర్షాలు సమంగా పడతాయి. రాజు వల్ల ప్రజలకు భయం ఏర్పడుతుంది. శస్త్ర, చోర, అగ్ని బాధలు అధికమవుతాయి.
మంత్రి శని: శని మంత్రి అవడం వల్ల  వానలు తక్కువగా కురుస్తాయి. పంటలు తక్కువగా పండుతాయి. ప్రజలు దరిద్రాన్ని పొందుతారు. మొత్తంగా ప్రజలకు కష్టకాలం.
సేనాధిపతి శుక్రుడు: శుక్రుడు సేనాధిపతి కావడంతో స్త్రీ పురుషులు పరస్పరం అన్యోన్య అనురాగాలతో ఉంటారు. వానలు తక్కువగా కురుస్తాయి. ధరలు అధికమవుతాయి.
సస్యాధిపతి చంద్రుడు: చంద్రుడు సస్యాధిపతి అవడం వల్ల నీటి పంటలూ, మెట్ట పంటలూ సమృద్ధిగా పండుతాయి. పచ్చదనం బాగుంటుంది.
ధాన్యాధిపతి రవి: ధాన్యాధిపతి రవి అవటం వల్ల వర్షాలు మధ్యస్తంగా పడతాయి. పంటలు తక్కువగా పండుతాయి. ధరలు తగ్గుతాయి. ఎరుపు రంగు ధాన్యం సమృద్ధిగా పండుతుంది.
అర్ఘ అధిపతి శుక్రుడు: ధాన్యాల ధరలు బాగా పెరుగుతాయి. శుక్రుడు అధిపతి అయినందున తెల్లని ధాన్యాలు బాగా పండుతాయి. దేశం, ప్రజలు క్షేమంగా ఉంటారు.
మేఘాధిపతి శుక్రుడు: మేఘాధిపతి కూడా శుక్రుడే అవడం కారణంగా వానలు అధికంగా కురుస్తాయి. పంటలు బాగా పండుతాయి. ప్రజలు రోగబాధలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. గోవులు బాగా పాలిస్తాయి.
రసాధిపతి బుధుడు: సుగంధ ద్రవ్యాలు, బెల్లం తదితర వస్తువుల ధరలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి.
నీరసాధిపతి చంద్రుడు: బంగారం, ముత్యం, కంచు, వస్త్రాలు, నగలు తదితరాల ధరలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి.
మొత్తంగా చెప్పాలంటే, విళంబి నామ సంవత్సరంలో వర్షాలు మరీ ఎక్కువా మరీ తక్కువా కాకుండా సమంగా కురుస్తాయి. ధరలు అందుబాటులో ఉంటాయి. జనానికి శత్రువుల వల్ల ఇబ్బందులు కలగడంతో పాటు అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ప్రజా సమస్యలు పెరుగుతాయి. చోరభయం ఉంటుంది. కాబట్టి ప్రజలు దైవారాధన చేయడం ద్వారా శాంతిని పొందొచ్చు.

ఈ ఏడాది తెలుగు ప్రజలకు...
శ్రీ విళంబి నామ సంవత్సరంలో వర్ష లగ్నాధిపతి అయిన బుధుడు కేంద్ర స్థానంలో ఉండి శుభయోగాన్నిస్తున్న్లాడు. ఉచ్ఛగ్రహంతో కలిసి ఉన్నందున ప్రజలకు మేలు జరుగుతుంది. జనం సుఖశాంతులతో సంతోషంగా ఉంటారు. ధన భాగ్యాధిపతి అయిన శుక్రుడు కేంద్ర భావంలో ఉచ్ఛస్థితిలో ఉండటం వల్ల సౌభాగ్యం, ఆర్థికవృద్ధి విశేషంగా ఉంటాయి. ప్రధానంగా మహిళలకు శుభఫలితాలు సిద్ధిస్తాయి. ప్రజలు ఆనందంగా వారివారి పనుల్లో నిమగ్నమవుతారు. శుక్రగ్రహం భాగ్యాధిపత్యం వల్ల అదృష్టఫలాలు ప్రజలకు అందుతాయి. ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. చంద్రుడు లాభాధిపతి అయినందువల్ల మనశ్శాంతి, ప్రశాంత జీవితం లభిస్తాయి. మనోబలం పూర్తిగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. గురుగ్రహం వాక్‌ స్థానంలో ఉండటంతో రాష్ట్ర ప్రజలు మంచి విద్యాయోగాన్ని పొందుతారు. జ్ఞానమార్గంలో ధర్మబద్ధంగా వ్యవహరిస్తారు. చక్కటి ఆలోచనా విధానంతో బుద్ధిబలంతో విజ్ఞానాన్ని ఆర్జిస్తారు. సప్తమ కేంద్రస్థిత సూర్య సంచారం వల్ల ప్రజలు రోగాలు లేనివారై ఆరోగ్యకరమైన జీవనాన్ని కొనసాగిస్తారు. కేతువు పంచమకోణంలో ఉండటం వల్ల ఆధ్యాత్మిక పురోగతి బాగుంటుంది. లాభ రాహువు వల్ల సాంకేతికపరంగా అభివృద్ధి చెందుతారు. చతుర్థ కేంద్రంలో శని, కుజుల వల్ల స్వల్ప అశాంతి నెలకొంటుంది. అధిక గ్రహాలు శుభ స్థానాల్లో ఉండటం వల్ల ప్రజలు సంపూర్ణ శుభఫలితాలను అనుభవిస్తారు.
 విళంబిలో దేశస్థితిగతులు...
ఈ ఏడాదికి జగల్లగ్నం (జగత్‌ లగ్నం అంటే దేశఫల లగ్నం) వృషభలగ్నం అయింది. దాని అధిపతి శుక్రుడు ద్వాదశ భావంలో ఉన్నాడు. ఇదంత మంచి ఫలితాన్నివ్వదు. రవి శుక్రులిద్దరూ 12వ స్థానంలో ఉండటం వల్ల పాలకుల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశముంది. బుధుడు, ధన పంచమాధిపతియై లాభంలో ఉండటం  వల్ల దేశానికీ, రాష్ట్రాలకూ సంపూర్ణ ధనయోగం ఉంటుంది. శని కుజులు ధనుస్సులో ఉండటంతో భయాందోళనలు కలుగుతాయి. కొన్ని సందర్భాల్లో యుద్ధ వాతావరణం కనపడుతుంది. సున్నితమైన అంశాల్లో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడవచ్చు. ప్రజలూ పాలకులూ సమన్వయంతో ఆలోచించాల్సిన అవసరముంది. గురుగ్రహం షష్ఠంలో ఉన్నందువల్ల మరింత చెడు ఫలితాలు సూచితమవుతున్నాయి. ప్రజలు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పాలనలో ప్రతిష్ఠంభన ఏర్పడుతుంది. ప్రజలు వెన్నుదన్నుగా నిలిస్తే తప్ప పాలకులకు కష్టకాలమే. రాహుకేతువుల ఫలితాలు కొంతవరకూ మేలు కల్గిస్తాయి. మొత్తం మీద జగత్‌ లగ్నస్థితి ఏ మాత్రమూ అనుకూలంగా లేదు. దేశవ్యాప్తంగా ప్రజలు అభివృద్ధిని సాధించాలంటే బాగా కష్టపడాలి. ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపాలి. సమష్టి కృషి వల్ల ఆపదలను అధిగమించవచ్చు. ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు బలపడాలంటే ఆయా అంశాల మీద పాలకులు ప్రత్యేక దృష్టి సారించాలి. అప్పుడే వైజ్ఞానికంగా, ఆర్థికంగా భారతదేశం సమగ్రంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది.

పంచాంగ శ్రవణం మహా పుణ్యదాయకమైన విషయమే అయినా ఇందులో జీవన వికాస పాఠం కూడా నిగూఢంగా దాగి ఉంటుంది. ఏడాది తొలిరోజే ఆదాయ వ్యయాలూ, అవమాన రాజపూజ్యాలూ తెలుసుకోవడం ద్వారా మనిషి రాబోయే కష్టసుఖాలన్నింటికీ మానసికంగా సన్నద్ధమవుతాడు.
ఏ కొత్త బాధ్యతో మీద పడితే ‘ఆ రోజు చెప్పిన భారం ఇదేనన్నమాట’ అని సరిపెట్టుకుంటాడు. ఏ అనుకోని ఆపదో ఎదురైతే ‘గ్రహగతి మారుతుందని ముందే తెలిసిందేగా’ అని సర్దుకుంటాడు. చివరికి అనని మాటలు అన్నారన్నా, లేనిపోని వ్యవహారాల్లో ఇరుక్కున్నా ‘నీలాపనిందలు ఊహించినవేగా’ అని ఊరుకుంటాడు.

ఏ ఉన్నతాధికారో నలుగురి ముందూ అక్షింతలేస్తే ‘అవమానాలు అధికమని అనుకున్నదేగా’ అని మిన్నకుండిపోతాడు. సుఖసంతోషాలుంటాయి అన్న పంచాంగ వాక్యానికి పొంగిపోయి ‘ఈ ఏడాది నాకు ఇవీ ఉన్నాయన్నమాట’ అని నిండు మనసుతో ముందుకెళతాడు. మనిషి ధైర్యంతో కొత్త ఆశలతో ముందడుగు వేయడానికి ఏడాది తొలినాడు ఈ మాత్రం ఉత్సాహం చాలు. నిజానికి షడ్రుచులతో పంచే ఉగాది పచ్చడి ఆంతర్యమూ అదే. నాకు బెల్లమ్ముక్కలే కావాలంటే కుదరదు, అరటి పండొక్కటే తింటానంటే వీలు పడదు. వేప చేదునూ, మామిడి వగరునూ రుచి చూడాల్సిందే. చింతపండు పుల్లదనాన్నీ, మిరియాల ఘాటునీ అనుభవించాల్సిందే. అప్పుడే జయాపజయాల్నీ, లాభనష్టాల్నీ సమదృష్టితో చూసే మనోధైర్యం ఏర్పడేది. జీవితంలో ఎదురయ్యే ఎత్తుపల్లాల్నీ, ఊహించని మలుపుల్నీ సులువుగా దాట గలిగే సత్తా వచ్చేది. ఉగాది పండగ నుంచి మనం నేర్చుకోవాల్సిందీ, ఆ రోజు నుంచి స్ఫూర్తి పొందాల్సిందీ ఈ కోణంలోనే.

 బ్రహ్మ సృష్టి ఆరంభమై ఇప్పటికి 195 కోట్ల 58 లక్షల 85 వేల 118 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు వచ్చిన విళంబి నామ సంవత్సరం 119వది. కలియుగం ప్రారంభమై ఈ ఉగాదికి 5119 సంవత్సరాలు. శ్రీమహావిష్ణువు మత్య్సావతారంలో సోమకాసురుణ్ణి సంహరించి, వేదాలను కాపాడి బ్రహ్మదేవుడికి అప్పగించింది ఉగాది నాడేనట. కలియుగం ప్రారంభమైందీ, శ్రీరామ పట్టాభిషేకం జరిగిందీ, కురుక్షేత్రం తర్వాత ధర్మరాజు పీఠాన్నెక్కిందీ, వెయ్యేళ్లపాటు పాలన సాగించిన విక్రమార్కుడు సింహాసనాన్ని అధిష్ఠించిందీ, శాలివాహనుడు కిరీట ధారణ చేసిందీ ఈ పర్వదినానే. అందుకే ఉగాదినాడు పనులు మొదలు పెడితే అందులో తిరుగుండదనేది చాలా మంది నమ్మకం. ఈ కారణంగానే కొన్ని చోట్ల రైతులు కొత్త నాగళ్లకు పూజ చేసి, లాంఛనంగా వ్యవసాయ పనుల్నీ ప్రారంభిస్తారు. ఉగాది రోజు ఇంటి ముందో, వీధిలోనో చలివేంద్రాన్ని స్థాపిస్తే గొప్ప పుణ్యఫలం లభిస్తుంది. శుభ్రమైన చోట అలికి ముగ్గుపెట్టి కొత్త కుండల్లో నీరు నింపాలి. గణపతినీ ఇష్టదేవతలనూ ధ్యానించి కొబ్బరికాయ కొట్టి చలివేంద్రాన్ని ప్రారంభించాలి. ఈ రోజు చల్లటి మజ్జిగనో లేక పానకాన్నో అతిథులకూ బాటసారులకూ ఇచ్చినా పుణ్యమని పురాణవాక్కు. ఈ రోజు కొందరు పితృదేవతల్ని గుర్తు చేసుకుంటూ తర్పణాలూ వదులుతారు.

 పంచాంగం అంటే అయిదు విభాగాలు అని అర్థం. అవి తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు. తిథులు పదిహేనూ, వారాలు ఏడూ, అశ్వని మొదలు రేవతి వరకూ 27 నక్షత్రాలూ, విష్కంభం మొదలు వైధృతి వరకూ 27 యోగాలూ, బవ మొదలు కింస్తుఘ్నం వరకూ 11 కరణాలన్నింటిని గురించి తెలియజేసేదే పంచాంగం. ముహూర్తబలం కోసం ఈ అయిదింటినీ పరిగణనలోకి తీసుకుంటారు. ప్రాచీన భారతీయుల ఖగోళ విజ్ఞానమే నేటి పంచాంగానికి పునాది అన్నది చరిత్రకారుల విశ్లేషణ. మనకి తెలిసిన ఖగోళ శాస్త్రం ఆధారంగా ఏ గ్రహాలు ఏ రాశిలో సంచరిస్తున్నాయో లెక్కవేసి, వాటి ప్రకారం ఫలితాలను అంచనా వేయడమే పంచాంగం. తిథి విషయంలో జాగ్రత్తపడితే సంపద, వారం వల్ల ఆయుష్షు, నక్షత్రం వల్ల పాప పరిహారం, యోగం వల్ల ఆరోగ్యం, కరణం వల్ల విజయం ప్రాప్తిస్తాయని అంటారు