Thursday, 1 December 2016

కాశీ విశ్వనాథ అష్టకం !

1) గంగా తరంగ రమనీయ జఠా కలాపం
గౌరీ నిరంతర విభూషిత వామభాగం
నారాయణ ప్రియమనంగ మదాపహారం!
వారాణశీ పురపతిం భజ విశ్వనాథం.


2)వాచామ గోచర మనీక గుణ స్వరూపం
వాగీష విష్ణు శురసేవిత పాద పీఠం
వామెన విగ్రహ వరేణ కళత్ర వంతం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథం.


3)భూతాధిపం భుజంగ భూషణ భూషితాంగం
వ్యాఘ్ర జినాం బరధరం జఠిలం త్రినేత్రం
పాషాన్‌కుషా భయ వరప్రద శూలపాణిం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథం.


4)సీతాం శుశోభిత కిరీట విరాజ మానం
పాలేక్షణా నల విషోశిత పంచబాణం
నాగాధిపా రచిత భాసుర కర్ణ పూరం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథం.




5)పంచాననం దురిత మత్త మతంగ జాణా
నాగాంతకం దనుజ పుంగవ పన్నగానాం
దావానలం మరణ శోక జరాట వీణా
వారాణశీ పురపతిం భజ విశ్వనాథం.


6)తేజోమయం సగుణ నిర్గుణం అద్వితీయం
ఆనంద కందం-అపరాజితం అప్రమేయం
నాగాత్మకం సకల నిష్కలం-ఆత్మరూపం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథం.


7)రాగాది దోష రహితం స్వజనాను రాగం
వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం
మాధుర్య ధైర్య శుభగం గరళా భిరామం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథం.



8)ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం
పాపేరతిం చ సునివార్య మనస్సమాధౌ
ఆదాయ హ్రుద్కమల మధ్యగతం పరేశం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథం.


వారాణాశీ పురపతే స్తవనం శివస్య
వ్యాఖ్యాతం అష్టకమిదం పఠతే మనుష్య విద్యాం
ష్రియం విపుల సౌఖ్యం-అనంత కీర్తిం
సంప్రాప్య దేహవిలయే లభతే చ మోక్షం.
విశ్వనాథాష్టకం ఇదం పుణ్యం యః పఠేత్
శివ సన్నిధౌ
శివ లోక మవాప్నోతి శివేన సహ మోదతే.

ఆది శంకరాచార్య కృత నిర్వాణ షట్కము

జగద్గురువు ఆది శంకరాచార్యుల వారు ఒకసారి హిమాలయ ప్రాంతంలో సరియైన గురువు కోసం అన్వేషిస్తుండగా ఒక సన్యాసి ఎదురొచ్చి, "నువ్వు ఎవరివి?" అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా శ్రీ ఆది శంకరులవారు మొత్తం అద్వైత వేదాంతాన్ని ఆరు శ్లోకాల రూపంలో "నిర్వాణ షట్కము" గా పలికారట. ఇది తను (అహం) అనుకునే ఆత్మ వివరణ కనుక దీనినే "ఆత్మ షట్కము" అని కూడా అంటారు. నిర్వాణం అంటే సంపూర్ణ సమదృష్టి, ప్రశాంతత, స్వేచ్చ, ఆనందము (సత్+చిత్+ఆనందం = సచ్చిదానందం) మిళితమైన ఒక అచేతన స్థితి. అదే సచ్చిదానందం.



శివోహమ్ శివోహమ్ శివోహమ్
మనో బుద్ధ్యహంకార చిత్తాని నాహమ్
న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే
న చ వ్యోమ భూమిర్ న తేజో న వాయుః
చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ 
శివోహమ్ శివోహమ్ శివోహమ్



న చ ప్రాణ సంజ్ఞో న వై పంచ వాయుః
న వా సప్త ధాతుర్ న వా పంచ కోశః
న వాక్ పాణి పాదం న చోపస్థ పాయు
చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ 
శివోహమ్ శివోహమ్ శివోహమ్



న మే ద్వేష రాగౌ న మే లోభ మోహౌ
మదో నైవ మే నైవ మాత్సర్య భావః
న ధర్మో న చార్థో న కామో న మోక్షః
చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ 
శివోహమ్ శివోహమ్ శివోహమ్



న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఖఃమ్ 
న మంత్రో న తీర్థ న వేదా న యజ్ఞః 
అహమ్ భోజనమ్ నైవ భొజ్యమ్ న భోక్త
చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ 
శివోహమ్ శివోహమ్ శివోహమ్



న మే మృత్యు శంకా న మే జాతి భేదః
పితా నైవ మే నైవ మాతా న జన్మః
న బంధుర్ న మిత్రం గురుర్ నైవ శిష్యః
చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ 
శివోహమ్ శివోహమ్ శివోహమ్



అహం నిర్వికల్పో నిరాకార రూపో
విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణాం
న చాసంగత నైవ ముక్తిర్ న మేయః
చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ 
శివోహమ్ శివోహమ్ శివోహమ్

శ్రీ రాజరాజేశ్వరీ స్తోత్రం

శ్లో || అంబాశాంభవి చంద్రమౌళి రబలా పర్ణా ఉమాపార్వతీ
కాళీ హైమావతీ శివాత్రిణయనీ కాత్యాయనీ భైరవీ
సావిత్రీ నవయౌవనీ శుభకరీ సామ్రాజ్య లక్ష్మీప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ ||



శ్లో || అంబామోహినిదేవతా త్రిభువనీ ఆనంద సంధాయినీ
వాణీ పల్లవపాణి వేణు మురళీ గాన ప్రియలోలినీ
కళ్యాణీ ఉడురాజ బింబవదనా ధూమ్రాక్ష సంహారిణీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ ||



శ్లో || అంబానూపుర రత్నకంకణధరీ కేయూర హారావళీ
జాజీచంపక వైజయంతి లహరీ గ్రైవేయ వైరాజితా
వీణావేణు వినోద మండితకరా వీరాసనే సంస్థితా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ ||



శ్లో || అంబా రౌద్రిణి భద్రకాళి బగళా జ్వాలాముఖీ వైష్ణవీ
బ్రహ్మణీ త్రిపురాంతకీ సురనుతా దేదీప్యమానోజ్జ్వలా
చాముండీ శ్రిత పోషజననీ దాక్షాయణీ పల్లవీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ ||



శ్లో || అంబా శూలధనుః కశాంకుధరీ అర్ధేందు బిబాధరీ
వారాహీ మధుకైటభ ప్రశమనీ వాణీరమా సేవితా
మల్లాద్యాసుర మూక దైత్యదమ్నీ మహేశ్వరీ అంబికా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ ||




శ్లో || అంబా సృష్టివినాశ పాలనకరీ ఆర్యా విసంశోభితా
గాయత్రీ ప్రణవాక్ష రామృతరసః పూర్ణానుసంధీకృతా
ఓమ్కారాదినుతా సురార్చిత పదా ఉద్దండ దైత్యాపహా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ ||



శ్లో || అంబా శాంకరి ఆగమాదివినుతా ఆర్యామహాదేవతా
యాబ్రహ్మాదిపిపేవికాంత జననీ యావై జగన్మోహినీ
య పంచ ప్రణవాది రేఫజననీ యాచిత్కళా మాలినీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ ||



శ్లో || అంబ పాలిత భక్త రాజిరనిశం అంబాష్టకం యఃపటేత్
అంబాలోక కటాక్ష వీక్షలతా ఐశ్వర్య సమృద్దితా
అంబోపాసన మంత్ర రాజపఠ నాదంత్యే చ మోక్ష ప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ ||

శ్రీ కాత్యాయనీ సప్తశ్లోకీస్తుతి :

కరోపాంతే కాంతే వితరణ వంతే విదధతీం 
నవాం వీణాం శోణామభిరుచిభరేణాంకవదనామ్,
సదావందే మందేతరమతిరహం దేశికవశా
త్కృపాలంబామంబాంకుసుమిత కదంబాంకణగృహామ్


వశిప్రఖ్యం ముఖ్యం కృతకమలసఖ్యం తవముఖం
సుధావాసం హాసం స్మితరుచిభిరాసన్నకుముదమ్,
కృపాపాత్రే నేత్రే దురుతకరితో త్రేచ నమతాం
సదా లోకే లోకేశ్వరి విగతశోకేన మనసా


అపి వ్యాధా వాధావసి సమాధాయ హృది తా
మనౌపమ్యాం రమ్యాం మునిభి రవగమ్యాం తవ కలామ్,
నిజామాద్యాం విద్యాం నియతమవద్యాం న కలయే 
స మాతంగీమంగీకృతసరసంగీతరసికామ్


స్ఫురద్రూపానీపావనిరుహసమీపాశ్రయపరా
సుధాధారధారధరురుచిరుదారా కరుణయా,
స్తుతిప్రీతా గీతామునిభిరుసపనీతా తవ కలా
త్రయీసీమా సా మా మవతు సురసామాజికమతా


తులాకోటీకోటీ కిరణపరిపాటీ దినకరం
నఖచ్ఛాయామాయా శశినళిన దాయాదవిభవమ్,
పదం సేవే భావే తవ విపదభావే విలసితం 
జగన్మాతః ప్రాతః కమలముఖ నాతః పరతరమ్


కనత్ఫాలాం బాలాం లలిత శుకలీలాంబుజకరాం
లసద్ధారాదారాం కచవిజితధారధరరుచిమ్,
రమేంద్రాణీవాణీ లసదసిత వేణీసుమపదాం
మహత్సీమాం శ్యామామరుణగిరివామాం భజ మతే


గజారణ్యే పుణ్యే శ్రితజన శరణ్యే భగవతీ 
జపావర్ణాపరాం తరళతరాకర్ణాంతనయనా,
అనాద్యంతా శాంతా బుధజనసుసంతానలతికా
జగన్మాతా పూతా తుహినగిరిజాతా విజయతే


ఫలశ్రుతి
గౌర్యాసప్తస్తుతిం నిత్యం ప్రభాతే నియతః పఠేత్
తస్య సర్వాణి సిద్ధ్యన్తి వాంచితాని న సంశయః
౧. దేవదేవ జగతాంపతే విభో భర్గ భీమ భవ చంద్రభూషణ!
భూతనాథ భవభీతిహార్క నతోస్మి నతవాంఛితప్రద!!

౨. చంద్రచూడ మృడ దూర్జటే హరత్ర్యక్ష దక్ష శత తంతుశాతన!
శాంత శాశ్వత శివాపతే శివ త్వాం నతోస్మి నతవాంఛిత ప్రద!!

౩. నీలలోహిత సమీహితార్థద ద్వ్యేకలోచన విరూపలోచన!
వ్యోమకేశ పశుపాశనాశన త్వాం నతోస్మి నతవాంఛిత ప్రద!!

౪. వామదేవ శితికంఠ శూలభ్రుత్ చంద్రశేఖర ఫణీంద్రభూషణ!
కామకృత్ పశుపతే మహేశ్వర త్వాం నతోస్మి నతవాంఛిత ప్రద!!

౫. త్ర్యంబక త్రిపురసూదనేశ్వర త్రాణకృత్ త్రినయన త్రయీమయ!
కాలకూటదళనాంతకాంతక త్వాం నతోస్మి నతవాంఛిత ప్రద!!

౬. శర్వరీ రహిత శర్వ సర్వగ స్వర్గమార్గ సుఖదాపవర్గద!
అంధకాసుర రిపో కపర్ద భ్రుత్ త్వాం నతోస్మి నతవాంఛిత ప్రద!!

౭. శంకరోగ్ర గిరిజాపతే పతే విశ్వనాథ విధి విష్ణు సంస్తుత!
వేదవేద్య విదితాఖిలేంగిత త్వాం నతోస్మి నతవాంఛిత ప్రద!!

౮. విశ్వరూప పరరూపవర్జిత బ్రహ్మ జిహ్మరహితామృత ప్రద!
వాజ్ఞ్మనో విషయ దూర దూరగ త్వాం నతోస్మి నతవాంఛిత ప్రద!!


ఈ స్తోత్రం పఠించుటవలన సర్వపాతకములు నశించును. పుణ్యము ప్రాప్తమగును. ఉత్తమ నరుడు దూరదేశాంతరము నందుండి పరిశుద్ధమగు మనస్సుతో నిత్యము త్రిసంధ్యలందు జపించుట వలన దైనందిన పాపములు నిస్సందేహముగా నశించును. పుత్రపౌత్రాది బహు సంపదలు పొందగలరు. ఈ స్తోత్రము కాశియందు మోక్షలక్ష్మిని అనుగ్రహించును. మోక్ష కాముకులు ప్రయత్నపూర్వకముగా ఈ స్తోత్రమును చదువవలెను.

Wednesday, 30 November 2016

భారత నల్లధనానికి దుబాయి బంగారంతో లింకు

పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన భారతతోపాటు విదేశాల్లోనూ సంచలనం సృష్టించింది. ఓవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల వేడితో డాలర్‌ విలువ గంట గంటకూ మారుతుండగా..


ఇదే సమయంలో రూ.1000, రూ.500 నోట్ల రద్దు ప్రకటన లక్షలాది ప్రవాసీయులకు, వారి కుటుంబాలకు షాకిచ్చింది. భారతీయ నల్లధనానికి ప్రధాన మూలంగా ఉన్న బంగారం మొత్తం.. గల్ఫ్‌ దేశాల నుంచే వస్తుండగా వారికి కూడా ఈ ప్రకటన పిడుగుపాటుగా మారింది.


ఇక గల్ఫ్‌ దేశాలన్నింటిలోనూ అధికారికంగా మనీ ఎక్స్చేంజీలు ఉండగా.. అందులో స్ధానిక కరెన్సీతోపాటు డాలర్‌, యూరో, భారతీయ నోట్లను అత్యధికంగా విక్రయిస్తుంటారు. ఆయా కరెన్సీల నగదు కట్టలను వీరు తమవద్ద నిల్వ ఉంచుకొంటారు. భారత నుంచి నోట్లను పంపించడంపై నిషేధమున్నా.


. విదేశాల్లో కావల్సినంత భారతీయ కరెన్సీ లభ్యమవుతుంది. గల్ఫ్‌ దేశాల నుంచి నకిలీ నోట్లను కూడా భారత్‌కు పంపించిన సంఘటనలున్నాయి. అయితే భారత ప్రభుత్వ సంచలన నిర్ణయంతో మనీ ఎక్స్చేంజీల వద్ద నిల్వ ఉన్న భారతీయ కరెన్సీ పూర్తిగా వృధా అయిపోనుంది



 అధికారికంగా వీరు మార్పిడి చేసుకొనే అవకాశం ఉండదు. అంతేకాదు.. గల్ఫ్‌ దేశాల ప్రవాసీయులకు చెందిన అనేక మధ్య తరగతి కుటుంబాలు కూడా ఇళ్లలో కొంత మొత్తం నగదును ఉంచుకొంటుండగా దానిని ఇప్పుడు నూతన నోట్లలో మార్పిడి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.




విదేశాల్లోని ప్రవాసీయులు పంపించే డబ్బును పంపిణీ చేయడానికి తెలుగు రాష్ర్టాల్లోని పల్లె గ్రామాల్లో సైతం ఉన్న మనీ ట్రాన్స్‌ఫర్‌ కేంద్రాల నిర్వహకులు కూడా నూతన నోట్ల మార్పిడి పూర్తయ్యేదాకా సందిగ్ధంలో పడిపోనున్నారు.




घोषणा के प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा की गई विदेशों में काफी हलचल पैदा bharatatopatu रद्द करने के लिए नोट्स। Gantaku घंटे डॉलर .. के बदलते मूल्य के तहत राष्ट्रपति पद के चुनाव में हिस्सा लेने के लिए एक ही समय में, 1000 रुपये, 500 रुपये के नोटों आप्रवासियों के लाखों लोगों,

उनके परिवारों sakiccindi के लिए विज्ञापन को रद्द करने के लिए। भारतीय काला धन सोने खाड़ी देशों से आने के रूप में अच्छी तरह से .. इस घोषणा के बिजली द्वारा मारा गया था का मुख्य स्रोत है। खाड़ी देशों स्थानीय डॉलर karensitopatu पैसा .

. का आदान-प्रदान करने के लिए करते हैं, यूरो, ज्यादातर भारतीय नोट में बेच दिया। संबंधित मुद्राओं में संग्रहीत नकदी की पकड़ बंडलों के

భర్తలను కొట్టడంలో భారతీయ భార్యలది మూడో ర్యాంక్

గృహ హింస అంటే అందరికీ మహిళలే గుర్తుకొస్తారు. భర్తల చేతుల్లో హింసకు గురయ్యే సంఘటనల గురించే అందరూ చర్చింకుంటారు. అయితే గృహ హింసకు లింగ భేదం లేదని… ఆడ,మగ తేడా లేకుండా అందరూ హింసకు గురవుతున్నారంటున్నాయి తాజా రిపోర్టులు. ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన రిపోర్ట్ ఒకటి ఈ విషయాన్నే తెలుపుతోంది.







మాటకు మాట అనుకోవడం.. మగాళ్లైతే చేతికి పని చెప్పడం.. ఆడాళ్లైతే గరిటెలు, చీపుర్లతో విరుచుకుపడటం కూడా షరామామూలే. అయితే ఈ విషయంలో ఇప్పుడు ఆడాళ్లదే పై చేయి అవుతోంది. భార్యా బాధితులు అధికంగా ఉన్న దేశాల్లో ఈజిప్టు, ఇంగ్లాండ్, భారత్ లు టాప్ ప్లేస్ లో ఉన్నాయి.





భర్తలను తిట్టడం, కొట్టడంలో ఈజిప్టు మహిళలు ఫస్ట్ ర్యాంకు కొట్టేశారు. రెండో ర్యాంకులో బ్రిటన్ మహిళలు సాధిస్తే.. ఇండియా థర్డ్ ప్లేస్ లో నిలిచింది. ఆయా దేశాల ఫ్యామిలీ కోర్టుల్లోని కేసులను పరిశీలించగా ఈ విషయాలు తెలిశాయి.



ఈజిప్టులో 66 శాతం మంది మహిళలు భర్తలను చితకొట్టి విడాకులు తీసుకుంటున్నారట. ఇక భారతీయ మహిళలైతే చేతికి దొరికిన సూదులు, చీపురులు, గరిటెలు, గిన్నెలు, కిచెన్ నైవ్స్ , చెప్పులతో దాడులు చేస్తున్నారట. కోర్టుల్లో భార్యాబాధితుల కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయని తెలిపింది ఆ నివేదిక.
.