Sunday, 18 March 2018

విళంబి నామ సంవత్సరం రాశిఫలాలు మకరం Capricorn 2018 results

మకరం

ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆదాయం: 8; వ్యయం: 14

రాజపూజ్యం: 4; అవమానం: 5
మిశ్రమకాలం. ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే విజయం అవలీలగా వస్తుంది. ఆత్మవిశ్వాసంతో కార్యాలను పూర్తిచేస్తారు. కొన్ని సందర్భాల్లో ఒకటనుకుంటే ఇంకొకటి అవుతుంది. మొహమాటంతో అనవసర ఖర్చులు పెరుగుతాయి. భవిష్యత్తు ప్రణాళికలు ఫలిస్తాయి. ఒక శుభవార్త మీ ఇంట సంతోషాన్ని నింపుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో  పాల్గొంటారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. సమయానుకూలంగా వ్యవహరించండి.


 లక్ష్యం మీద అవగాహనతో ముందుకు సాగాలి. తోటివారికి ఉపయోగపడే పనులు చేపడతారు. ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఏకాగ్రతకు భంగం కలగకుండా వ్యవహరిస్తే సరిపోతుంది. ఎంతటి క్లిష్ట కార్యాన్నైనా ఇట్టే సాధించగల సమర్థత ఏర్పడుతుంది. బంధుమిత్రుల సలహాలు మేలైన ఫలితాలను ఇస్తాయి. ముఖ్యమైన విషయాలపై శ్రద్ధ పెట్టాలి. ఆర్థికాంశాల్లో లాభాలున్నాయి. మానసిక దృఢత్వం అవసరం. ఉద్యోగంలో ఖ్యాతి గడిస్తారు. విందువినోదాల్లో పాలుపంచుకుంటారు. సంపాదన పెరుగుతుంది. ఖర్చు తగ్గిస్తే స్థిరాస్తులు ఏర్పడతాయి. సాహసం చేసి తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాన్నిస్తాయి. శక్తిసామర్థ్యాలు పెరుగుతాయి.



సమాజంలో మంచిపేరును సంపాదిస్తారు. కుటుంబసభ్యులతో విభేదాలు రాకుండా జాగ్రత్తపడండి. మాట పట్టింపులకు పోకండి. కార్యసిద్ధిలో అలుపెరగని శ్రమ అవసరం. అనేక విజయాలకు ఇది సరైన కాలం. అందుకు అవసరమైన శక్తి దైవబలంతో మీకు లభిస్తుంది. వ్యాపారంలో ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయండి. అపార నష్టానికి అవకాశముంది. ఆరోగ్యరీత్యా కొంత ఇబ్బంది తలెత్తే అవకాశముంది. వ్యాపారస్థులకు అనుకూలమైన కాలం. మనసులో చెడు ఆలోచనలు రానీయకండి. ఒక వార్త మనోబలాన్ని పెంచుతుంది. ముందస్తు జాగ్రత్తలు అవసరం. అవసరానికి మించి ఖర్చులుంటాయి. విద్యార్థులకు ఆటంకాలు ఎదురవుతాయి.




 మహిళలకు కొంత శ్రమ ఉన్నా పట్టుదలతో విఘ్నాలను అధిగమిస్తారు. ఆర్థికంగా బలపడతారు. ధనధాన్యాది లాభాలున్నాయి. నూతన పనులు ప్రారంభిస్తారు. స్వేచ్ఛా భావాలతో ఆనందంగా ఉంటారు. గౌరవం పెరుగుతుంది. తగినంత గుర్తింపు లభిస్తుంది. అన్ని రంగాల్లో ముందుకు దూసుకువెళ్తారు. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. ఆంజనేయ స్తోత్రం చదవాలి. శ్రీరామ దర్శనం ఉత్తమం. నువ్వులూ, మినుములూ దానం చేయాలి.
ఈ రాశివారి అదృష్ట సంఖ్య 8, కలిసొచ్చే వారం - శుక్రవారం, రంగులు - నీలం, తెలుపు. అదృష్ట దైవం లక్ష్మీదేవి.

విళంబి నామ సంవత్సరం రాశిఫలాలు ధనుస్సు Sagittarius results 2018

ధనుస్సు


మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
ఆదాయం: 5; వ్యయం: 5

రాజపూజ్యం: 1; అవమానం: 5
బలమైన ప్రయత్నం ద్వారా విజయం సాధిస్తారు. ఆనందకర వాతావరణం ఉంటుంది. చైతన్యవంతంగా పనులు ప్రారంభించండి. బంధుజన సహకారం పూర్తిగా ఉంటుంది.
బుద్ధిబలంతో అంచెలంచెలుగా వృద్ధిని సాధిస్తారు. నూతన కార్యాలు ఉత్సాహాన్నిస్తాయి. గతంలో పూర్తికాని పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి. ఆరోగ్యంపై అశ్రద్ధ వద్దు. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన కాపాడుతుంది. అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. తోటివారి సహకారంతో పనులు పూర్తి అవుతాయి. అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి.





 మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అదృష్టం కలిసొచ్చి గొప్ప స్థితిమంతులవుతారు. అధికార లాభం సూచితం. వస్తు వస్త్రప్రాప్తి. ఒక శుభవార్త ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది.బాధ్యతలు అధికమవుతాయి. శత్రువులు మిత్రులవుతారు. గతంలో ఆగిన పనులను మళ్లీ ప్రారంభిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. బుద్ధి బలం బాగుంటుంది. శత్రువులమీద విజయం సాధిస్తారు. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ఉద్యోగరీత్యా శుభకాలం ఉంటుంది. అందరికీ మేలు చేసే విధంగా మీ ప్రణాళికలుంటాయి. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. సొంత నిర్ణయాలు ఆనందాన్నిస్తాయి. స్వతంత్ర భావాలు రక్షిస్తాయి





. శాశ్వతమైన కీర్తి లభిస్తుంది. దయాగుణం కలిగి ఇతరులకు మేలు చేస్తారు. కుటుంబంలోని వ్యక్తులకు అభివృద్ధి బాగా ఉంటుంది. ఒక విషయంలో ధర్మసంకటం ఏర్పడుతుంది. పెద్దల సూచనలతో ఆటంకాలు తొలగుతాయి. అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారపరంగా జాగ్రత్తలు అవసరం. లక్ష్య సాధనలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా దీటుగా ఎదుర్కొంటారు. మోసపూరిత వాతావరణం ఉంటుంది.





 ఆర్థికంగా అనవసరమైన వ్యయాన్నినివారించండి. విద్యార్థులు శ్రద్ధపెట్టి చదవాలి. ప్రయాణాల్లో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించండి. అశాంతి కలిగినా వెంటనే పూర్వ పుణ్యం వల్ల శాంతి చేకూరుతుంది. కుటుంబ సభ్యుల సలహాలు అక్కరకు వస్తాయి. విభేదాలకు తావివ్వకండి. మహిళలకు పనిభారం పెరుగుతుంది. సంతృప్తినిచ్చే జీవితం లభిస్తుంది. తోటివారి సహకారం ఉంటుంది.


 ఈ రాశివారు ఆరోగ్యరీత్యా కొన్ని నియమాలు పాటించాలి. వెంకటేశ్వరస్వామిని ప్రార్థించాలి. లక్ష్మీ దర్శనం అదృష్టాన్నిస్తుంది. నువ్వులు, మినుములు దానం చేస్తే ఆపదలు తొలగుతాయి.
ఈ రాశివారి అదృష్ట సంఖ్య 3, కలిసొచ్చే వారం - మంగళవారం, రంగులు - పసుపుపచ్చ, ఎరుపు. అదృష్ట దైవం సుబ్రహ్మణ్యస్వామి.

విళంబి నామ సంవత్సరం రాశిఫలాలు వృశ్చికం Scorpio 2018 results

వృశ్చికం

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ
ఆదాయం: 2; వ్యయం: 14

రాజపూజ్యం: 5; అవమానం: 2
కల సాకారమవుతుంది. ఉత్సాహంతో పనులు ప్రారంభిస్తారు. ఆశయం వెంటనే నెరవేరుతుంది. కార్యసాధనలో మీదే పైచేయి అవుతుంది. సకాలంలో స్పందించి ఆపదలు దరిచేరకుండా జాగ్రత్తపడతారు. ఉద్యోగంలో విశేషమైన శుభయోగముంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. పట్టుదలతో ముందడుగు వేయండి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. సంబంధ బాంధవ్యాలు పటిష్ఠం చేసుకుంటారు. శ్రమ పెరుగుతుంది. అద్భుతమైన మేధోసంపత్తితో విజయాలు వశమవుతాయి. ఆర్థికంగా మంచి కాలమిది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి అవుతాయి. మాట విలువను
కాపాడుకోవాలి. అపోహలు తొలగుతాయి. నిబద్ధతతో పనిచేసి ప్రశంసలందుకుంటారు. బుద్ధిబలంతో పెద్దలను మెప్పిస్తారు. స్థానచలన సూచనలున్నాయి. బంధువుల వ్యవహారాల్లో అతి చొరవ తీసుకోవద్దు. విశేషమైన కృషి అవసరం. దయాగుణంతో వ్యవహరిస్తే బంగారు భవిష్యత్తు ఏర్పడుతుంది. సమాజంలో మీ విలువ పెరుగుతుంది.
సంతృప్తినిచ్చే ఫలితాలు వస్తాయి. వ్యాపారంలో ఒడిదొడుకులున్నా సమయస్ఫూర్తితో పనిచేసి లాభాలు రాబడతారు. పక్కనే ఉండి ఇబ్బందిపెట్టేవారున్నారు. సందర్భానుసారం మాట్లాడితే సరిపోతుంది. ఈ రాశి మహిళలకు బాగా కలిసి వస్తుంది. పని ఒత్తిడిని జయిస్తారు. సానుకూల వాతావరణం లభిస్తుంది. కుటుంబ వాతావరణం ఆనందాన్నిస్తుంది. శక్తికి మించిన పనులు చేసి సమాజంలో మీకంటూ ఒక
ప్రత్యేకమైన గుర్తింపును పొందుతారు. విష్ణు సహస్రనామం చదువుకుంటే అదృష్టం పడుతుంది. విష్ణు సందర్శనం శాంతినిస్తుంది. శనగలు, నువ్వులు దానం చేస్తే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి.
ఈ రాశివారి అదృష్ట సంఖ్య 9, కలిసొచ్చే వారం - గురువారం, రంగులు - ఎరుపు, పసుపుపచ్చ. అదృష్ట దైవం శివుడు.

విళంబి నామ సంవత్సరం రాశిఫలాలు 2018 తుల Libra results

తుల


చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆదాయం: 11; వ్యయం: 5

రాజపూజ్యం: 2; అవమానం: 2
బ్రహ్మాండమైన శుభకాలం నడుస్తోంది. అనుకున్నది సాధిస్తారు. ఎటుచూసినా విజయమే కనపడుతోంది. సందేహాస్పదమైన అంశాల్లో పనిచేసేటప్పుడు మిత్రుల సూచనలు పాటించండి. స్వయంప్రతిపత్తితో ముందుకు సాగండి. మనోబలమే విజయానికి మూలం. పెద్దల నిర్ణయాన్ని స్వీకరిస్తే ప్రశాంతత లభిస్తుంది.
కుటుంబసభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు సత్వర శుభాన్నిస్తాయి. మేలు జరిగే ఆలోచనలు కలుగుతాయి. ఉద్యోగపరంగా మంచి ఖ్యాతిని గడిస్తారు. వ్యాపారయోగం బాగా కలిసి వస్తుంది. అదృష్టయోగం పడుతుంది. ఆర్థిక వృద్ధి విశేషంగా ఉంటుంది. మనోధైర్యంతో చేసే పనులు విజయాన్నిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
మీ సత్ప్రవర్తన మీ అభివృద్ధికి మూలం. సంకల్పాలు నెరవేరతాయి. చేసే పనిలో స్పష్టత పెరుగుతుంది. ముఖ్య వ్యవహారాల్లో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అర్హతనుబట్టి లాభాలుంటాయి. వినయ విధేయతలతో పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు. విద్యార్థులకు స్వల్ప ప్రయత్నంతోనే లాభం చేకూరుతుంది.
మనోభీష్టం వెంటనే నెరవేరుతుంది. అనుకున్న రంగాల్లో స్థిరపడతారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలం ముందుకు సాగుతుంది. ఒక వ్యవహారంలో గొప్ప కీర్తిని సొంతం చేసుకుంటారు. ఆరోగ్యపరంగా దృఢంగా ఉంటారు. గతంకంటే అధిక శక్తి లభిస్తుంది. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. పదిమందికీ మేలు చేస్తారు. దైవానుగ్రహంతో ఒక మంచిపని చేపడతారు. సంఘంలో ప్రత్యేక స్థానం లభిస్తుంది. భవిష్యత్తులో సుఖపడే విధంగా ఆలోచనా విధానం ఏర్పడుతుంది. దత్తాత్రేయ స్తోత్రం శుభదాయకం. లక్ష్మీదేవి సందర్శనం మేలు చేస్తుంది. శనగలు దానం చేస్తే ధనబలం మరింతగా పెరుగుతుంది.
ఈ రాశివారి అదృష్ట సంఖ్య 6, కలిసొచ్చే వారం - శనివారం, రంగులు - ఎరుపు, పసుపుపచ్చ. అదృష్ట దైవం శివుడు.

విళంబి నామ సంవత్సరం రాశిఫలాలు కన్య Virgo results 2018

కన్య

ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆదాయం: 14; వ్యయం: 2

రాజపూజ్యం: 6; అవమానం: 6
చక్కని ప్రణాళికలతో విజయం సాధిస్తారు. మనోబలంతో స్థిరమైన ఫలితాలు రాబడతారు. ఉద్యోగంలో అభివృద్ధి అద్భుతంగా ఉంటుంది. సిరిసంపదలు పుష్కలంగా సిద్ధిస్తాయి. విశేషమైన శుభ యోగాలున్నాయి. ధైర్యంగా ముందడుగువేస్తే తిరుగులేని కార్యసిద్ధి ఉంటుంది. శాశ్వతమైన శుభం ఒకటి చేకూరుతుంది. క్రమశిక్షణతో కూడిన ఫలితాలు మీకు గౌరవాన్నిస్తాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. పెద్దల అండదండలు పరిపూర్ణంగా ఉంటాయి. ఆర్థికంగా ఎదుగుదలకు ఇది సరైన సమయం. మంచి ఆలోచనలతో బంగారు భవిష్యత్తును నిర్మిస్తారు. భూలాభం ఉంది. వాహనయోగం పడుతుంది. స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నం చేస్తారు.




అదృష్టం వరిస్తుంది. ఉద్యోగపరంగా అధికారుల సహకారం లభిస్తుంది. ఆనందం కలిగించే వార్తలు వింటారు. ముఖ్య వ్యక్తులకు శుభం జరుగుతుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. దీర్ఘకాల ప్రణాళికలు ఫలిస్తాయి. సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. కొన్ని సందర్భాల్లో వికటించే ప్రమాదం ఉంది. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారంలో మంచి లాభం చేకూరుతుంది. వ్యాపారం దశదిశలా విస్తరిస్తుంది. గృహంలో శుభ కార్యాలు చేపడతారు. ఆరోగ్యంపై ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. దైవ నిర్ణయం మీకు అనుకూలంగానే ఉంటుంది. అనేకమార్గాల్లో పైకి వచ్చే సూచనలు ఉన్నాయి.విద్యార్థులకు మంచి ఫలితం లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. ప్రత్యేకంగా స్త్రీలకు విశేషమైన శుభఫలితాలున్నాయి. మనోబలం ఉంటుంది. మహాలక్ష్మీ స్తోత్రం, లక్ష్మీ దర్శనం శక్తిని పెంచుతాయి. బొబ్బర్లు దానం చేయడం వల్ల ధనయోగం ఉంటుంది.

ఈ రాశివారి అదృష్ట సంఖ్య 5, కలిసొచ్చే వారం - శనివారం, రంగులు - ఆకుపచ్చ, నీలం. అదృష్ట దైవం శివుడు.

విళంబి నామ సంవత్సరం రాశిఫలాలు సింహం leo results 2018

సింహం

మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆదాయం: 11; వ్యయం: 11
రాజపూజ్యం: 3; అవమానం: 6
బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంది. చేపట్టే పనుల్లో శీఘ్ర విజయం లభిస్తుంది. గృహలాభం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీదైన ప్రతిభను కనపరుస్తారు. ధనయోగం క్రమంగా పెరుగుతుంది. శ్రమ అధికమైనా శాంతియుతంగా జీవనం ఉంటుంది. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. విందువినోదాల్లో పాల్గొంటారు. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. మీ ఆలోచనా ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కృషి విశేషంగా


చేయడం అవసరం. విద్యార్థులకు శుభ ఫలితాలు రావాలంటే బాగా శ్రమించాలి. కొన్ని పరిస్థితులు మానసికంగా అసంతృప్తిని కలిగిస్తాయి. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నా ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. వ్యాపారాల్లో ప్రతిభే కీలకమవుతుంది. కాలం ఆనందంగా గడుస్తుంది. తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. మాటపట్టింపులకు దూరంగా
ఉండండి. కొన్ని సందర్భాల్లో శత్రువుల నుంచి అవమానాలు ఎదురవుతాయి. బుద్ధిబలంతో వాటిని ఛేదించండి. వాగ్వాదాలతో కాలం వృథా కాకుండా జాగ్రత్తపడండి. న్యాయబద్ధంగా వ్యవహరించి ఒక విషయంలో లాభపడతారు



. తొందరపడి డబ్బులు ఎవ్వరికీ ఇవ్వకండి. వ్యాపార లాభాలు ఉన్నాయి. సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప విజయాలను అందుకుంటారు. ఈ రాశి మహిళలు అన్ని రంగాల్లోనూ పురోభివృద్ధిని సాధిస్తారు. ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. ప్రతి విషయంలోనూ ఆచితూచి ఆలోచించి పనులను చక్కగా నిర్వర్తిస్తారు. వినయపూర్వకమైన ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆరోగ్యపరంగా ఈ రాశివారికి బాగుంటుంది. దుర్గాస్తోత్రం పఠించాలి. దుర్గాదేవిని సందర్శిస్తే మేలు జరుగుతుంది. మినుములు దానం ఇస్తే మనశ్శాంతి పెరుగుతుంది. ఈ రాశివారి అదృష్ట సంఖ్య 1, కలిసొచ్చే వారం - గురువారం, రంగులు - గులాబీ, పసుపు. అదృష్ట దైవం శివుడు.

విళంబి నామ సంవత్సరం రాశిఫలాలు కర్కాటకం Cancer 2018 results

కర్కాటకం

పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష
ఆదాయం: 8; వ్యయం: 2;

రాజపూజ్యం: 7; అవమానం: 3
సంపదలు సమకూరుతాయి. కొన్ని ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు  సాగుతారు. కలహాలకు అవకాశముంది. ప్రతిదీ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలున్నాయి. వ్యాపార రంగంలోని వారికి ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అనుకోని ఖర్చులు వచ్చిపడతాయి. గొప్ప ప్రయత్నంతో ఆస్తి వృద్ధి చెందుతుంది. శత్రుబాధ తొలగుతుంది. కలహాలకు దూరంగా ఉండాలి. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. శుభకార్య ప్రసక్తి ఉంది. సంతానాభివృద్ధికి సంబంధించిన
శుభవార్తలు వింటారు. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కీలక నిర్ణయాల్లో దృఢంగా వ్యవహరించాలి. బంధుమిత్రుల సలహాలూ సూచనలూ అవసరమవుతాయి. ముఖ్య వ్యవహారాలకోసం పెద్దలను సంప్రదిస్తారు. ఆర్థికంగా బాగా లాభపడతారు. చర స్థిరాస్తులు అభివృద్ధి చెందుతాయి. సాంకేతికపరంగా గొప్ప అభివృద్ధిని సాధిస్తారు. మనసు చెడును ఊహిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలు మానసిక ప్రశాంతతను ఇస్తాయి.


 వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ వాతావరణం ఉంటుంది. పై అధికారుల నుంచి కొంత ఒత్తిడి ఉన్నా అంతిమంగా విజయం లభిస్తుంది. ఆశించిన ఫలితం నిదానంగానైనా వస్తుంది. ప్రయత్నం మాత్రం గట్టిగా ఉండాలి. ఎవ్వరితోనూ విభేదించవద్దు. శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారపరంగా ధనలాభం ఉంది. కీలక పనుల్లో జాప్యం జరిగే సూచనలు ఉన్నాయి. శుభవార్తలు వింటారు. అయితే శ్రమ అధికంగా ఉంటుంది. చిన్నవిషయానికి కూడా అధికంగా ప్రయత్నం చేయాల్సిన కాలం. నూతన వాహనాలు లేదా వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆటంకాలు ఎదురైనా దృఢ చిత్తంతో ముందుకు సాగుతారు. కుటుంబసభ్యుల సలహాలు అక్కరకు వస్తాయి.




అవసరానికి డబ్బు చేతికందుతుంది. ఆరోగ్యపరంగా అనుకూల ఫలితం ఉంటుంది. ప్రయాణాల్లో జాగరూకత అవసరం.శత్రుబాధ తొలగుతుంది. ఆర్థిక వ్యయం పెరిగినా పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. స్థానచలన సూచనలు ఉన్నాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదవాల్సిన కాలం. మహిళలకు సమాజంలో చక్కని గౌరవం లభిస్తుంది. భవిష్యత్తును బాగా తీర్చిదిద్దుతారు. ఎంచుకున్న రంగాల్లో బాగా రాణిస్తారు. తెలివితేటలు వృద్ధి చెందుతాయి. సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. గణపతి దర్శనం ఉత్తమం. కందులు
దానం చేస్తే రుణ సమస్యలు తొలగుతాయి.ఈ రాశివారి అదృష్ట సంఖ్య 2, కలిసొచ్చే వారం - మంగళవారం, రంగులు - తెలుపు, ఎరుపు. అదృష్ట దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు.