Thursday, 1 December 2016

తిరుమలలో శ్రీవారి ముందున్న గడపకు కులశేఖరపడి అని పేరు ఎలా వచ్చింది.?

కులశేఖరుడు కేరళ దేశానికి చెందిన మహారాజు. ఆయన వైష్ణవ భక్తగ్రేసరులైన ఆళ్వారులలో ఒకరు. కులశేఖరుడు శ్రీవారికి పరమభక్తుడు. పవిత్ర క్షేత్రమైన వెంకటాచలాన్ని ఉద్దేశించి, తమిళంలో 11 పాశురాలను ప్రవచించాడు. స్వామివారిని అర్థిస్తూ ఒక కోరికను కోరాడు. ‘ఓ శ్రీ‌ వేంకటేశ్వరస్వామీ నీ దివ్యమంగళ స్వరూపం ముందు రాతి గడపగా ఉండేలా వరం ప్రసాదించమని వేడుకున్నాడు. ఆయన కోరిక తీర్చడానికి అన్నట్లు శ్రీవారి ముందున్న గడపకు కులశేఖరపడి అని పేరొచ్చింది. పడి అనగా గడప లేదా మెట్టు అని అర్థం.
బంగారు కులశేఖర పడిని దాటిన తర్వాత ఉన్నదే శ్రీవారి గర్భాలయం. శ్రీ వేంకటేశ్వరస్వామివారు స్వయంభువుగా సాలగ్రామ శిలామూర్తిగా ఆవిర్భవించి నిలచిన ప్రాంతమే గర్భాలయం

No comments:

Post a Comment