మనం తరచుగా తిరుమల వెళ్తూ ఉంటాం. కానీ
వెంకటేశ్వర స్వామి గురించి మనకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి. ఆ విషయాలను
తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు ఆ వివరాల గురించి
తెలుసుకుందాం.
1. శ్రీవారి ఆలయ మహాద్వారానికి కుడి వైపున వెంకటేశ్వర స్వామి వారికి
తలపై అనంతాళ్వార్ కొట్టిన గునపం ఉంటుంది. చిన్న పిల్లవాడిగా ఉన్న
స్వామివారిని ఆ గునపంతో కొట్టడంతో స్వామి వారి గడ్డంపై గాయమై రక్తం
వస్తుంది. అప్పటి నుంచే స్వామివారి గడ్డానికి గంధం పూసే సాంప్రదాయం
ప్రారంభం అయింది.2. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు (నిజమైన జుట్టు) ఉంటుంది. ఆ జుట్టు అసలు చిక్కు పడదని చెప్పుతూ ఉంటారు.
3. తిరుమలలో ఆలయం నుంచి 23 కిలోమీటర్ల
దూరంలో ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామం నుండే గర్భగుడిలోకి అవసరమైన పాలు,
పూలు, నెయ్యి, వెన్న వంటివి వస్తాయి. ఆ గ్రామంలోకి ఇతరులకు ప్రవేశం లేదు. ఆ
గ్రామంలోని ప్రజలు చాలా పద్దతిగా ఉంటారు.
4. స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తారు. కానీ నిజానికి ఆయన
గర్భగుడి కుడివైపు కార్నర్‌లో ఉంటారు. బయటి నుంచి గమనిస్తే ఈ విషయం మనకు
అర్ధం అవుతుంది.
5. శ్రీవారికి ప్రతిరోజూ కింద పంచె, పైన చీరతో అలంకరిస్తారు. దాదాపు రూ.50
వేల ఖరీదు చేసే వస్త్ర సేవ ఉంటుంది. ఆ సేవలో పాల్గొన్న దంపతులకు చీరను,
పురుషులకు పంచెను అందిస్తారు. ఈ చీరను చాలా తక్కువ ధరకే అమ్ముతారు.
6. గర్భగుడిలో నుంచి తీసి వేసిన పువ్వులు అసలు బయటికి రావు. స్వామి వెనుక ఒక నుయ్యి ఉంటుంది. అందులో వెనక్కి చూడకుండా విసిరేస్తారు.
7. శ్రీనివాసునికి వీపుమీద ఎన్నిసార్లు
తుడిచినా తడి ఉంటుంది. అలాగే అక్కడ చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష
విన్పిస్తుందని చెప్పుతారు.
8. స్వామివారి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది. ప్రతి గురువారం నిజరూప
దర్శనం సమయంలో స్వామివారికి చందనంతో అలంకరిస్తారు. అది తీసివేసినప్పుడు
లక్ష్మీ దేవి రూపం అలానే కన్పిస్తుంది.
No comments:
Post a Comment