Wednesday, 30 November 2016

మీరు ఎక్కడున్నా మొబైల్‌తోనే ఫ్యాన్లు, లైట్లను ఆపరేట్ చేయొచ్చు

  • లైట్లు, ఫ్యాన్లకు మొబైలే స్విచ్‌
  • ఎక్కడి నుంచైనా ఆపరేట్‌
  • సృజనాత్మకతతో ముందుకొస్తున్న ‘ఫైర్‌ఫ్లై’
  • ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ అంటున్న కొత్త స్టార్టప్‌

తాళం తీయకుండానే ఇంట్లో కావాల్సిన లైట్లు ఫ్యాన్లు సిద్ధంగా ఉంటే .. సాయంత్రం ఆరు నుంచి ఉదయం ఆరు వరకు బయటలైటు దానంతట అదే వెలిగి అదే ఆగిపోతే ఎలా ఉంటుంది.. సరిగ్గా ఇదే ఆలోచన చేసిన నిషీత అనే యువకుడు.. వీటిని నిజం చేస్తూ సృజనాత్మక స్టార్టప్‌కి రూపాన్నిచ్చాడు. సమాజ అవసరాలకు సంబంధించిన ఏదో ఒక ఇన్నోవేషన్‌ చేయాలనే ఉద్దేశంతో మొబైల్‌ యాప్‌ ద్వారా ఇంట్లో లైట్లు, ఫ్యాన్లు ఎలా కంట్రోల్‌ చేయాలనే నిర్ణయించి ఫైర్‌ఫ్లై అనే స్టార్టప్‌కు రూపాన్నిచ్చారు.

ఎవ్రిథింగ్‌ ఎవ్రీవేర్‌ అనే స్లోగన్‌తో ప్రారంభించిన ఈ స్టార్టప్‌ ఆ దిశగానే అడుగులు వేసింది. ఇంట్లో ఉండే లైట్లను మాత్రమే కంట్రోల్‌ చేసుకోవాలంటే ఫైర్‌ఫ్లై 2.0ని సిద్ధం చేశారు. దీన్ని స్విచ్‌బోర్డుకు బిగించి దీనికిచ్చిన ఫాస్‌కీ ద్వారా మొబైల్‌ యాప్‌లో ఈ పరికరానికి అనుసంఽ ధానించొచ్చు. అప్పుడు దీన్లోఉండే రెండు మాడ్యూ ళ్లను అది కంట్రోల్‌ చేస్తుంది. ఫైర్‌ఫ్లై 2.1తో రెండు లైట్లు ఒక ఫ్యాన్‌ని కంట్రోల్‌ చేయొచ్చు. యాప్‌కి అనుసంధానిం చిన తర్వాత ఎంత స్పీడ్‌ పెట్టుకోవాలో కూడా మొబైల్‌లోనే మార్చుకోవచ్చు. మొత్తానికి మాస్టర్‌ బటన్‌ ఉంటుంది. దాంతో అన్ని ఒకేసారి ఆపొచ్చు. ఒకేసారి ఆన్‌కూడా చేయొచ్చు. ఇంట్లోకి వస్తూనే చీకటిగా ఉందని కంగారుప డాల్సిన ఇబ్బంది లేకుండా ఉపయోగపడుతుంది.

దూరంగా ఇంటర్నెట్‌... దగ్గర వైఫై
ఈ పరికరాలను అనుసంధాంచడానికి పెద్ద కష్టపడాల్సిన పనిలేదు . స్విచ్‌బోర్డుకి ‘ఫైర్‌ఫ్లై’ని కలిపితే చాలు. దీంట్లో ఉండే వైఫై చిప్‌ ద్వారా మొబైల్‌లోని వైఫైకి అనుసంధానం అవుతుంది. ఇంటి ఆవరణలో ఉన్నంత సేపూ ఇంటర్నెట్‌ లేకున్నా పనిచేస్తుంది. దూరం వెళితే మాత్రం మొబైల్‌కి, ‘ఫైర్‌ఫ్లై’కి ఇంటర్నెట్‌ అనుసంధానిచాల్సి ఉంటుంది. సింగిల్‌ బెడ్‌రూం ఇంట్లో 8 లైట్లు, మూడుఫ్యాన్లు తిరిగేలా ఈ సిస్టమ్‌ బిగించాలంటే కేవలం రూ.8490లోపే సాధ్యమవు తుందని వ్యవస్థాపకులు తెలిపారు. విడిగా రెండు లైట్లు, లేదా రెండు లైట్లు ,ఫ్యాను కోసం కూడా వేరే మాడ్యూళ్లు కొనుగోలు చేయొచ్చన్నారు.


ఫేవరెట్‌ మెనూ..
ఇంట్లోకి అడుగు పెడుతూనే హాల్లో ఒక లైట్‌, బెడ్‌ రూంలో ఒక లైట్‌, ఫ్యాను మాత్రమే వెలగాలి అనుకుంటే ఫేవరెట్‌ మెనూ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. కావాల్సిన స్విచ్‌పై స్టార్‌ సింబల్‌ పెట్టుకుంటే చాలు ఒకే బటన్‌తో మొత్తం ఒకేసారి ఆన్‌ అవుతాయి.. ఒకేసారి ఆగుతాయి.. చివరకు రె గ్యులర్‌గా ఫ్యాన్‌ ఎంత స్పీడ్‌లో ఉండాలో కూడా సెట్‌ చేసి పెట్టుకోవచ్చు. అంతకుముందు ఎంతలో ఉన్నా దానంతటదే మారిపోతుంది. దీంతోపాటు షెడ్యూల్‌ ఆన్‌ఆఫ్‌సెట్‌ చేసుకోవచ్చు.. సాధారణంగా బయట ఉండే లైట్‌ సాయంత్రం 6గంటలకు వేసి రాత్రి పడుకునేముందు లేదా ఉదయాన్నే ఆపేస్తూ ఉంటారు.. ఇలా నిత్యం చేసే పనికి షెడ్యూల్‌ పెట్టుకుంటే చాలు దానిగురించి ఆలోచిం చాల్సిన పనే ఉండదు.. కుటుంబంలో ఎన్ని మొబైళ్లు ఉన్నా వాటన్నింటిలోనూ మాడ్యూళ్లను యాడ్‌చేసుకోచ్చు ఫైర్‌ఫ్లై పాస్‌కీ ద్వారా వీటిని అనుసంధానించుకోవచ్చు ప్రస్తుతం ఈ యాప్‌ ఉచితంగా యాపిల్‌, ఆండ్రాయిడ్‌ స్టోర్స్‌లో లభ్యమవుతోందని వ్యవస్థాపకులు తెలిపారు. ఒకసారి మాడ్యుల్‌ కొనుగోలు చేసుకున్నవారు ఎన్నిమైళ్ల నుంచైనా వాడుకునేందుకు వీలుకలుగుతుందని పేర్కొన్నారు.

త్వరలో బోర్లు, ఏసీ, గ్రీజర్లకూ స్మార్ట్‌కంట్రోల్‌ ప్రస్తుతం ఇంట్లోని లైట్లు, ఫ్యాన్లకు విజయవంతగా స్మార్ట్‌ కంట్రోల్‌ చేయగలిగాం. రెండు మూడునెలల్లో ఏసీలు, గ్రీజర్లు, బోర్లు పనిచేసేలా రూపొందిస్తాం. ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రయ త్నిస్తున్నాం. దేశంలోని మెట్రో సిటీ మార్కెట్‌పై ప్రధానంగా దృష్టిసారించాం. ప్రస్తుతం అమెజాన్‌ ద్వారా అమ్మకాలు బాగా జరుగుతున్నాయి. ఆఫ్‌లైన్‌ మార్కెట్‌లోనూ డీలర్లతో చర్చిస్తున్నాం.

No comments:

Post a Comment