Wednesday, 30 November 2016

వారంలో ఇన్ని రోజులుండగా ఆదివారమే సెలవు ఎందుకుందో తెలుసా?

నిత్యం యంత్రంలా పని చేసుకుంటూ పోతున్న ఉద్యోగుల నుంచి పాఠశాలకు వెళ్తున్న విద్యార్థల వరకూ ఆదివారం వస్తుందంటే ముందు రోజు ఉండే ఆనందమే వేరని చెప్పనక్కర్లేదు. ఆదివారం వచ్చిదంటే చాలు నిత్యం చేస్తున్న పనులన్ని పక్కన పెట్టేసి ఎంతో ఆనందంగా గడిపేస్తుంటారు. ఇలాంటి సమయంలో ఎప్పుడైనా ఆదివారమే సెలవు రోజుగా ఎందుకు ఉందని ఆలోచించారా?


 వారంలో ఏడు రోజులుండగా ఆదివారానికే అంత ప్రత్యేకత ఎందుకు కల్పించారు? ఈ విషయం తెలుసుకోవాలంటే భారత దేశ చరిత్రలోకి వెళ్లాల్సిందే... బ్రిటీష్ వారు భారత దేశాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో భారతీయుల చేత  వారంలో ఏడు రోజుల పాటు  పనిచేయుంచుకునేవారు.



 ఈ విధానం పోవాలని నారాయణ్ మేఘాజీ లోఖండే 1881 నుంచి 1889 వరకు వారితో పోరాడారు. భారతీయులు వారం రోజుల పాటు పని చేయలేరని వారి కోసం ఆదివారాన్ని సెలవుగా ప్రకటించాలని గట్టిగా ఆయన పోరాడారు. దీనిని బ్రిటీష్ వాళ్లు తిరష్కరించారు. దినికి ప్రధాన కారణమేమంటే ఆనాడు చాలా దేశాలు బ్రిటీష్ వారి చెప్పుచేతల్లోనే ఉండేవి కాబట్టి



 భారతీయులకు ఆదివారం సెలవు ప్రకటిస్తే మిగితా దేశాల్లో కూడా సెలవు ప్రకటించాల్సి వస్తుందని వాళ్లు ఒప్పుకోలేదు. భారతీయుల కోసం నారాయణ్ మేఘాజీ లోఖండే మాత్రం పట్టు వదలకుండా తొమ్మిది సంవత్సరాల పాటు బ్రిటీష్ వాళ్లతో పోరాడి విజయం సాధించాడు. ఆయన పోరాటం వల్ల చివరకూ బ్రిటీష్ వాళ్లే ఆదివారం సెలవు ఉండేలా ప్రకటించారు. దాంతో నాటి నుంచి నేటి వరకూ మిగిలిన దేశాల్లో కూడా ఆదివారం సెలవు రోజుగా ఉంది.

No comments:

Post a Comment