అక్కినేని నాగేశ్వర రావు వారసుడిగా టాలీవుడ్లో కి అడుగుపెట్టి తనదైన యాక్టింగ్ తో, తనదైన డిక్షన్ తో తెలుగు ప్రేక్షకుల్లో యువ సామ్రాట్ గా , ఆ తర్వాతా టాలీవుడ్ మన్మథుడిగా , టాలీవుడ్ కింగ్ గా తెలుగు ప్రేక్షకుల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు.. తొలి సినిమా విక్రమ్ నుంచి ఇప్పటి ఊపిరి వరకు విలక్షణమైన నటనను చూపించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించున్న నాగార్జున పుట్టిన రోజు ఈరోజు..
భక్తి రస చిత్రాలు తీయాలంటే గుర్తొచ్చేది నాగ్.. లవ్ సినిమాలు చేయాలంటే జ్ఞాపకం వచ్చేది నాగ్.. మాస్ సినిమా లకు పెర్మనెంట్ అడ్రస్, పీరియాడిక్ సినిమాలకు కేర్ అఫ్ అడ్రస్.. అన్ని రకాలా సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పెట్టారు.. ఒక యాక్టర్ గా, ఒక ప్రొడ్యూసర్ గా, ఒక ప్రజెంటర్ గా అన్ని రకాల పాత్రలు పోషిస్తూ టాలీవుడ్ కే కాదు అన్ని వుడ్ లకు పరిచమయి అక్కడ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు..
ప్రతిభావంతులైన కొత్త వారిని ప్రోత్సహిస్తూ ఎంతో మందికి మంచి భవిష్యత్ ని అందించిన నాగ్ నుంచి వచ్చిన కొన్ని మంచి సినిమాల గురించి తెలుసుకుందాం..
















































