Thursday, 4 August 2016

బ్లాక్ టీ ,లెమన్ టీ, గ్రీన్ టీ బెల్లీ ఫ్యాట్ ని తగ్గిస్తుంది

నల్ల మిరియాల్లో పిపెరైన్ ఉంటుంది. ఇది ఫ్యాట్ ని కరిగించడంలో సహాయపడుతుంది. నల్లమిరియాలు, అల్లంను నీటిలో 5 నిమిషాలు ఉడికించాలి. వడకట్టిన తర్వాత.. తేనె కలిపితే.. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఈ టీ తాగడం వల్ల ఎఫెక్టివ్ ఫలితాలు పొందవచ్చు
గ్రీన్ టీలో కెటాచిన్ ఉంటుంది. ఇది ఫ్యాట్ సెల్స్ ని తగ్గిస్తుంది. బెల్లీ ఫ్యాట్ ని కరిగిస్తుంది. ఒక కప్పు హాట్ వాటర్ తీసుకుని అందులో గ్రీన్ టీ బ్యాగ్ వేసి.. 2 నిమిషాలు వదిలేయాలి. ఇప్పుడు టీ బ్యాగ్ తీసేసి.. తేనె, నిమ్మరసం కలిపి తీసుకుంటే.. మంచి ఫ్లేవర్ టేస్ట్ చేయడంతో పాటు, ఫ్యాట్ కరిగిస్తుంది.
లెమన్ టీలో డి లెమనిన్ ఉంటుంది. ఇది బెల్లీ ఫ్యాట్ ని తగ్గిస్తుంది. టీ ఆకులు, నిమ్మకాయ, చెక్కను ఉడికించాలి. వడకట్టి.. తీసుకోవాలి. అంతే.
బ్లాక్ టీలో ఫోలిఫెనాల్స్ ఉంటాయి. ఇవి బరువు తగ్గించడంలో ఎఫెక్టివ్ గా ఉపయోగపడతాయి. నీళ్లు మరిగించి, కొన్ని టీ ఆకులు కలపాలి. 3 నుంచి 4 నిమిషాలు ఉడికించి.. వడకట్టి.. తీసుకోవాలి.
పుదినలో మెంతాల్ ఉంటుంది. ఇది ఫ్యాట్ సెల్స్ తగ్గించడంలో సహాయపడుతుంది. హాట్ వాటర్ లో పుదీనా ఆకులు వేసి.. 10 నిమిషాలు మరిగించాలి. తర్వాత వడకట్టి.. తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ ఎఫెక్టివ్ గా తగ్గుతుంది
దాల్చిన చెక్కలో పోలిఫెనాల్స్ ఉంటాయి. ఇవి క్యాలరీలు కరిగించడంలో సహాయపడతాయి. మరుగుతున్న నీటిలో కొన్ని టీ ఆకులు, దాల్చిన చెక్క పొడి, పాలు కలపాలి. 5 నిమిషాలు ఉడికించిన తర్వాత.. వడకట్టి తీసుకోవాలి.
జీలకర్రలో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి. మరుగుతున్న నీటిలో కొన్ని జీలకర్ర సీడ్స్ కలపాలి. తేనె, నిమ్మ చుక్కలు కలపాలి. టేస్టీగా ఉంటుంది. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల.. బరువు తగ్గడం తేలికవుతుంది
అల్లంలో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి బరువు తగ్గించడంలో సహాయపడతాయి. మరుగుతున్న నీటిలో అల్లం ముక్కలు కలపాలి. అలాగే కొన్ని తులసి ఆకులు కలపాలి. తర్వాత తేనె కలుపుకుని తీసుకోవడం వల్ల ఫ్యాట్ కరిగించడం తేలికవుతుంది.
తులసిలో ఫైటో న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇవి ఫ్యాట్ సెల్స్ కిల్ చేయడంలో సహాయపడతాయి. టీ ఆకులు, అల్లం, పాలు, తులసి ఆకులు నీటిలో కలిపి.. మరిగించాలి. తర్వాత వడకట్టి.. తీసుకోవాలి.




No comments:

Post a Comment