పీచు పదార్ధం అధికంగా ఉన్న ఆహారం తినడం: కొలెస్ట్రాల్ స్థాయి నియంత్రించడానికి, తగ్గించడానికి, ప్రత్యేకంగా తక్కువ శుద్ది చేసిన పిండితో చేసిన రొట్టె వంటి పీచు పదార్ధాలు ఎక్కువగా వుండే ఆహారాలను తప్పక తీసుకోండి. అదనంగా మీరు గింజలు, తృణ ధాన్యాలను అధికంగా తీసుకోవాలి. ఈ ఆహారం కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడమే కాకుండా, మీరు వినియోగించే క్యాలరీల మొత్తాన్నీ కూడా తగ్గిస్తుంది. అధిక క్యాలరీలు సహజంగా శరీరంలో కొవ్వుగా మార్చబడతాయి. మీ శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటే, దానివల్ల కొలెస్ట్రాల్ స్థాయి పెరిగి ప్రమాదం కలుగుతుంది.
నిమ్మజాతికి చెందిన పండ్లన్నీ గుండెకు మేలు చేసేవే. బాగా పండిన నారింజలో విటమిన్ -ఏ, బి6, సి పుష్కలంగా ఉంటాయి. దాంతోపాటు ఫోలేట్ పొటాషియమ్, ఫైబర్ ఎక్కువ. పొటాషియమ్ వల్ల రక్తపోటు తగ్గుతుంది. గుండెకు రక్షణ కలుగుతుంది. వీటిలో పదార్ధాలలో కొవ్వు స్థాయి చాలా చాలా తక్కువ. ఈ ఆహారంలో సహజంగా మినరల్స్, విటమిన్లు ఉంటాయి.
మష్రుమ్ లో ఎరిటేడినైన్ శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇంకా ఇందులో లెటినిన్ అనే పోషకాంశం కొలెస్ట్రాల్ మాత్రమే తగ్గించడం మాత్రమే కాదు ఇది క్యాన్సర్ రిస్క్ ను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
బీటా కెరోటిన్, క్యారెట్ లో పుష్కలంగా ఉంటుంది. ఇది ఒక పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ ను నేచురల్ గా తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ ను సహజంగా ట్రాక్ లో ఉంచుకోవడానికి ఇది ఒక ఉత్తమమైనటువంటి వెజిటేబుల్.
బీన్స్ లో కరిగే ఫైబర్ కలిగి ఉంది. ఇది జీర్ణక్రియకు చాలా మేలు చేస్తుంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. ఇది కొలెస్ట్రాల్ ను మరియు బరువును తగ్గిస్తుంది. బీన్స్ లో ఉండే హై ఫైబర్ కంటెంట్ శరీరంలో షోషింపబడుతుంది.
ఓట్ మీల్ లో సొల్యుబుల్ ఫైబర్ మాత్రమే కాదు.. బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. బ్రేక్ ఫాస్ట్ గా ఓట్ మీల్ తీసుకోవడం మంచిది. లేదా ఓట్ బ్రాన్ ని పెరుగపై చల్లుకుని తిన్నా మంచి ఫలితం ఉంటుంది.
సోయా బీన్స్ లో శ్యాచురేటెడ్ ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని డైట్ లో చేర్చుకోవడం వల్ల ప్రొటీన్స్ ని శరీరంలో పెంచడం మాత్రమే కాదు.. 8 నుంచి 10 శాతం కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.

No comments:
Post a Comment