రోజూ ఒక ఆపిల్ తినడం అలవాటు చేసుకోవాలి. ఆపిల్‌లో ఐరన్, ఫాస్పరస్, కాల్షియం, పొటాషియం, విటమిన్-ఎ, బి, సి ఉంటాయి. ఆపిల్స్ లో విటమిన్ సి మరియు పెక్టిన్ అనే పదార్థం పుష్కలంగా ఉంది. పెక్టిన్ అనే ఫైబర్ బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.
పాలు, పాల ఉత్పత్తులు తీసుకోవాలి. పాల ఉత్పత్తులో ఫ్యాటీ యాసిడ్స్ యాంటీ అక్సిడెంట్లు, పాలిఫెనాల్స్ ఉంటాయి. పాలిఫెనాల్స్ రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. గుండె సంబంధ వ్యాధులు రాకుండా కాపాడతాయి.
వెల్లుల్లిలో ఐసిన్ అనే యాంటి అక్సిడెంట్ ఉంటుంది. ఇది చెడు కొలెసా్ట్రల్‌ను తగ్గిస్తుంది. రక్తనాళాల్లో క్లాట్స్ ఏర్పడకుండా కాపాడుతుంది.ఇందులోని యాంటీ బాక్టీరియల్ యాసిడ్స్ కొవ్వును బాగా తగ్గిస్తాయి. అందుకే వెల్లుల్లిని 'ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్' అని పిలుస్తారు. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, అధిక రక్తపోటు సమస్యను నివారించడంలో వెల్లుల్లి పాత్ర ఎనలేనిది.
గ్రీన్ టీ బ్యాడ్ కొలెస్టాల్ ను తగ్గించే గుణాలు అధికంగా ఉన్నాయి. రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడంతో పాటు, బ్లడ్ క్లాట్స్ కాకుండా నివారిస్తుంది. బ్లడ్ వెజల్స్ రిలాక్స్ చేస్తుంది. టీలో ఫ్లెవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. బ్లడ్ ప్లెజర్ లెవల్స్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది

No comments:
Post a Comment